Shuru
Apke Nagar Ki App…
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బదిలీ..ఆమన్ గల్ పోలీస్ స్టేషన్ కు డిఐ వెంకటేశ్వర్లు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ వెంకటేశ్వర్లకు బదిలీ జరిగింది. ఆయనను ఆమన్ గల్ కు బదిలీ చేస్తూ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు పోలీస్ స్టేషన్ లకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే డిఐ వెంకటేశ్వర్లు స్థానంలో మరో అధికారిని నియమించలేదు. అదేవిధంగా ఇక్కడ సిఐగా పనిచేసే వెళ్లిన విజయ్ కుమార్ ను అటాచ్ చేసిన కమిషనర్ ఆ తర్వాత ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
S M S R R
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బదిలీ..ఆమన్ గల్ పోలీస్ స్టేషన్ కు డిఐ వెంకటేశ్వర్లు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ వెంకటేశ్వర్లకు బదిలీ జరిగింది. ఆయనను ఆమన్ గల్ కు బదిలీ చేస్తూ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు పోలీస్ స్టేషన్ లకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే డిఐ వెంకటేశ్వర్లు స్థానంలో మరో అధికారిని నియమించలేదు. అదేవిధంగా ఇక్కడ సిఐగా పనిచేసే వెళ్లిన విజయ్ కుమార్ ను అటాచ్ చేసిన కమిషనర్ ఆ తర్వాత ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
More news from తెలంగాణ and nearby areas
- *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు3
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్ / – 5వ రోజు కార్యాచరణలో భాగంగా 4వ వార్డులో కచ్చానాల తవ్వకం, ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత. – నిబంధనలు అతిక్రమించి కాలువల్లో చెత్త వేసే వారికి నోటీసులు జారీకి కమిషనర్ ఆదేశాలు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం *‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల* కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్యాచరణలో భాగంగా *మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి G. చందన రవీందర్* గారు మరియు *మున్సిపల్ కమిషనర్ శ్రీ R. వెంకట్ గోపాల్* గారు పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. _*ప్రధాన అంశాలు:*_ * వార్డు నం. 4లో ప్రత్యేక డ్రైవ్: TYR గార్డెన్ వెనుక భాగంలో ప్రజ్ఞాపూర్ నుండి వచ్చే వరద కాలువ పూర్తిగా నిండిపోవడం వల్ల నీరు నిలిచి, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పాలకవర్గం, కచ్చానాల (తాత్కాలిక కాలువ) తవ్వించి నీటి నిల్వను తొలగించేలా చర్యలు తీసుకుంది. * నోటీసుల జారీ: కాలువలను పరిశీలించగా, ప్రజలు నేరుగా చెత్తను కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. * *క్రిమిసంహారకాల పిచికారీ:* మురికి కాలువల్లో దోమల నివారణకు దోమల మందు పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. * *ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత:* ప్రజా ప్రదేశాల శుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఉన్న UGD సమస్యను పరిష్కరించి, ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, పొదలను తొలగించి ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, 3వ వార్డు కాముని మురళి గారు, 6వ వార్డు బొగ్గుల స్వప్న గారు, 13వ వార్డు భాగ్యలక్ష్మి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. *కమిషనర్,* గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం.4
- నాగర్‌కర్నూల్ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బస్సులో బ్రష్ చేసుకుంటున్న మహిళ. ఆశ్చర్యపోయిన తోటి ప్రయాణికులు, కండక్టర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనపదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.1
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- రంజాన్ మాసం సహనం, దానం, సహోదర భావానికి ప్రతీక అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోయిన్ పల్లి, కడక్ పుర, నేతాజీ నగర్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన కజూర్ తినిపించి నేటి ఉపవాస దీక్ష విరమింప చేశారు. భారత దేశంలో సర్వ మతాలు సమానమేనని తెలిపారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రేస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర మండల రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రజల సమస్యలు పట్టించుకోలేని అధ్యక్షుడు పన్నీరు మహేష్ ఆరోపించారు. కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ లో 52 బిల్డింగులు,6420 కుటుంబాలు ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రోడ్డు సమస్య, రోజు కనీసం ఒక రెండు మూడు బైకులు కిందపడి ప్రజలను కాలు చేతులు వేరే కొట్టుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండి కలెక్టర్ కు మరియు జిహెచ్ఎంసి వారికి మరియు నాగారం మున్సిపాలిటీ అధికారులకు, ఎన్నిసార్లు వినతిపత్రం వచ్చినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్న అధికారులు మరియు లీడర్లు , రాంపల్లి డబుల్ బెడ్రూంలో ఇల్లు అలెర్ట్మెంట్ చేశారు. అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కావట్లేదు, బస్తీ దావకాన లేదు, అంగన్వాడి కేంద్రం లేదు, ప్రజలు కనీసం అక్కడ ఏదైనా పని చేసుకుని బతకడానికి వసతులు లేవు, ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి సెంటర్ అవి కూడా ఓపెన్ చేయకుండా, తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాగారం మున్సిపాలిటీకి టాక్సీ కూడా పే చేయడం జరిగింది. ఒక్కొక్కరు 1980 రూపాయలు టాక్స్ కడుతున్నారు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాక్స్ కట్టని వారికి నోటీసులు అందిస్తామని చెప్పి పేద ప్రజలను భయాందోళనకు గురిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్ సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వ స్పందించకపోతే కాలనీ ప్రజలందరం పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.1
- సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం వేళ నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంతుడి సేవలో లీనమై పోయారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- యాంకర్:గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి,భారతదేశంలో గోవధ నిషేద ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గోమాత గౌరవ ప్రచారాన్నీ హైద్రాబాద్,గోశామహల్ బేగంబజార్ నుండి ప్రారంభించింది.ఏప్రిల్ 27న భారతీయులు,గో ప్రేమికులు అందరూ గో సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి తహసీల్దార్, పోస్టాఫీస్ ల ద్వారా దరఖాస్తులు,లేటర్ లు రాష్ట్రపతి, ప్రధానమంత్రి,గవర్నర్, ముఖ్యమంత్రులకు సమర్పించాలని కోరుతూ గోమాత ప్రచారాం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.2