తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్ !? తెలంగాణ రాష్ట్ర యంత్రాంగంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి జయేష్ రంజన్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. వాస్తవానికి ఆయన గతేడాది ఆగస్టులోనే రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం ఏడు నెలల పొడిగింపు ఇచ్చింది. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండటంతో, తదుపరి సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పేరు దాదాపు ఖరారైనట్లు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కేటీఆర్ కారణంగా కేసులో ఇరుక్కున్న అర్వింద్ కుమార్ సీనియారిటీ పరంగా చూస్తే జయేష్ రంజన్ కంటే ముందు అర్వింద్ కుమార్ వంటి అధికారులు ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలు ఆయన అవకాశాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా-ఈ రేసు నిర్వహణ కోసం సుమారు రూ.55 కోట్ల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి తరలించారనే ఆరోపణలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేటీఆర్ నోటి మాట ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో ఆ కేసు మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ఆయనపై ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి ఇవ్వడం, ఏసీబీ చార్జిషీట్ దాఖలుకు సిద్ధమవ్వడంతో ఆయన పేరు పరిశీలించడం సాధ్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంతో అలసిపోయిన జయేష్ రంజన్ జయేష్ రంజన్ బీఆర్ఎస్ హయాంలో పదేళ్లుగా ఐటీ, పరిశ్రమల శాఖల్లో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ అధినేతలకు సన్నిహితంగా ఉన్నారనే పేరున్నప్పటికీ, రేవంత్ రెడ్డి సర్కారులోనూ అంతే వేగంగా కలిసిపోయారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలతో పాటు జీహెచ్‌ఎంసీ విభజన వంటి కీలక అంశాలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నమ్మకస్తుడైన అధికారిగా మారారు. ఆయనకున్న క్లీన్ ఇమేజ్, పాలనాపరమైన అనుభవం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద సంపాదించిన విశ్వాసం ఆయనను సీఎస్ రేసులో అందరికంటే ముందు నిలబెట్టాయి. వివాదాలు లేని అధికారి జయేష్ 1992 బ్యాచ్‌కు చెందిన జయేష్ రంజన్, ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి కావడమే కాకుండా సివిల్ సర్వీసెస్ టాపర్‌గా కూడా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలోనూ, ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించడంలోనూ ఆయనది కీలక పాత్ర. వివాదరహితుడైన అధికారిగా పేరుండటం, పాలనలో కొనసాగింపు ఉండాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, మార్చి నెలాఖరులో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- * Delhi: * ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. * ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. * ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు. * జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.1
- గుంటూరు అమరావతిని సందర్శించిన పలకరించిన బిల్ గేట్స్ చంద్రబాబు ఆహ్వానం మేరకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమరావతిని సందర్శించారు.సోమవారం అమరావతిలో పర్యటించేందుకు వచ్చిన బిల్ గేట్స్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్కు CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- Post by 91241
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలమ్మ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండితో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది.1