సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అమరవీరుల స్ఫూర్తితో ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ, 1970 మే 30న 'ఐక్యత-పోరాటం' అనే నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని గుర్తుచేశారు. భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు మరియు కార్మిక వర్గ రాజ్య స్థాపనకై నాటి నుండి నేటి వరకు సిఐటియు నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలను నిర్వహిస్తోందని, ప్రభుత్వాల నిర్బంధాలను సైతం ఎదిరిస్తూ నిలబడిందని కొనియాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కిరణ్ డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, పెన్షన్, బీమా వంటి సౌకర్యాల సాధన కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పండుగ పొచ్చన్న, నాయకులు పెరక దేవదాస్, శ్రీకాంత్, కృష్ణ, రమేష్, అశోక్, హరీష్, శేఖర్, వినీత్, రాజు, దేవేందర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అమరవీరుల స్ఫూర్తితో ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ, 1970 మే 30న 'ఐక్యత-పోరాటం' అనే నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని గుర్తుచేశారు. భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు మరియు కార్మిక వర్గ రాజ్య స్థాపనకై నాటి నుండి నేటి వరకు సిఐటియు నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలను నిర్వహిస్తోందని, ప్రభుత్వాల నిర్బంధాలను సైతం ఎదిరిస్తూ నిలబడిందని కొనియాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కిరణ్ డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, పెన్షన్, బీమా వంటి సౌకర్యాల సాధన కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పండుగ పొచ్చన్న, నాయకులు పెరక దేవదాస్, శ్రీకాంత్, కృష్ణ, రమేష్, అశోక్, హరీష్, శేఖర్, వినీత్, రాజు, దేవేందర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
- ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జిల్లాధ్యక్షుడు జాదవ్ రెడ్డి నాయక్ లంబాడీ మరియు బంజారా సమాజం యొక్క ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో కొందరు వ్యక్తులు పదవుల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో విభేదాలు సృష్టించి రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ధోరణులను విడనాడి, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని జాదవ్ రెడ్డి నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గజానంద్, సురేష్, సికిందర్, డిగంబర్ పాల్గొన్నారు.1
- జన్నారం ఫైర్ ఆఫీసర్ జి. శ్రీనివాస్ వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల నివారణకు నిర్లక్ష్యం వీడి పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. వరి, మొక్కజొన్న కోతల తర్వాత చేలను తగులబెట్టవద్దని శ్రీనివాస్ సూచించారు. అలా చేయడం వల్ల మోటార్లు, పైపులు కాలిపోవడమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. కరెంట్ వైర్ల కింద లేదా ఇళ్లకు దగ్గరగా గడ్డి వాములు పెట్టకూడదని తెలిపారు. ఇళ్లలో దీపాలు వెలిగించి బయటకు వెళ్లవద్దని, వంట కాగానే గ్యాస్ రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా ఆపివేయాలని చెప్పారు. గ్యాస్ పైపును ప్రతి రెండేళ్లకు ఒకసారి మార్చాలని సూచించారు. పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదని, షార్ట్ సర్క్యూట్‌లను నివారించడానికి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను వాడొద్దని ప్రజలను కోరారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.1
- జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనీ అంగన్వాడి కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్ 03 అంగన్వాడి కేంద్రంలో షేక్ ఇమ్రాన్ చేపట్టిన అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” తెలంగాణ ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యం 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించడం మరియు తల్లిదండ్రులకు అంగన్‌వాడీ సేవలపై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో:ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. పిల్లలను అంగన్‌వాడీల్లో నమోదు చేయిస్తారు.ప్రీ-స్కూల్ విద్య, ఆటల ద్వారా బోధన గురించి వివరించారు పిల్లలకు పోషకాహారం, యూనిఫారం, బొమ్మలు మరియు ఇతర సౌకర్యాలు అందిస్తారు. ఈ కార్యక్రమం భాగంలో ఐసిడిఎస్ సిడిపిఓ మన్నెమ్మ మరియు సూపర్వైజర్ తో పాటు వార్డు కౌన్సిలర్ టేకుల శిరీష పిల్లల సంరక్షకులు పాల్గొన్నారు1
- జన్నారం మండల అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్, లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల రైతులకు ముఖ్యమైన సూచన చేశారు. శనివారం మాట్లాడుతూ, రైతులు తమ పొలాల్లో వరి కొయ్యలను, మొక్కజొన్న పంట వ్యర్ధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని ఆయన కోరారు. జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి ఆవరణలో అగ్ని ప్రమాదాలకు దారితీసే వస్తువులను ఉంచవద్దని ఆయన సూచించారు.1
- సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఐకేపీ కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర కష్టాలపై స్పందిస్తూ, కొత్త గోనె సంచులు మాయం కావడంతో చినిగిన బస్తాలతోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాళ్లలో ధాన్యం ఎండిపోతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని ఆయన మండిపడ్డారు. "వారం రోజుల్లోగా రైతుల వడ్లను కొనుగోలు చేయకుంటే, వారు తిరగబడటం ఖాయం. అన్నదాతలు తమ హక్కుల కోసం నేతలకు బుద్ధి చెబుతారు" అని కోనేరు కోనప్ప హెచ్చరించారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తీరుపై కూడా స్థానిక రైతులు అసంతృప్తిగా ఉన్నారని కోనప్ప తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు సరిగ్గా సాగడం లేదని రైతులు ఆవేదన చెందుతుంటే, హరీష్ బాబు మాత్రం ఇతర జిల్లాల కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ అక్కడి లోపాలను ఎత్తిచూపుతున్నారని, సొంత నియోజకవర్గ రైతులను పట్టించుకోవడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దండే విఠల్ వడ్లు కొనడానికి నిధులు లేవని కాలయాపన చేస్తుండగా, సర్పంచులను, ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడానికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారని కోనేరు కోనప్ప ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు రైతులకు చినిగిన, పాత గోనె సంచులను పంపిణీ చేస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు వస్తే, అక్కడ కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని కోనప్ప గారు ఆవేదన వ్యక్తం చేశారు.1
- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తన ఛాంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన యూఎస్‌టీ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. 2025 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో సంభవించిన వరదల సమయంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల కింద విశేష సేవలు అందించినందుకు ఈ ప్రశంస లభించింది. వరదల ప్రభావానికి గురైన కుటుంబాలకు యూఎస్‌టీ సంస్థ 600 డిజాస్టర్ ఫ్లడ్ రిలీఫ్ కిట్లను పంపిణీ చేసిందని, సకాలంలో మానవతా సహాయాన్ని అందించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు అత్యవసర సహాయం అందిందని, ఇది సమాజ సేవ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందన్నారు. యూఎస్‌టీ CSR అంబాసడర్ తిరుమల విజయ్ కుమార్‌తో పాటు వాలంటీర్ బృంద సభ్యులు రాధికా పెరుమాళ్, షాహుల్ సయ్యద్, సురేంద్రనాథ్ తిరునగరం, బిక్షపతి ఎండ్లా చేసిన సేవలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో సహాయక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి, బాధిత కుటుంబాలకు అండగా నిలిచినందుకు వారికి ప్రశంసలు తెలిపారు. జిల్లా ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా యూఎస్‌టీ సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, విద్య, వైద్య రంగం, డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో భవిష్యత్తులో CSR కార్యక్రమాలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాల్లో రాబోయే సంవత్సరాల్లో కూడా యూఎస్‌టీ సంస్థ తమ సహకారాన్ని కొనసాగించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి దోహదపడే CSR కార్యక్రమాలలో జిల్లా పరిపాలన యూఎస్‌టీ సంస్థతో భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.1
- తాంసి మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం సందర్శించి, జొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, కొనుగోలు కేంద్రంలో పది రోజుల నుండి ఉన్న కొత్తూరు అశోక్ అనే రైతు, తన పిల్లలు ఎప్పుడొస్తావ్ నాన్న అని అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నానని కంటతడి పెట్టుకోగా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయనకు భరోసా కల్పించారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో రేపటి నుంచి తాంసి కొనుగోలు కేంద్రంలో అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతులను నమ్మించి గొంతు కోసిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలలో సరైన ఏర్పాట్లు లేకపోవడం, తూకం ప్రక్రియలో జాప్యం, గన్నీ సంచుల కొరత, చెల్లింపుల ఆలస్యం, అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంట నీటి పాలవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఎత్తి చూపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కుతామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హెచ్చరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవీందర్, సీఈఓ శ్రీనివాస్, మార్కుఫెడ్ అధికారులు, మరియు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.4
- తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు వారి ఇంటి వద్దకే న్యాయాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ ఆదిలాబాద్ ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం నార్నూర్ మండల కేంద్రంలో 'సంచార లోక్ అదాలత్-ఉచిత న్యాయ సేవలు' అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా పేదల కోసం న్యాయవాదులచే ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నాయక్, గజానంద్, సురేష్, కాంతారావు దుర్గే, దేవరావు తదితరులు పాల్గొన్నారు.1
- జన్నారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు పంటలు మార్చినప్పటికీ, వారికి ఇబ్బందులు తప్పడం లేదని వారు పేర్కొన్నారు. యాసంగి సీజన్‌లో దొడ్డు వడ్లను పండించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఈసారి పంట మార్చాలని వ్యవసాయ అధికారులు కోరడంతో రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. పంట కోత అనంతరం మార్కెట్ కమిటీకి తరలించిన మొక్కజొన్న బస్తాలను ఇప్పటికీ గోదాములకు పంపడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల బస్తాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు.1