Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి అశోక్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ను మరమ్మత్తుల కారణంతో మూడు రోజుల పాటు రైల్వే గేట్ మూసివేత కామారెడ్డి అశోక్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ను మరమ్మత్తుల కారణంతో శుక్రవారం ఉదయం నుంచి మూసివేశారు. ఈ నెల నేటి నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు పనులు జరుగుతాయని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో బస్టాండ్, డైలీ మార్కెట్, కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మరో రైల్వే బ్రిడ్జి మంజూరు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
Narmala Swapna
కామారెడ్డి అశోక్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ను మరమ్మత్తుల కారణంతో మూడు రోజుల పాటు రైల్వే గేట్ మూసివేత కామారెడ్డి అశోక్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ను మరమ్మత్తుల కారణంతో శుక్రవారం ఉదయం నుంచి మూసివేశారు. ఈ నెల నేటి నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు పనులు జరుగుతాయని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో బస్టాండ్, డైలీ మార్కెట్, కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మరో రైల్వే బ్రిడ్జి మంజూరు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి వివేకానంద కాలనీలోని రేషన్ షాప్ ను ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కమిషన్ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రేషన్ షాప్ ద్వారా ప్రజలకు అందుతున్న ప్రజా అవసరాల సరుకుల పంపిణీ పై డీలర్ ని అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీ పై పలు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీఏ సురేందర్, DM శ్రీకాంత్ ఉన్నారు.1
- సేవాలాల్ మహరాజ్ ఆదర్శ ప్రాయుడు ---అదనపు కలెక్టర్ నగేష్ బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహరాజ్ ---నర్సాపూర్ ఏం ఎల్. ఏ సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, స్థానిక ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజులు కొనియాడారు. శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజని, ఆయన చూపించిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నారు. ఈ ర్యాలీలు అదనపు కలెక్టర్ నగేష్ నిర్వాహకులతో నుత్యం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు పాల్గొన్నారు.1
- బాల్కొండ లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశామని సిపి సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపి సాయి చైతన్య ఆర్మూర్ రూరల్ ci జాన్ రెడ్డి, బాల్కొండ SI శైలేందర్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో ఆర్మూర్ కు చెందిన మహమ్మద్ అంజాద్ అలీ, అతని ఏజెంట్లుగా ఉన్న నయీమ్, అద్నాన్, మనోజ్, గోవింద్ తో పాటు ఓ బాల నేరస్తునికి ఎండు గంజాయి సరఫరా చేయగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ గంజాయి విక్రయంతో సంబంధం ఉన్న కిన్వట్ కు చెందిన మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిందితులనుంచి 1.2 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు సిపి వెల్లడించారు. నిషేధిత గంజాయి క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం గడప పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ మరియు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొత్త పాలకవర్గానికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.1
- 📍హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్ పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు1
- కామారెడ్డి అశోక్ నగర్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ను మరమ్మత్తుల కారణంతో శుక్రవారం ఉదయం నుంచి మూసివేశారు. ఈ నెల నేటి నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు పనులు జరుగుతాయని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో బస్టాండ్, డైలీ మార్కెట్, కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మరో రైల్వే బ్రిడ్జి మంజూరు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.1