బాధితులకు అండగా పోలీస్ కమ్మర్‌పల్లి ఎస్.ఐ అనిల్ రెడ్డి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి పోలీసులు మానవీయతను చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ జి.అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలను కమ్మర్‌పల్లి ఎస్.ఐ జి. అనిల్ రెడ్డి బుధవారం పరామర్శించారు. కష్టాలను అడిగి తెలుసుకున్న ఎస్.ఐ. అనిల్ రెడ్డి స్వయంగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి, వారి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని ఆయన సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అతి వేగాన్ని నియంత్రించుకోవాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా పోలీస్ కమ్మర్‌పల్లి ఎస్.ఐ అనిల్ రెడ్డి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి పోలీసులు మానవీయతను చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ జి.అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలను కమ్మర్‌పల్లి ఎస్.ఐ జి. అనిల్ రెడ్డి బుధవారం పరామర్శించారు. కష్టాలను అడిగి తెలుసుకున్న ఎస్.ఐ. అనిల్ రెడ్డి స్వయంగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి, వారి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని ఆయన సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అతి వేగాన్ని నియంత్రించుకోవాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.
- కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడిలో వెలసిన సిద్ధులగుట్ట దేవాలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. MLA మదన్ మోహన్ ప్రత్యేక కృషితో ఈ నిధులు కేటాయించినట్లు నాయకులు తెలిపారు. కొండపై ఉన్న ఆలయానికి వెళ్లడానికి భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులు ఈ రోడ్డు నిర్మాణంతో తీరనున్నాయని MLAకు కాంగ్రెస్ నేతలు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1
- ప్రభుత్వ పథకాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు.. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 72 మందికి ప్రభుత్వం మంజూరు చేసిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు 27 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. నిరుపేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలలో నీటి సమస్య ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసివుల, జన్నారం తాసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముజఫర్ ఖాన్, మేకల మాణిక్యం, ప్రముఖులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 18 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.93,52,748/- నగదు రూపం లో ఆదాయంగా వచ్చినట్లు, అదే విధంగా, మిశ్రమ బంగారం – 60 గ్రాములు,100 మిల్లి గ్రాములు మిశ్రమ వెండి – 2 కిలోల 900 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు.ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి , శ్రీ రాజమౌళి (కరీంనగర్ ఏసీఆఫీస్) , పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహాయ కార్య నిర్వహణాధికారులు, అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి పాల్గొన్నారు.1
- ఫోల్ట్రీ కంపెనీలు చికెన్ దుకాణాల నిర్వాహకులకు తగ్గించిన కమిషన్ సరిచేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రం లో చికెన్ దుకాణాలను బుధవారం మూసివేశారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద చికెన్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చికెన్ వ్యాపారులకు కమిషన్ సరిపడ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల చేస్తున్న పౌల్ట్రీ కంపెనీ ఆగడాలకు చికెన్ వ్యాపారులు బలవుతున్నారని అన్నారు. లాభాలు లేక వ్యాపారాలు చేయలేని స్థితికి వెళ్తున్నామని అన్నారు. వెంటనే పౌల్ట్రీ కంపెనీ లు తమ కు తగ్గించిన కమిషన్ ను పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చికన్ వ్యాపారులు ఇందాద్, నర్సగౌడ్, ఇతియాజ్ అలీ, షఫీ, మురళీధర్ రావు, అనిల్, నాగరాజు, జిత్తు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.1
- ఉన్నది మొత్తం రెండు పాములు కనిపించాయి ఒకటి ప్రాణాలతో తప్పించుకుంది మరొకటి చనిపోయింది,తప్పించుకున్న పాము సుమారుగా ఇదే సైజ్ ఉండచ్చు అని అంచనా అటు వైపు చేను పనులకు వెళ్ళే వారు ,చెరువులో చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. బీర్కూర్, డోంగ్లి, కామారెడ్డి, లింగంపేట, మద్నూర్ తదితర మండలాల్లో వానలు దంచి కొడుతున్నాయి. విద్యుత్కు సైతం అంతరాయం కలగగా రోజూ పనులు చేసుకునే వారు ఓ పక్క ఇబ్బందులు పడుతుంటే.. ఎండాకాలంలోనూ వానాకాలాన్ని తలపించేలా వాతావరణం మారిపోవడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కాగా కోత దశకు వచ్చిన వారి జొన్న మొక్కజొన్న కుసుమ పంటలు ఈ అకాల వర్షంతో దెబ్బతిని అవకాశం ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్ మండలంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలతో జొన్న పంట నేలకొరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో జొన్న పంట చేతి దశకు రావడంతో పంట కల్లాలు చేస్తున్నారు. దీంతో అకాల వర్షాలతో పంట నల్లగా రంగు మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మండలంలో 2,600 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. అలాగే ప్రభుత్వం ఎలాగైనా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.1
- లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.1
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేండ్లకుపైగా పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.పలు ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని తెలిపారు. చీరలు మన సంస్కృతికి నిదర్శనమని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతు పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. స్కూల్ యూనిఫాం వారితో కుట్టించామని పేర్కొన్నారు.సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని వెల్లడించారు. బ్యాంక్ లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డీఎంలు ప్రకాశరావు, శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1