సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్ర మీశ్రా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 192 మంది అర్జీదారులు ఈ కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పించారు. స్వీకరించిన దరఖాస్తుల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిని సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్నవాటిని క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శాఖ వారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తున్నామని, శాఖల వారీగా దరఖాస్తుల సంఖ్యతో పాటు పెండింగ్ దరఖాస్తులను కూడా సమీక్షించామని ఆమె స్పష్టం చేశారు. ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరాన్ని కలెక్టర్ నొక్కి చెప్పారు. ప్రజావాణికి అందిన దరఖాస్తులను ఫైల్ ట్రాకింగ్ చేస్తున్నామని పేర్కొంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ చిత్ర మీశ్రా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశ్విని తానాజీ వాకడే, డిఆర్ఓ స్వామి మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్ర మీశ్రా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 192 మంది అర్జీదారులు ఈ కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పించారు. స్వీకరించిన దరఖాస్తుల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిని సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్నవాటిని క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శాఖ వారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తున్నామని, శాఖల వారీగా దరఖాస్తుల సంఖ్యతో పాటు పెండింగ్
దరఖాస్తులను కూడా సమీక్షించామని ఆమె స్పష్టం చేశారు. ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరాన్ని కలెక్టర్ నొక్కి చెప్పారు. ప్రజావాణికి అందిన దరఖాస్తులను ఫైల్ ట్రాకింగ్ చేస్తున్నామని పేర్కొంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ చిత్ర మీశ్రా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశ్విని తానాజీ వాకడే, డిఆర్ఓ స్వామి మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
- కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.3
- కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.1
- కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.1
- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.4
- వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో గతంలో మూసివేయబడిన ప్రాథమిక పాఠశాలను సోమవారం రోజు గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మరియు మండల విద్యాధికారి శోభారాణి పునఃప్రారంభించారు. విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామానికి ఇతర చోట్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదని, ఉన్న ఊరిలోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ జిల్లా విద్యాధికారిని కలిసినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో, నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ చొరవతో ఈ పాఠశాలను ప్రారంభించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల 'విద్యా మాఫియా' దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్‌వీ నాయకులు జిల్లా విద్యాధికారి (డీఈఓ)కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రైవేట్ సంస్థలు నోట్‌బుక్స్, యూనిఫామ్స్, స్టేషనరీల పేరుతో పేదలను నిలువునా దోచుకుంటున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డిఫెన్స్ అకాడమీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో అక్రమ పుస్తక నిల్వల పూర్తి వివరాలను డీఈఓకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ ఉద్యమ తరహాలో శాంతియుత పోరాటాలు చేస్తామని, అవసరమైతే విద్యాసంస్థలపై దాడులకూ వెనకాడబోమని అనిల్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం బాధాకరమని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల్లో 100% రాయితీ కల్పించాలని డీఈఓను విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఈఓ స్పందిస్తూ, జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, వీటిని ఉల్లంఘించే పాఠశాలలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ నాయకులు మధుసూదన్ రెడ్డి, చుక్క శ్రీనివాస్, బొంకూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.3
- కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా శంకరపట్నం మండలంలోని మొలంగూర్, కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల్లో మధ్యాహ్నం అరగంట పాటు కుండపోత వర్షం కురిసింది. ఈ జోరు వాన కారణంగా కొత్తగట్టు గ్రామంలో అనేక ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. కొత్తగట్టు గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా వర్షపు నీటితో నిండిపోయింది. ఇటీవల పూర్తిచేసిన కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనుల వల్ల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం రహదారికి కిందికి ఉండడమే ఇందుకు కారణం. దీంతో వర్షపు నీరు నేరుగా కార్యాలయంలోకి ప్రవేశించి సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, ఈ వర్షాకాలంలో శంకరపట్నం మండలంలో ఇదే తొలి భారీ వర్షం కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.1