logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి* *మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్* షాద్‌నగర్: షాద్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన షాద్‌నగర్ నియోజకవర్గ గిరిజన నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ గిరిజన సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గిరిజనుల జనాభా ప్రాతిపదికన 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని అన్నారు. 2022 సెప్టెంబర్ 17న 10 శాతం రిజర్వేషన్లపై నిర్ణయం ప్రకటించబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 17వ తేదీకి గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని తండాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేయాలని గిరిజన నాయకులు, కార్యకర్తలకు అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. *కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?* 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిందని అంజయ్య యాదవ్ అన్నారు. పోడు భూములపై అర్హులైన గిరిజనులందరికీ హక్కులు కల్పించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మూడు గిరిజన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఒక్కో కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.500 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రతి మండలంలో గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ మూడు గిరిజన కార్పొరేషన్లు ఎక్కడ? ఒక్కో కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.500 కోట్లు కేటాయిస్తామన్న హామీ ఏమైంది? ఒక్క రూపాయి అయినా కేటాయించారా? ప్రతి మండలంలో గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ఏమైంది? అని అంజయ్య యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో గిరిజనులను ఆకట్టుకునేందుకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. గిరిజనుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై గ్రామాలు, తండాల్లో ప్రజలకు వివరించాలని గిరిజన నాయకులకు అంజయ్య యాదవ్ సూచించారు. గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లు, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రతి తండా నుంచి గిరిజన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు రావాలని అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, గిరిజన నాయకులు మిట్టు నాయక్, లక్ష్మణ్ నాయక్, రాజు నాయక్, గోపాల్ నాయక్, హన్య నాయక్, అమ్రు నాయక్, రవి నాయక్, రాం చరణ్, లక్ష్మణ్, దశరథ్, హరి నాయక్, లచ్చు నాయక్, కిషన్ నాయక్ తదితరులు, నియోజకవర్గ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ గిరిజన శ్రేణులు పాల్గొన్నారు.

12 hrs ago
user_Master Narender
Master Narender
ఫరూఖ్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
12 hrs ago
f496cde5-9eb6-4151-b1c4-65ab3d5c4c81

*గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి* *మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్* షాద్‌నగర్: షాద్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన షాద్‌నగర్ నియోజకవర్గ గిరిజన నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ గిరిజన సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గిరిజనుల జనాభా ప్రాతిపదికన 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని అన్నారు. 2022 సెప్టెంబర్ 17న 10 శాతం రిజర్వేషన్లపై నిర్ణయం ప్రకటించబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 17వ తేదీకి గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని తండాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేయాలని గిరిజన నాయకులు, కార్యకర్తలకు అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. *కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?* 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిందని అంజయ్య యాదవ్ అన్నారు. పోడు భూములపై అర్హులైన గిరిజనులందరికీ హక్కులు కల్పించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మూడు గిరిజన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఒక్కో కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.500 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రతి మండలంలో గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ మూడు గిరిజన కార్పొరేషన్లు ఎక్కడ?

164c78d4-a4ff-4ce1-91b0-f5f1360ca2e1

ఒక్కో కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.500 కోట్లు కేటాయిస్తామన్న హామీ ఏమైంది? ఒక్క రూపాయి అయినా కేటాయించారా? ప్రతి మండలంలో గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ఏమైంది? అని అంజయ్య యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో గిరిజనులను ఆకట్టుకునేందుకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. గిరిజనుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై గ్రామాలు, తండాల్లో ప్రజలకు వివరించాలని గిరిజన నాయకులకు అంజయ్య యాదవ్ సూచించారు. గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లు, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రతి తండా నుంచి గిరిజన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు రావాలని అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, గిరిజన నాయకులు మిట్టు నాయక్, లక్ష్మణ్ నాయక్, రాజు నాయక్, గోపాల్ నాయక్, హన్య నాయక్, అమ్రు నాయక్, రవి నాయక్, రాం చరణ్, లక్ష్మణ్, దశరథ్, హరి నాయక్, లచ్చు నాయక్, కిషన్ నాయక్ తదితరులు, నియోజకవర్గ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ గిరిజన శ్రేణులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • _మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్. గజ్వేల్: ప్రజా తెలంగాణ న్యూస్/ గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని కోల అభిరామ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “శాంతి సమావేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొని గణేష్ మండపాల నిర్వాహకులు, యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండపాల్లో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటే యువతలో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే మద్యం సేవించి రావడం వంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నిమజ్జనాల్లో పాల్గొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ తరఫున నిమజ్జనాల సందర్భంగా చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎవరూ అనవసరంగా కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, శాంతియుతంగా నిర్వహించి గజ్వేల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ గారు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు, విద్యుత్ శాఖ ఏఈ మారుతి గారు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి నర్సింగ్ గారు, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సానిటేషన్ ఇన్‌చార్జి సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని గణేష్ మండపాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    4
    _మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్.
గజ్వేల్: ప్రజా తెలంగాణ న్యూస్/
గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని కోల అభిరామ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “శాంతి సమావేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొని గణేష్ మండపాల నిర్వాహకులు, యువతకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండపాల్లో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటే యువతలో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే మద్యం సేవించి రావడం వంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నిమజ్జనాల్లో పాల్గొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీ తరఫున నిమజ్జనాల సందర్భంగా చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎవరూ అనవసరంగా కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, శాంతియుతంగా నిర్వహించి గజ్వేల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ గారు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు, విద్యుత్ శాఖ ఏఈ మారుతి గారు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి నర్సింగ్ గారు, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సానిటేషన్ ఇన్‌చార్జి సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని గణేష్ మండపాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.
    1
    షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.
    user_Sai journalist
    Sai journalist
    బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం. మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
    1
    మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం.
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    8 hrs ago
  • తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
    1
    తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత
తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    13 hrs ago
  • బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
    1
    బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు
హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.
    1
    వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను
బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్.
నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను.
నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు.
నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    16 hrs ago
  • ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.
    1
    ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత
ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ,  ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    13 hrs ago
  • కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.