Shuru
Apke Nagar Ki App…
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి చెప్పారు బుధవారం బిక్కనూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు .కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తాసిల్దార్ సునీత, ఎంపీడీవో సబితా రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారెడ్డి పలు శాఖల అధికారులు పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
Bala prakash.Jangam
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి చెప్పారు బుధవారం బిక్కనూర్ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు .కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తాసిల్దార్ సునీత, ఎంపీడీవో సబితా రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారెడ్డి పలు శాఖల అధికారులు పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కాచాపూర్ లో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయానికి 18 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల రైతుల సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు.1
- మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్‌నాయక్ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, స్వామి, మల్లేష్, నర్సింలు, బాలచందర్, యాదగిరి, భాస్కర్, ఎల్లయ్య, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.2
- అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు కొంగలి వెంకటి నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగడం జరుగుతుంది, ఈ దీక్షకు అంబేద్కర్ సంఘం, జిల్లా అధ్యక్షుడు కొత్తోల గంగారాం, ప్రధాన కార్యదర్శి గైనీ రాజు,గౌరవ అధ్యక్షులు మల్లన్న రాష్ట్ర నాయకులు సంగీ రాజలింగం, సూపర్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఆశన్న,బహుజన దళిత పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర శివరాజు జిల్లా అధ్యక్షుడు సబ్బాని స్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముధం సాయిలు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవాసమితి అధ్యక్షులు భూపతి , తెలంగాణ రక్షణ సేన నాయకులు పెరుమాండ్ల రాములు, ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గిల రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదుచేసి రాసిన పుస్తకన్నీ వెంటనే నిషేధించాలని అమర ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే పట్టించుకోనీ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.2
- 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతి -ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్, పట్టా భూములు, ఇంటి స్థలాలను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరుతూ మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మెదక్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడహాక్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం1
- సిరిసిల్లలో పెట్రోల్‌లో నీరు వచ్చిందంటూ వాహనదారుడి ఆందోళన. సిరిసిల్ల: పెట్రోల్‌లో నీరు కలిసిందని ఆరోపిస్తూ ఓ వాహనదారుడు ఆందోళనకు దిగాడు. పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించిన అనంతరం తన వాహనం మొరాయించిందని జిల్లెల్లకు చెందిన కృష్ణ తెలిపారు. పరిశీలించగా పెట్రోల్‌లో నీరు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కృష్ణ కోరారు.1
- జుక్కల్ రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గళం జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఉద్యానవన రైతుల సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అసెంబ్లీలో ప్రస్తావించారు. నియోజకవర్గంలో బొప్పాయితో పాటు వివిధ రకాల ఉద్యానవన పంటలను రైతులు విస్తారంగా సాగు చేస్తున్న నేపథ్యంలో, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల పంటలకు మెరుగైన ధరలు లభించేలా అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, గ్రేడింగ్–ప్యాకింగ్ కేంద్రాలు, మార్కెట్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గానికి కీలకమైన లెండి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా కోరారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఈరోజు ప్రత్యేక అభిషేకం పూజలు మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయలవల దుర్గా భవాని మాత ఆలయంలో పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ పూజారులుమంజిరానది జలాలతో అభిషేకము పట్టు వస్తలంకరణ పుష్పాలంకరణ పసుపు కుంకుమ సుందరంగా అలంకరించారు కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి బోనాలు ఓడి బియ్యం తలనీలాల సమర్పిస్తున్నారు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే.1
- ఇస్లాంపూర్ తండాలో చిరుత కలకలం.. లేగ దూడ మృతి, చిరుతను పట్టుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన సర్పంచ్ తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మంగళవారం రాత్రి పొలం వద్ద కట్టేసిన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి తెలిపారు. తండాకు చెందిన లంబాడి రాజు పొలం వద్ద పశువులను కట్టేసి ఉంచగా, సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో లేగ దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. దీంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులు, తండావాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించి, దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సర్పంచ్ కోరారు.1