logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మోత్కూర్‌ 11వ వార్డు లో ఘనంగా వన మహోత్సవం కార్యక్రమం మోత్కూర్‌ మున్సిపాలిటీ పరిధి 11వ వార్డు కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్ అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.ఈ సందర్భంగా ఆ ఏరియా కౌన్సిలర్లు, కారుపోతుల వెంకన్న గౌడ్ మెంట రమణ నగేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని క్రమం తప్పకుండా సంరక్షించినప్పుడే వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. పట్టణంలో పచ్చదనం పెరిగేలా ప్రజలు కూడా విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు బీసు శ్రీకాంత్ గౌడ్, మొగుళ్ల అనురాధ, కొండ శోభ సోమ్ మల్లు,నల్ల మధు,కూర్మిళ్ల ప్రమీల రాములు,సుల్తాన్ స్వామి, కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వార్డ్ ఆఫీసర్స్ సంధ్య రాణి,సుప్రియ,కిరణ్,మహేష్,నిఖిల్,యాదయ్య, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

11 hrs ago
user_రిపోర్టర్ ముషం శ్రీనివాస్
రిపోర్టర్ ముషం శ్రీనివాస్
Local News Reporter మోత్కూర్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
11 hrs ago
df809bfa-1055-4904-9a10-4a9284c8c203

మోత్కూర్‌ 11వ వార్డు లో ఘనంగా వన మహోత్సవం కార్యక్రమం మోత్కూర్‌ మున్సిపాలిటీ పరిధి 11వ వార్డు కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్ అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.ఈ సందర్భంగా ఆ ఏరియా కౌన్సిలర్లు, కారుపోతుల వెంకన్న గౌడ్ మెంట రమణ నగేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని క్రమం తప్పకుండా సంరక్షించినప్పుడే వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. పట్టణంలో పచ్చదనం పెరిగేలా ప్రజలు కూడా విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు బీసు శ్రీకాంత్ గౌడ్, మొగుళ్ల అనురాధ, కొండ శోభ సోమ్ మల్లు,నల్ల మధు,కూర్మిళ్ల ప్రమీల రాములు,సుల్తాన్ స్వామి, కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వార్డ్ ఆఫీసర్స్ సంధ్య రాణి,సుప్రియ,కిరణ్,మహేష్,నిఖిల్,యాదయ్య, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి
వారి నిత్య ఆదాయ వివరాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం
వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా... జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
    1
    అధికారుల నిర్లక్ష్యంతో పది లక్షల రూపాయల ప్రజాధనం వృధా...
జిల్లా కేంద్రమైన జనగామలోని 18 వ వార్డులో సీడీఎంఏ నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గంపగోని సుగుణాకర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సరైన లెవలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు రెండు ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోకపోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు.పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యపై ఏఈ,డీఈలకు ఫొటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పనులు కొనసాగించారని,ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులైన కమిషనర్, డీఈలపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    11 min ago
  • గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.
    1
    గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్
జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు.
గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు.
రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    10 hrs ago
  • తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా
    1
    తెలంగాణ ఆర్టీసీ  బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ 
*బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్*
మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
#తెలంగాణా
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
    1
    సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు 
ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    17 hrs ago
  • పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
    1
    పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    1
    మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం

రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు

గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి

గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం

దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్

తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.