నాతవరం మండల ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల నాతవరం:త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నాతవరం మండలంలోని పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేశారు. నాతవరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎంఎస్. శ్రీనివాస్ జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో మొత్తం 65 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ఇతరులకు ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఈ నెల 16వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, మండల పరిషత్ ఏవో పి.పార్థసారధి, మండల పరిషత్ సీనియర్ సహాయకులు ఎం వి ఎస్ ఎస్ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నాతవరం మండల ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల నాతవరం:త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నాతవరం మండలంలోని పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేశారు. నాతవరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎంఎస్. శ్రీనివాస్ జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో మొత్తం 65 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ఇతరులకు ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఈ నెల 16వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, మండల పరిషత్ ఏవో పి.పార్థసారధి, మండల పరిషత్ సీనియర్ సహాయకులు ఎం వి ఎస్ ఎస్ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
- పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (DISHA) సమీక్షా సమావేశము అనంతరము అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం1
- తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.3
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అకాల మరణం,................ కాంగ్రెస్ నాయకునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004 నుంచి 2009 వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో మరణించారు. అత్తగారింటికి పండగకి గాని వచ్చిన ఆయనకు ఊహించని విధంగా గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని సీతమ్మదార లో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించగా ఆయన అక్కడ మృతి చెందారు.1
- జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఉద్యమం.. మద్దతు తెలిపిన సత్యనారాయణ పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన కార్యక్రమం కొనసాగుతోంది. పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని గ్రామాలను సందర్శిస్తూ రైతులు, ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన దుశృర్ల సత్యనారాయణ సాధన సమితి సభ్యులకు మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో తన వంతు సహాయ సహకారాలు అందించి, జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం కలిసి పనిచేస్తానని తెలిపారు. 50 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయి, కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలాయని, జంఝావతి మన్యం ప్రజలకు జీవనాడి వంటిదని ఆయన పేర్కొన్నారు.1
- వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు1
- విజయనగరంలో ట్రైనీ కానిస్టేబుల్స్‌కు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ విజయనగరం జిల్లా సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనీ కానిస్టేబుల్స్‌కు రెండు రోజుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వాలీబాల్, కబడ్డీ, హైజంప్ పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని ఎస్పీ సూచించారు.1
- మత సామరస్యానికి ప్రతీక ఖాదర్ బాబా దర్గా సూఫీ పీఠాధిపతి ఖ్వాజా మొహియినుద్దీన్ విజయనగరం, సెప్టెంబర్ 15: శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యానికి బాబామెట్టలోని హజరత్ ఖాదర్ బాబా దర్గా షరీఫ్ ప్రతీకగా నిలుస్తోందని చీమలపాడు సూఫీ పీఠాధిపతి, సజ్జాదా నషీన్ మొహమ్మద్ ఖ్వాజా మొహియినుద్దీన్ అన్నారు. బుధవారం నిర్వహించనున్న హజరత్ ఖాదర్ బాబా 130వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం బాబామెట్ట దర్బార్ షరీఫ్‌లో ధర్మకర్త డాక్టర్ ఎం.డీ. ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ (ఖలీల్ బాబు)తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖ్వాజా మొహియినుద్దీన్ మాట్లాడుతూ ఖాదర్ బాబా జన్మదినం సూఫీ పరంపరలో విశిష్టమైన పర్వదినమన్నారు. మానవత్వంతో కూడిన సూఫీ ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచానికి విస్తరించిన మహనీయుల్లో బాబా ఖాదర్ షా ఒకరని కొనియాడారు. సుమారు 850 ఏళ్ల క్రితమే భారతదేశంలో సూఫీ పరంపర ప్రారంభమైందని తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు అందించడం, మాటలతోగానీ చేతలతోగానీ ఇతరులను బాధించకుండా మానవత్వంతో జీవించడమే సూఫీ మార్గమని వివరించారు. ఈ పరంపరలో ఎంతోమంది మహనీయులు భారతదేశంలో జన్మించారని, నాగ్‌పూర్ తాజుద్దీన్ బాబా శిష్యుల్లో అగ్రగణ్యుడిగా బాబా ఖాదర్ షా నిలిచారని తెలిపారు. 1900 నుంచి 1961 వరకు విజయనగరంలో ఖాదర్ బాబా వారి ఆధ్యాత్మిక సందర్శనా కాలంగా పేర్కొన్నారు. ఈ కాలంలో బాబా అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసి, శాంతి, మత సామరస్య సందేశాన్ని విస్తరించారని చెప్పారు. అన్నార్తుల ఆకలి తీర్చడం, వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చడం, బాధితులకు అండగా నిలవడం వంటి సేవలతో బాబా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని పేర్కొన్నారు. బాబా పవిత్ర సమాధిని దర్శించుకునే భక్తులకు నేటికీ ఆశీస్సులు లభిస్తున్నాయన్న విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. ఖాదర్ బాబాపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఘనంగా జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించనున్న ఖాదర్ బాబా 130వ జన్మదిన వేడుకలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బాబా భక్తులు హాజరుకానున్నారని ఖ్వాజా మొహియినుద్దీన్ తెలిపారు. భక్తుల కోసం అవసరమైన వసతి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. మంగళవారం నుంచే దర్బార్ షరీఫ్‌లో ఉత్సవ సందడి నెలకొందన్నారు. మంగళవారం మధ్యాహ్నం, రాత్రి భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజల కోసం భారీ అన్న సమారాధన నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బాబా దివ్య సమాధికి చాదర్, సుగంధ ద్రవ్యాలు, పూలు, మిఠాయిలు సమర్పించి విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం, రాత్రి దర్బార్ షరీఫ్‌లో భారీ అన్న సమారాధన నిర్వహించడంతో పాటు రాత్రి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఖలీల్ బాబు తనయుడు ఎం.డీ. అహ్మద్ బాబు, నాగేంద్ర బాబాయ్, రంగారావు బాబాయ్ తదితరులు పాల్గొన్నారు.1
- వినాయక నిమజ్జనాలపై పోలీసుల పటిష్ఠ బందోబస్తు........... సిపి గారి ఆదేశాల మేరకు నిమజ్జన ప్రాంతాలతో పాటు అక్కడికి చేరుకునే ప్రధాన రహదారుల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు... నిమజ్జనాల సందర్భంగా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు...తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచిన అధికారులు...నిమజ్జన ప్రక్రియను సురక్షితంగా నిర్వహించేందుకు క్రేన్లను కూడా సిద్ధంగా ఉంచిన పోలీసు యంత్రాంగం...1