గంజాయి దందా పై పోలీసుల కొరడా... మెట్ పల్లిలో ముఠా బట్టబయలు… ఇద్దరు అరెస్ట్, 140 గ్రాముల గంజాయి మెట్‌పల్లి, ఏప్రిల్ 19: పట్టణంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న ముఠాపై పోలీసులు కొరడా ఝలిపించారు. మెట్ పల్లి పోలీసులు చేపట్టిన మెరుపు దాడిలో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… మెట్ పల్లికి చెందిన మల్యాల చందు, కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన బాణాల రాజు కలిసి కొంతకాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. మెదక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, చిన్న ప్యాకెట్లుగా మార్చి యువత, విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో ఆదివారం ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సార్ అర్బన్ కాలనీలో మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి ప్యాకింగ్ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు గంజాయి సరఫరా విషయాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు సమాచారం. మెట్ పల్లి హెచ్చరిక ... గంజాయి దందాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వ్యాపారం, వినియోగం సమాజాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. యువత తప్పుదారులు పడకుండా జాగ్రత్తపడాలని, తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా పెంచాలని ఎస్ఐ కిరణ్ కుమార్ సూచించారు. “గంజాయి అంటే గండం… దూరంగా ఉంటేనే భవిష్యత్ భద్రం” అంటూ పోలీసులు గట్టిగా హెచ్చరించారు.
గంజాయి దందా పై పోలీసుల కొరడా... మెట్ పల్లిలో ముఠా బట్టబయలు… ఇద్దరు అరెస్ట్, 140 గ్రాముల గంజాయి మెట్‌పల్లి, ఏప్రిల్ 19: పట్టణంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న ముఠాపై పోలీసులు కొరడా ఝలిపించారు. మెట్ పల్లి పోలీసులు చేపట్టిన మెరుపు దాడిలో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… మెట్ పల్లికి చెందిన మల్యాల చందు, కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన బాణాల రాజు కలిసి కొంతకాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. మెదక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, చిన్న ప్యాకెట్లుగా మార్చి యువత, విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో ఆదివారం ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సార్ అర్బన్ కాలనీలో మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి ప్యాకింగ్ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు గంజాయి సరఫరా విషయాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు సమాచారం. మెట్ పల్లి హెచ్చరిక ... గంజాయి దందాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వ్యాపారం, వినియోగం సమాజాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. యువత తప్పుదారులు పడకుండా జాగ్రత్తపడాలని, తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా పెంచాలని ఎస్ఐ కిరణ్ కుమార్ సూచించారు. “గంజాయి అంటే గండం… దూరంగా ఉంటేనే భవిష్యత్ భద్రం” అంటూ పోలీసులు గట్టిగా హెచ్చరించారు.
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- దిలార్పూర్ మండల కేంద్రంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రమవుతున్నాయి. ఎండ తీవ్రత మధ్యలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వర్షం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులతో మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పారీలతో కప్పుతూ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- *హుజూరాబాద్ డంప్ యార్డ్ పై బీజేపీ యుద్దభేరీ...* *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు. *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.1
- ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼1
- తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.1