logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేశంపేట:మలిదశ ఉద్యమకారుడు పాప కంటి శేఖర్ వర్ధంతి కేశంపేట మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు పాప కంటి శేఖర్ 11వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన మహానుభావుడు పాప కంటి శేఖర్ అని కొనియాడారు. ఆయన త్యాగస్ఫూర్తి, ఉద్యమ నిబద్ధత నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పిలుపునిచ్చారు.

2 hrs ago
user_S M S R R
S M S R R
కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
2 hrs ago
153484dc-ec68-4c2e-9d8f-b3b30ec39f72

కేశంపేట:మలిదశ ఉద్యమకారుడు పాప కంటి శేఖర్ వర్ధంతి కేశంపేట మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు పాప కంటి శేఖర్ 11వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన మహానుభావుడు పాప కంటి శేఖర్ అని కొనియాడారు. ఆయన త్యాగస్ఫూర్తి, ఉద్యమ నిబద్ధత నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన స్వామి అమ్మవారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో శోభాయమానంగా సాగి భక్తులను ఆకట్టుకుంది. రథంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు హాజరై శివనామ స్మరణతో ప్రాంతాన్ని మారుమోగించారు.
    1
    కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన స్వామి అమ్మవారి రథోత్సవం గ్రామ పురవీధుల్లో శోభాయమానంగా సాగి భక్తులను ఆకట్టుకుంది. రథంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు హాజరై శివనామ స్మరణతో ప్రాంతాన్ని మారుమోగించారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం
    4
    హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం
ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి 
ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి 
పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి 
తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం 
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 
ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థిను లు ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుపాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు
    1
    నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థిను లు ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుపాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్
విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    2 hrs ago
  • నస్కల్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా... """"""""""""""""""""''''""""""""""""""""""""" పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ""'''''''''''""""""""""""""""'''''''""""""""""" కాంగ్రెస్‌ పార్టీకి ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం అని తెలిపిన 1వ వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు కుర్వ బాల్ రాజ్. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమయానికి చేరుకోలేకపోయామని,అందువల్లే ప్రమాణ స్వీకారం మిస్ అయ్యిందని ఒకటో వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు తెలిపారు.ఈ విషయాన్ని ఎమ్మెల్యే సమక్షంలో వెల్లడించారు.అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, దీనిపై అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు.చిన్న తప్పిదం వల్లే ఈ గొడవ చోటుచేసుకుందని అక్కమ్మ కుమారుడు తెలిపారు.తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే కి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఎలాంటి అపోహలు అవసరం లేదని పేర్కొన్నారు.నస్కల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.
    1
    నస్కల్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా...
""""""""""""""""""""''''"""""""""""""""""""""
పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
""'''''''''''""""""""""""""""'''''''"""""""""""
కాంగ్రెస్‌ పార్టీకి ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం అని తెలిపిన 1వ వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు కుర్వ బాల్ రాజ్. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమయానికి చేరుకోలేకపోయామని,అందువల్లే ప్రమాణ స్వీకారం మిస్ అయ్యిందని ఒకటో వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు తెలిపారు.ఈ విషయాన్ని ఎమ్మెల్యే సమక్షంలో వెల్లడించారు.అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, దీనిపై అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు.చిన్న తప్పిదం వల్లే ఈ గొడవ చోటుచేసుకుందని అక్కమ్మ కుమారుడు తెలిపారు.తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే కి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఎలాంటి అపోహలు అవసరం లేదని పేర్కొన్నారు.నస్కల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.
    user_D, Anjaiah journalist
    D, Anjaiah journalist
    journalist శ్రీనివాసా నగర్, రంగా రెడ్డి•
    3 hrs ago
  • Mattress Manufacturers Company in Hyderabad Call Now: 8106660022
    1
    Mattress Manufacturers Company in Hyderabad Call Now: 8106660022
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    21 hrs ago
  • తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు ​హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.​ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.​ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.​తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ​జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.
    1
    తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు
​హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.​ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.​ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.​తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
​జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    22 hrs ago
  • భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి కార్యక్రమాని ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ (AMSA ) ఓయూ అధ్యక్షులు నామ సైదులు ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నామ సైదులు మాట్లాడుతూ భాగ్యరెడ్డివర్మ దక్కన్ పీఠభూమిలో భాగ్యనగరం నడిబొడ్డున ధ్రువతార అని, సామాజిక ఉద్యమకారులకు తొలి గురువు అన్నారు. సాధారణ దళిత మాల కుటుంబానికి చెందిన మాదిరి వెంకటయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో భాగ్యరెడ్డి వర్మ. యుక్త వయసులో సుల్తాన్ బజార్ లో ఆర్య సమాజంలో కొంతకాలం పని చేశాడని, ఆర్య సమాజం నిర్వహకులు కిషన్ రావు ఆయన సేవలను గుర్తిం చి వర్మ అనే బిరుదు ఇచ్చారని తెలిపారు. భాగ్యరెడ్డి వర్మ ఆ రోజుల్లో రెడ్డి కులానికి ఇచ్చే గౌరవాన్ని చూసి రెడ్డి అంటే పరిపాలదక్షుడిగా గౌరవం ఉంటుందని వారి కన్నా తమ జాతులు తక్కువ కాదని ఆయన పేరులో రెడ్డి చేర్చుకున్నాడని తెలిపారు. హిందూ సమాజంలో అస్పశ్యత వ్యక్తుల మధ్య వ్యత్యాసం గమనించిన భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి దళిత బాలికలకోసం 26పాఠశాలలో నెలకొల్పాడని గుర్తు చేశారు. బస్తీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఒకవైపు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూనే సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. జగన్ మిత్రమండలి, ఆది హిందూ సోషల్ లీగ్ లీగ్ లీగ్ సంస్థలు ఏర్పాటు చేశారని చెప్పారు.అన్నగారిన వర్గాల ఆత్మస్థైర్యం కోసం నిరంతరం పోరాడుతున్న హైదరాబాద్లో ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు నిర్వహించారు దృష్టిలో పెట్టుకొని బౌద్ధమతం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కంటే ముందు బుద్ధ పూర్ణిమ రోజు 1915లో బౌద్ధమతం స్వీకరించారు ఆయన క్షయ వ్యాధితో బాధపడుతూ 18 ఫిబ్రవరి 1939లో 51 సంవత్సరాల వయసులోనే తుది శ్వాస విడిచారు, భాగ్యరెడ్డి వర్మ సేవలు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం స్వాగతిస్తున్నాం అన్నారు. భాగ్యరెడ్డివర్మ ఆశలను కొనసాగిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, కొమ్మనబోయిన సైదులు యాదవ్, సుధాకర్, బొల్లెపల్లి స్వామి గౌడ్, వేణు, చేరాల వంశీ, లింగయ్య యాదవ్, రవి గౌడ్, కొమ్ము శేఖర్, రవి, ఎడవెల్లి అజయ్, రాము తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
    1
    భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి  కార్యక్రమాని ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ (AMSA ) ఓయూ అధ్యక్షులు నామ సైదులు ఆధ్వర్యంలో  ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నామ సైదులు మాట్లాడుతూ భాగ్యరెడ్డివర్మ దక్కన్ పీఠభూమిలో భాగ్యనగరం నడిబొడ్డున ధ్రువతార అని, సామాజిక ఉద్యమకారులకు తొలి గురువు అన్నారు. సాధారణ దళిత మాల కుటుంబానికి చెందిన మాదిరి వెంకటయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో భాగ్యరెడ్డి వర్మ. యుక్త వయసులో సుల్తాన్ బజార్ లో ఆర్య సమాజంలో కొంతకాలం పని చేశాడని, ఆర్య సమాజం నిర్వహకులు కిషన్ రావు ఆయన సేవలను గుర్తిం చి వర్మ అనే బిరుదు ఇచ్చారని తెలిపారు. భాగ్యరెడ్డి వర్మ ఆ
రోజుల్లో రెడ్డి కులానికి ఇచ్చే గౌరవాన్ని చూసి రెడ్డి అంటే పరిపాలదక్షుడిగా గౌరవం ఉంటుందని వారి కన్నా తమ జాతులు తక్కువ కాదని ఆయన పేరులో రెడ్డి చేర్చుకున్నాడని తెలిపారు.
హిందూ సమాజంలో అస్పశ్యత వ్యక్తుల మధ్య వ్యత్యాసం గమనించిన భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి దళిత బాలికలకోసం 26పాఠశాలలో నెలకొల్పాడని గుర్తు చేశారు. బస్తీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఒకవైపు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూనే సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. జగన్ మిత్రమండలి, ఆది హిందూ సోషల్ లీగ్ లీగ్ లీగ్ సంస్థలు ఏర్పాటు చేశారని చెప్పారు.అన్నగారిన వర్గాల ఆత్మస్థైర్యం కోసం నిరంతరం పోరాడుతున్న హైదరాబాద్లో ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు నిర్వహించారు దృష్టిలో పెట్టుకొని బౌద్ధమతం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కంటే ముందు బుద్ధ పూర్ణిమ రోజు 1915లో బౌద్ధమతం స్వీకరించారు ఆయన క్షయ వ్యాధితో బాధపడుతూ 18 ఫిబ్రవరి 1939లో 51 సంవత్సరాల వయసులోనే తుది శ్వాస విడిచారు, భాగ్యరెడ్డి వర్మ సేవలు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం స్వాగతిస్తున్నాం అన్నారు. భాగ్యరెడ్డివర్మ ఆశలను కొనసాగిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, కొమ్మనబోయిన సైదులు యాదవ్, సుధాకర్, బొల్లెపల్లి స్వామి గౌడ్, వేణు, చేరాల వంశీ, లింగయ్య యాదవ్, రవి గౌడ్, కొమ్ము శేఖర్, రవి, ఎడవెల్లి అజయ్, రాము తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    37 min ago
  • *బడంగ్ పేట్ సర్కిల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు* *బడంగ్ పేట్ సర్కిల్* తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంగ్ పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామీడి రామిరెడ్డి ఆధ్వర్యం లో మేగా రక్తదాన శిఖరాన్ని నిర్వహించి అంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ....... తెలంగాణ లో మళ్ళీ కెసిఆర్ పాలన కావాలి అని ప్రజలు కోరుకుంటారు అని రామిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడ లో పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని,సంక్షేమ పథకాల తో ప్రజలు సుఖసంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామం లో కేసీఆర్ చేసిన అభివృద్ధి,సంక్షేమం ఇప్పటికే కనపడుతుందని అన్నారు. రానున్నది బీఆర్ఎస్ పాలనైనని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    *బడంగ్ పేట్ సర్కిల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు*
*బడంగ్ పేట్ సర్కిల్*
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంగ్ పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామీడి రామిరెడ్డి ఆధ్వర్యం లో మేగా రక్తదాన శిఖరాన్ని నిర్వహించి అంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ....... 
తెలంగాణ లో మళ్ళీ కెసిఆర్ పాలన కావాలి అని ప్రజలు కోరుకుంటారు అని రామిరెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడ లో పూర్తిగా విఫలమైందని తెలిపారు. 
కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని,సంక్షేమ పథకాల తో ప్రజలు సుఖసంతోషంగా ఉన్నారని అన్నారు.
ప్రతి గ్రామం లో కేసీఆర్ చేసిన అభివృద్ధి,సంక్షేమం ఇప్పటికే కనపడుతుందని అన్నారు.
రానున్నది బీఆర్ఎస్ పాలనైనని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. 
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.