logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ప్రజా సేవకు చిరునామాగా నిలిచిన అసెంబ్లీ టైగర్ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మనవడు,మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడైన రజత్ కుమార్ రెడ్డికి రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతలు దక్కడం జిల్లాలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నియామకం యువతకు మరింత ప్రోత్సాహాన్నిచ్చే నిర్ణయమని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.యువతకు వారధిగా పార్టీ బలోపేతమే లక్ష్యం రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా రజత్ కుమార్ రెడ్డి యువతను పార్టీ సిద్ధాంతాల వైపు మరింతగా ఆకర్షించడం,గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువ నాయకత్వాన్ని సమీకరించడం, ప్రజా సమస్యలపై చురుకైన పాత్ర పోషించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రజత్ కుమార్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ ఆశయాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తూ యువతను మరింతగా చైతన్యపరిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రజత్ కుమార్ రెడ్డి నియామకాన్ని స్వాగతిస్తూ కోవ్వూరు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు,యువ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.ఆయన నాయకత్వంలో యువజన విభాగం మరింత బలోపేతమై పార్టీకి కొత్త ఊపును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

19 hrs ago
user_Chennakesava
Chennakesava
గూడలూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago
db8c0304-c58a-42e2-b1a6-c906644857ad

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రభుత్వాన్ని కోరారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమం చేపట్టామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
    1
    కార్మికుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రభుత్వాన్ని కోరారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమం చేపట్టామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    2
    ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    12 hrs ago
  • ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
    1
    ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష

ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. 

ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఎల్లంపల్లి శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైదుకూరు ఖండ పరిధిలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం మండలాల గ్రామ కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ కడప జిల్లా సంయోజక్ శ్రీ తమిడేపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజంలో సమరసత, సేవా కార్యక్రమాలు, ధార్మిక చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజక్ బుసిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, అనంతపురం కన్వీనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మైదుకూరు మున్సిపాలిటీ కన్వీనర్ ఎం. వీరారెడ్డి తదితరులు పాల్గొని సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం
కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఎల్లంపల్లి శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైదుకూరు ఖండ పరిధిలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం మండలాల గ్రామ కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ కడప జిల్లా సంయోజక్ శ్రీ తమిడేపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజంలో సమరసత, సేవా కార్యక్రమాలు, ధార్మిక చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజక్ బుసిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, అనంతపురం కన్వీనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మైదుకూరు మున్సిపాలిటీ కన్వీనర్ ఎం. వీరారెడ్డి తదితరులు పాల్గొని సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    1
    ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది
ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    9 hrs ago
  • తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    1
    తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు...........
తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా
    2
    నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం
నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు.
జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    6 hrs ago
  • కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.
    1
    కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా 
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య  మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.