Shuru
Apke Nagar Ki App…
కోదండరాం ను సోమాజిగూడ లో నిలదీసిన నిరుద్యోగులు, వీడియో వైరల్ కోదండరాంను పరిగెత్తించిన నిరుద్యోగులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు
Sangareddy News
కోదండరాం ను సోమాజిగూడ లో నిలదీసిన నిరుద్యోగులు, వీడియో వైరల్ కోదండరాంను పరిగెత్తించిన నిరుద్యోగులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకుని నిలదీసిన నిరుద్యోగులు
More news from తెలంగాణ and nearby areas
- కంటి వెలుగు ఆపేశారు: కేటీఆర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కేటీఆర్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన 'కంటి వెలుగు'ను కొనసాగించేలా ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన 171 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మనల్ని చూసైనా ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిదని హితవు పలికారు.2
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కడియం.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బుధవారం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 86 రకాల సర్ప దోషాలకు నివారణ పూజలు ఈ ఒక్క శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోనే జరుగుతాయని,ఇంత గోప్ప విశిష్టత కలిగిన ఆలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి సంబందించి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని, ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేశవనగర్ నుండి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీదుగా పెద్దపెండ్యాల వరకు త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.1
- కల్తీ ఆహారానికి చెక్ పెట్టిన ఉప్పల్ SOT... పీర్జాధిగూడ గల్ఫ్ బేకరిపై దాడి విశ్వసనీయ సమాచారంతో SOT ఉప్పల్ జోన్ బృందం పీర్జాదిగూడలోని గల్ఫ్ బేకరీపై దాడి నిర్వహించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ముడి పదార్థాలు, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దాడిలో ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ఫ్లేవర్, జామ్, సాస్ మరియు కేకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తే కఠిన చర్యలు తప్పవు.2
- స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని చాటేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని చాటేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్ మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఐదు రోజుల పాటు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలంతా కార్యక్రమంలో భాగస్వాములై భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటాలని కోరారు.1