logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు :సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి..... తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.. జిల్లా, మండల కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహించాలి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహంతో మ్యూజియం ఏర్పాటు చేయాలి: బీజేపీ ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. తెలంగాణ విమోచన చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరింది. హైదరాబాద్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహంతోపాటు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన మ్యూజియంలు ఏర్పాటు చేయాలని సూచించింది. సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అప్పటి పోరాట చరిత్రను నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానం వెంటనే భారతదేశంలో విలీనం కాలేదని, నిజాం పాలకుడు హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంచాలని, అవసరమైతే పాకిస్థాన్‌లో విలీనం చేసే ఆలోచన వ్యక్తం చేశారని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేతృత్వంలో చేపట్టిన చర్యల అనంతరం 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, ప్రజలపై జరిగిన దాడులు, దోపిడీలు, చిత్రహింసలు వంటి అంశాలను చరిత్రలో భాగంగా నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు అన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న ప్రముఖులు, స్థానికంగా పోరాడిన యోధులను గుర్తించి వారి పేరుతో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాంజీ గోండు వంటి పోరాట యోధుల చరిత్రను కూడా ప్రజలకు తెలియజేయాలని కోరారు. తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి వాటిని చారిత్రక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. పాఠ్యపుస్తకాల్లో సెప్టెంబర్‌ 17 చరిత్రను సమగ్రంగా చేర్చి విద్యార్థులు, యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జిల్లా కేంద్రాలతోపాటు మండల స్థాయిలోనూ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం కూడా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని బీజేపీ నాయకులు విమర్శించారు. రాజకీయ కారణాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఉండటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంతోపాటు, చరిత్రను భావితరాలకు అందించేలా శాశ్వత కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. భవిష్యత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించి, తెలంగాణ విమోచన చరిత్రకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని నాయకులు తెలిపారు.

1 hr ago
user_Karunya
Karunya
ములుగు, ములుగు, తెలంగాణ•
1 hr ago
dead4740-c22b-4408-b49a-708371d832ff

ములుగు :సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి..... తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.. జిల్లా, మండల కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహించాలి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహంతో మ్యూజియం ఏర్పాటు చేయాలి: బీజేపీ ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. తెలంగాణ విమోచన చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరింది. హైదరాబాద్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహంతోపాటు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన మ్యూజియంలు ఏర్పాటు చేయాలని సూచించింది. సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అప్పటి పోరాట చరిత్రను నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానం వెంటనే భారతదేశంలో విలీనం కాలేదని, నిజాం పాలకుడు హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంచాలని, అవసరమైతే పాకిస్థాన్‌లో విలీనం చేసే ఆలోచన వ్యక్తం చేశారని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేతృత్వంలో చేపట్టిన చర్యల అనంతరం 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, ప్రజలపై జరిగిన దాడులు, దోపిడీలు, చిత్రహింసలు వంటి అంశాలను చరిత్రలో భాగంగా నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు అన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న ప్రముఖులు, స్థానికంగా పోరాడిన యోధులను గుర్తించి వారి పేరుతో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాంజీ గోండు వంటి పోరాట యోధుల చరిత్రను కూడా ప్రజలకు తెలియజేయాలని కోరారు. తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి వాటిని చారిత్రక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. పాఠ్యపుస్తకాల్లో సెప్టెంబర్‌ 17 చరిత్రను సమగ్రంగా చేర్చి విద్యార్థులు, యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జిల్లా కేంద్రాలతోపాటు మండల స్థాయిలోనూ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం కూడా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని బీజేపీ నాయకులు విమర్శించారు. రాజకీయ కారణాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఉండటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంతోపాటు, చరిత్రను భావితరాలకు అందించేలా శాశ్వత కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. భవిష్యత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించి, తెలంగాణ విమోచన చరిత్రకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని నాయకులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం -------------------------------- యాంకర్: ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు
    2
    ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం 
--------------------------------
యాంకర్:
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు
    user_Sai tej
    Sai tej
    Local News Reporter ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి................. MLG: ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెండో మహాసభ సందర్భంగా నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షౌరవృత్తిలోకి ఇతర కులాల రాకను నిరోధించాలని, దేవాలయాలు, జాతరల్లో తలనీలాల ఆదాయంలో వృత్తిదారులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.
    1
    నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి.................
MLG: ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెండో మహాసభ సందర్భంగా నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షౌరవృత్తిలోకి ఇతర కులాల రాకను నిరోధించాలని, దేవాలయాలు, జాతరల్లో తలనీలాల ఆదాయంలో వృత్తిదారులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం...
గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 min ago
  • 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]
    1
    𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]
    user_𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐀𝐌]
    𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐀𝐌]
    Tour operator Hanamkonda, Hanumakonda•
    16 hrs ago
  • ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ​ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ​గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
    2
    ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు


వరంగల్, సెప్టెంబర్ 14:
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి.
​ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
​గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
  • వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.
    1
    వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ *మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ** మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు. మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్‌ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. 1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.
    1
    ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ

ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ
*మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ**
మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు 
మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు.
మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్‌ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు.
1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    Local News Reporter ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • రైతులకు ఫ్రీగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ...500 కోడెలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పరిమితికి మించి ఉన్న 500 రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపురంలో గల గోశాలలో రైతులకు రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు ఆలయ అధికారులు పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 250 మంది రైతులకు 500 కోడెలు ఉచితంగా అందజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే రాజన్న కోడెలు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదివరకు 10 విడతలుగా 2100 కోడెలు పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 500 కోడెలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భక్తి భావంతో భక్తులు పాలు మరువని అనారోగ్యంగా ఉన్న కోడెలను రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తున్నారని అలాంటి కోడెలు సమర్పించవద్దని కోరారు. నిజ కోడెలు సమర్పించే భక్తులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనారోగ్యంగా పాలు మరువని, జర్సీ కోడెలను ఇచ్చి పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భక్తులు సమర్పించే కోడెలను గ్రేడింగ్ పద్ధతిలో వేరు వేరు ప్రదేశాల్లో ఉంచేలా కృషి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. పాలు మరవని కోడెలను, జెర్సీ కోడెలను తీసుకురావద్దన్నారు. రైతులకు ఇచ్చిన కోడెను రాజన్న ప్రసాదంగా భావించి, కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన కోడెలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఒకవేళ రైతులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    2
    రైతులకు ఫ్రీగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ...500 కోడెలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి
కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పరిమితికి మించి ఉన్న 500 రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపురంలో గల గోశాలలో రైతులకు రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు ఆలయ అధికారులు పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 250 మంది రైతులకు 500 కోడెలు ఉచితంగా అందజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే రాజన్న కోడెలు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదివరకు 10 విడతలుగా 2100 కోడెలు పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 500 కోడెలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భక్తి భావంతో భక్తులు పాలు మరువని అనారోగ్యంగా ఉన్న కోడెలను రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తున్నారని అలాంటి కోడెలు సమర్పించవద్దని కోరారు. నిజ కోడెలు సమర్పించే భక్తులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనారోగ్యంగా పాలు మరువని, జర్సీ కోడెలను ఇచ్చి పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భక్తులు సమర్పించే కోడెలను గ్రేడింగ్ పద్ధతిలో వేరు వేరు ప్రదేశాల్లో ఉంచేలా కృషి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. 
పాలు మరవని కోడెలను, జెర్సీ కోడెలను తీసుకురావద్దన్నారు. రైతులకు ఇచ్చిన కోడెను రాజన్న ప్రసాదంగా భావించి, కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన కోడెలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఒకవేళ రైతులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.