అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత: వెల్దుర్తి మేజర్ పంచాయతీ అభివృద్ధి అధికారి వెల్దుర్తి, మార్చి 10: వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి (EO) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాల్లోని మౌలిక వసతులు, రికార్డులు మరియు చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యల అడిగి తెలుసుకున్న అధికారి: సందర్శనలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భవన మరమ్మతులు, తాగునీటి సదుపాయం మరియు విద్యుత్ సౌకర్యం వంటి సమస్యలను కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన అధికారి, అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యం: అనంతరం ఆయన చిన్నారులతో ముచ్చటించి, వారికి అందిస్తున్న విద్యా బోధనను పర్యవేక్షించారు. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి రాజీ పడకూడదని, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత: వెల్దుర్తి మేజర్ పంచాయతీ అభివృద్ధి అధికారి వెల్దుర్తి, మార్చి 10: వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి (EO) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాల్లోని మౌలిక వసతులు, రికార్డులు మరియు చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యల అడిగి తెలుసుకున్న
అధికారి: సందర్శనలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భవన మరమ్మతులు, తాగునీటి సదుపాయం మరియు విద్యుత్ సౌకర్యం వంటి సమస్యలను కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన అధికారి, అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యం: అనంతరం
ఆయన చిన్నారులతో ముచ్చటించి, వారికి అందిస్తున్న విద్యా బోధనను పర్యవేక్షించారు. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి రాజీ పడకూడదని, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1
- యాంకర్:గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి,భారతదేశంలో గోవధ నిషేద ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గోమాత గౌరవ ప్రచారాన్నీ హైద్రాబాద్,గోశామహల్ బేగంబజార్ నుండి ప్రారంభించింది.ఏప్రిల్ 27న భారతీయులు,గో ప్రేమికులు అందరూ గో సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి తహసీల్దార్, పోస్టాఫీస్ ల ద్వారా దరఖాస్తులు,లేటర్ లు రాష్ట్రపతి, ప్రధానమంత్రి,గవర్నర్, ముఖ్యమంత్రులకు సమర్పించాలని కోరుతూ గోమాత ప్రచారాం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.2
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్ / – 5వ రోజు కార్యాచరణలో భాగంగా 4వ వార్డులో కచ్చానాల తవ్వకం, ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత. – నిబంధనలు అతిక్రమించి కాలువల్లో చెత్త వేసే వారికి నోటీసులు జారీకి కమిషనర్ ఆదేశాలు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం *‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల* కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్యాచరణలో భాగంగా *మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి G. చందన రవీందర్* గారు మరియు *మున్సిపల్ కమిషనర్ శ్రీ R. వెంకట్ గోపాల్* గారు పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. _*ప్రధాన అంశాలు:*_ * వార్డు నం. 4లో ప్రత్యేక డ్రైవ్: TYR గార్డెన్ వెనుక భాగంలో ప్రజ్ఞాపూర్ నుండి వచ్చే వరద కాలువ పూర్తిగా నిండిపోవడం వల్ల నీరు నిలిచి, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పాలకవర్గం, కచ్చానాల (తాత్కాలిక కాలువ) తవ్వించి నీటి నిల్వను తొలగించేలా చర్యలు తీసుకుంది. * నోటీసుల జారీ: కాలువలను పరిశీలించగా, ప్రజలు నేరుగా చెత్తను కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. * *క్రిమిసంహారకాల పిచికారీ:* మురికి కాలువల్లో దోమల నివారణకు దోమల మందు పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. * *ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత:* ప్రజా ప్రదేశాల శుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఉన్న UGD సమస్యను పరిష్కరించి, ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, పొదలను తొలగించి ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, 3వ వార్డు కాముని మురళి గారు, 6వ వార్డు బొగ్గుల స్వప్న గారు, 13వ వార్డు భాగ్యలక్ష్మి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. *కమిషనర్,* గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం.4
- రంజాన్ మాసం సహనం, దానం, సహోదర భావానికి ప్రతీక అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోయిన్ పల్లి, కడక్ పుర, నేతాజీ నగర్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన కజూర్ తినిపించి నేటి ఉపవాస దీక్ష విరమింప చేశారు. భారత దేశంలో సర్వ మతాలు సమానమేనని తెలిపారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రేస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర మండల రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రజల సమస్యలు పట్టించుకోలేని అధ్యక్షుడు పన్నీరు మహేష్ ఆరోపించారు. కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ లో 52 బిల్డింగులు,6420 కుటుంబాలు ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రోడ్డు సమస్య, రోజు కనీసం ఒక రెండు మూడు బైకులు కిందపడి ప్రజలను కాలు చేతులు వేరే కొట్టుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండి కలెక్టర్ కు మరియు జిహెచ్ఎంసి వారికి మరియు నాగారం మున్సిపాలిటీ అధికారులకు, ఎన్నిసార్లు వినతిపత్రం వచ్చినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్న అధికారులు మరియు లీడర్లు , రాంపల్లి డబుల్ బెడ్రూంలో ఇల్లు అలెర్ట్మెంట్ చేశారు. అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కావట్లేదు, బస్తీ దావకాన లేదు, అంగన్వాడి కేంద్రం లేదు, ప్రజలు కనీసం అక్కడ ఏదైనా పని చేసుకుని బతకడానికి వసతులు లేవు, ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి సెంటర్ అవి కూడా ఓపెన్ చేయకుండా, తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాగారం మున్సిపాలిటీకి టాక్సీ కూడా పే చేయడం జరిగింది. ఒక్కొక్కరు 1980 రూపాయలు టాక్స్ కడుతున్నారు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాక్స్ కట్టని వారికి నోటీసులు అందిస్తామని చెప్పి పేద ప్రజలను భయాందోళనకు గురిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్ సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వ స్పందించకపోతే కాలనీ ప్రజలందరం పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.1
- మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు కేజీబీవీ లోని తరగతి గదులు డైనింగ్ హాల్ కిచెన్ ఏరియా పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు విద్యార్థినులకు అందించే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన మేర పోషకాహారాలు వచ్చే విధంగా చూడాలని తెలిపారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం టి వై ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు,టి రాజు అభిమానులు బారీ కేట్ కటింగ్ చేసి,ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ ప్రవీణ్,సామాజిక కార్యకర్త సాదిక్ పాషా,సీనియర్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సేవకుడు స్వార్థం లేని నాయకుడు,టి వై ఎస్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు అని,నిరుపేదలకు అండగా ఉంటూ,వివిధ ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేసి,బుక్స్,పెన్నులు, అందజేస్తూ,గజ్వేల్ పట్టణంలో తన స్వంత భవనంలో అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అండగా నిలుస్తూ,వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న టి రాజు జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు4
- రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.1