logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పీఓపీ విగ్రహాల తయారీ... అడ్డుకునే వారేరీ..! - పర్యావరణానికి పెనుముప్పు! - మదనపల్లెలో విచ్చలవిడిగా తయారీపై నిఘా ఏదీ? - మున్సిపాలిటీ, పంచాయతీల్లో ముందస్తు తనిఖీలు చేపట్టాలి - నిబంధనలు పాటించని తయారీదారులపై చర్యలు ఏవి? మదనపల్లె: వినాయక చవితి పర్వదినం సమీపిస్తున్న వేళ మదనపల్లె పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ) వినాయక విగ్రహాల తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. అధికారుల తనిఖీ ఊసే లేకపోవడంతో తయారీదారులు నిబంధనలు పాటించకుండా పర్యావరణానికి తీవ్ర ముప్పు తెచ్చేలా విగ్రహాలను తయారు చేస్తున్నారు. అనుమతులు పొందే సమయంలో పర్యావరణహితంగా విగ్రహాలు తయారు చేస్తామంటూ చెబుతున్న తయారీదారులు తర్వాత వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఏటా విచ్చలవిడిగా పిఓపి విగ్రహాల తయారీ, నిమజ్జనంతో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోంది. మట్టి విగ్రహాల వినియోగం ఉపయోగాలు, పర్యావరణ హితం పై అవగాహన కల్పిస్తూ, పిఓపి విగ్రహాల తయారీపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. పీఓపీ విగ్రహాల తయారీ, వినియోగం, నిమజ్జనం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున తయారీ దశ నుంచే అధికారులు నిఘా ఉంచాలంటున్నారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో తట్టివారిపల్లె సమీపంలోని తిరుపతి రోడ్డులోను, సానిటోరియం ( ఆరోగ్యవరం ), ఐదవ మైలు, సిటిఎం, తదితర ప్రాంతాల్లో పీఓపీతో విగ్రహాల తయారీ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతాల్లో విగ్రహాల తయారీ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్కసారైనా అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవు. నేపథ్యంలో మున్సిపల్‌, పంచాయతీ, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. :-పీఓపీతో పర్యావరణానికి ముప్పు పీఓపీతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడం, నిమజ్జనం అనంతరం అవశేషాలు నీటి వనరుల్లో పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు విగ్రహాలపై ఉపయోగించే రంగులు, ఇతర అలంకరణ సామగ్రి నీటి వనరులపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ముందస్తు పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. :- భారీగా తయారీ.. అధికారుల నిఘా ఏదీ? వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు డిమాండ్‌ పెరగడంతో మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో తయారీ, విక్రయాలు పెద్దఎత్తున జరుగుతాయి. ఈ రంగంపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నందున వారి ఉపాధికి ఇబ్బంది కలగకుండా, పర్యావరణ నిబంధనలు పాటించేలా అధికారులు అవగాహన కల్పించాలి. కొన్ని ప్రాంతాల్లో అవసరమైన అనుమతులు లేకుండా లేదా పర్యావరణ మార్గదర్శకాలను పాటించకుండా పీఓపీ విగ్రహాల తయారీ జరుగుతోందనే సమాచారం వస్తున్న నేపథ్యంలో అధికారిక తనిఖీల ద్వారా వాస్తవాలను తేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. :- సి పి సి బి మార్గదర్శకాలు అమలు కావాలి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబి) జారీ చేసిన విగ్రహాల నిమజ్జన మార్గదర్శకాల్లో పర్యావరణహిత సహజ మట్టితో విగ్రహాల తయారీని ప్రోత్సహించాలని సూచనలు ఉన్నాయి. పీఓపీ, పర్యావరణానికి హాని కలిగించే పదార్థాల వినియోగాన్ని నివారించడంతో పాటు పర్యావరణహిత రంగులు, అలంకరణ సామగ్రికి ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఈ మార్గదర్శకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మదనపల్లె పట్టణం, పరిసర గ్రామాల్లోనూ అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. :- పట్టణంతో పాటు పల్లెల్లోనూ తనిఖీలు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని విగ్రహాల తయారీ కేంద్రాలను ముందుగానే గుర్తించి తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తయారీకి అనుమతులు ఉన్నాయా? పీఓపీ లేదా ఇతర పర్యావరణహితంకాని పదార్థాలను వినియోగిస్తున్నారా? ఎలాంటి రంగులు వాడుతున్నారు? ప్లాస్టిక్‌, థర్మాకోల్‌ వినియోగం ఎలా ఉంది? వ్యర్థాలను ఎలా నిర్వహిస్తున్నారు? వంటి అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పరిసర గ్రామ పంచాయతీల పరిధిలోని తయారీ కేంద్రాలపైనా నిఘా పెట్టాలని కోరుతున్నారు. పంచాయతీ అధికారులు అవసరమైన చోట మండల స్థాయి అధికారులు, కాలుష్య నియంత్రణ శాఖతో సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. : నిబంధనలు పాటించని వారిపై చర్యలు ఏవి? పిఓపి విగ్రహాల తయారీలో నిబంధనలు పాటించడం లేదని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని కలిగించేలా రసాయనాలు వాడుతున్నట్లు తెలుస్తోంది. అయినా అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న జాడ కనిపించడం లేదు. :-మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించడం పర్యావరణ పరిరక్షణకు మేలు చేయడంతో పాటు స్థానిక కుమ్మరి కళాకారులకు ఉపాధి కల్పిస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. పర్యావరణహిత మట్టి విగ్రహాల తయారీదారులకు అధికారులు ప్రోత్సాహం, అవగాహన, మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. :-నిమజ్జనానికి ముందే చర్యలు విగ్రహాల తయారీ పూర్తయిన తర్వాత నిమజ్జన సమయంలో సమస్యలను ఎదుర్కొనే కంటే, తయారీ దశలోనే పర్యవేక్షణ చేపట్టడం సమర్థవంతంగా ఉంటుంది. తయారీ కేంద్రాల వివరాలను ముందుగానే సేకరించి తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. పండుగ పేరుతో చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు కలుషితం కాకుండా చూడటం అందరి బాధ్యతని, భక్తితో పూజించే నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. :- పర్యావరణహితం మట్టి విగ్రహం “వినాయక చవితి భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులపై పర్యావరణ ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున సహజ మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం మంచిది. పండుగతో పాటు ప్రకృతిని కాపాడుకోవాలి.” అబూబకర్ సిద్దిక్ :- మట్టి విగ్రహాలు ఉపయోగిస్తే ఉపాధి లభిస్తుంది “మట్టి వినాయక విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తే పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, సంప్రదాయ కళాకారులకు ఉపాధి లభిస్తుంది. అధికారులు మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించాలి.” - వెంకట బాలసుబ్రమణ్యం శర్మ.

55 min ago
user_శ్రీనాధుడు ఎం
శ్రీనాధుడు ఎం
Local News Reporter మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
55 min ago
7f9406c3-da81-400c-8c7c-9d4ca4912e29

పీఓపీ విగ్రహాల తయారీ... అడ్డుకునే వారేరీ..! - పర్యావరణానికి పెనుముప్పు! - మదనపల్లెలో విచ్చలవిడిగా తయారీపై నిఘా ఏదీ? - మున్సిపాలిటీ, పంచాయతీల్లో ముందస్తు తనిఖీలు చేపట్టాలి - నిబంధనలు పాటించని తయారీదారులపై చర్యలు ఏవి? మదనపల్లె: వినాయక చవితి పర్వదినం సమీపిస్తున్న వేళ మదనపల్లె పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ) వినాయక విగ్రహాల తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. అధికారుల తనిఖీ ఊసే లేకపోవడంతో తయారీదారులు నిబంధనలు పాటించకుండా పర్యావరణానికి తీవ్ర ముప్పు తెచ్చేలా విగ్రహాలను తయారు చేస్తున్నారు. అనుమతులు పొందే సమయంలో పర్యావరణహితంగా విగ్రహాలు తయారు చేస్తామంటూ చెబుతున్న తయారీదారులు తర్వాత వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఏటా విచ్చలవిడిగా పిఓపి విగ్రహాల తయారీ, నిమజ్జనంతో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోంది. మట్టి విగ్రహాల వినియోగం ఉపయోగాలు, పర్యావరణ హితం పై అవగాహన కల్పిస్తూ, పిఓపి విగ్రహాల తయారీపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి, ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. పీఓపీ విగ్రహాల తయారీ, వినియోగం, నిమజ్జనం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున తయారీ దశ నుంచే అధికారులు నిఘా ఉంచాలంటున్నారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో తట్టివారిపల్లె సమీపంలోని తిరుపతి రోడ్డులోను, సానిటోరియం ( ఆరోగ్యవరం ), ఐదవ మైలు, సిటిఎం,

25da7c7d-3f41-45fd-83d8-a73267209f3e

తదితర ప్రాంతాల్లో పీఓపీతో విగ్రహాల తయారీ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతాల్లో విగ్రహాల తయారీ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్కసారైనా అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవు. నేపథ్యంలో మున్సిపల్‌, పంచాయతీ, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. :-పీఓపీతో పర్యావరణానికి ముప్పు పీఓపీతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడం, నిమజ్జనం అనంతరం అవశేషాలు నీటి వనరుల్లో పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు విగ్రహాలపై ఉపయోగించే రంగులు, ఇతర అలంకరణ సామగ్రి నీటి వనరులపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ముందస్తు పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. :- భారీగా తయారీ.. అధికారుల నిఘా ఏదీ? వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు డిమాండ్‌ పెరగడంతో మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో తయారీ, విక్రయాలు పెద్దఎత్తున జరుగుతాయి. ఈ రంగంపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నందున వారి ఉపాధికి ఇబ్బంది కలగకుండా, పర్యావరణ నిబంధనలు పాటించేలా అధికారులు అవగాహన కల్పించాలి. కొన్ని ప్రాంతాల్లో అవసరమైన అనుమతులు లేకుండా లేదా పర్యావరణ మార్గదర్శకాలను పాటించకుండా పీఓపీ విగ్రహాల తయారీ జరుగుతోందనే సమాచారం వస్తున్న నేపథ్యంలో అధికారిక తనిఖీల ద్వారా వాస్తవాలను తేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. :- సి పి సి బి మార్గదర్శకాలు అమలు

0a219235-39da-4a6f-a2dd-efcde01914fd

కావాలి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబి) జారీ చేసిన విగ్రహాల నిమజ్జన మార్గదర్శకాల్లో పర్యావరణహిత సహజ మట్టితో విగ్రహాల తయారీని ప్రోత్సహించాలని సూచనలు ఉన్నాయి. పీఓపీ, పర్యావరణానికి హాని కలిగించే పదార్థాల వినియోగాన్ని నివారించడంతో పాటు పర్యావరణహిత రంగులు, అలంకరణ సామగ్రికి ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఈ మార్గదర్శకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మదనపల్లె పట్టణం, పరిసర గ్రామాల్లోనూ అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. :- పట్టణంతో పాటు పల్లెల్లోనూ తనిఖీలు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని విగ్రహాల తయారీ కేంద్రాలను ముందుగానే గుర్తించి తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తయారీకి అనుమతులు ఉన్నాయా? పీఓపీ లేదా ఇతర పర్యావరణహితంకాని పదార్థాలను వినియోగిస్తున్నారా? ఎలాంటి రంగులు వాడుతున్నారు? ప్లాస్టిక్‌, థర్మాకోల్‌ వినియోగం ఎలా ఉంది? వ్యర్థాలను ఎలా నిర్వహిస్తున్నారు? వంటి అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పరిసర గ్రామ పంచాయతీల పరిధిలోని తయారీ కేంద్రాలపైనా నిఘా పెట్టాలని కోరుతున్నారు. పంచాయతీ అధికారులు అవసరమైన చోట మండల స్థాయి అధికారులు, కాలుష్య నియంత్రణ శాఖతో సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. : నిబంధనలు పాటించని వారిపై చర్యలు ఏవి? పిఓపి విగ్రహాల తయారీలో నిబంధనలు పాటించడం లేదని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని కలిగించేలా రసాయనాలు వాడుతున్నట్లు తెలుస్తోంది. అయినా అధికారులు తనిఖీలు చేసి

7f03c978-94cb-419b-8fb4-00a65df55e92

చర్యలు తీసుకున్న జాడ కనిపించడం లేదు. :-మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించడం పర్యావరణ పరిరక్షణకు మేలు చేయడంతో పాటు స్థానిక కుమ్మరి కళాకారులకు ఉపాధి కల్పిస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. పర్యావరణహిత మట్టి విగ్రహాల తయారీదారులకు అధికారులు ప్రోత్సాహం, అవగాహన, మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. :-నిమజ్జనానికి ముందే చర్యలు విగ్రహాల తయారీ పూర్తయిన తర్వాత నిమజ్జన సమయంలో సమస్యలను ఎదుర్కొనే కంటే, తయారీ దశలోనే పర్యవేక్షణ చేపట్టడం సమర్థవంతంగా ఉంటుంది. తయారీ కేంద్రాల వివరాలను ముందుగానే సేకరించి తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. పండుగ పేరుతో చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు కలుషితం కాకుండా చూడటం అందరి బాధ్యతని, భక్తితో పూజించే నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. :- పర్యావరణహితం మట్టి విగ్రహం “వినాయక చవితి భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులపై పర్యావరణ ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున సహజ మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం మంచిది. పండుగతో పాటు ప్రకృతిని కాపాడుకోవాలి.” అబూబకర్ సిద్దిక్ :- మట్టి విగ్రహాలు ఉపయోగిస్తే ఉపాధి లభిస్తుంది “మట్టి వినాయక విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తే పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, సంప్రదాయ కళాకారులకు ఉపాధి లభిస్తుంది. అధికారులు మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించాలి.” - వెంకట బాలసుబ్రమణ్యం శర్మ.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
    1
    అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు  పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!
    2
    పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు.
అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు.
ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు.
జై భీమ్ 
బహుజన ఐక్యత వర్ధిల్లాలి!
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    3 hrs ago
  • వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు డీఎస్సీ అవకతవకలపై ఆధారాలతో మాట్లాడి, దానిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని చేసిన సవాల్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు డీఎస్సీ అవకతవకలపై ఆధారాలతో మాట్లాడి, దానిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని చేసిన సవాల్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    1
    వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు డీఎస్సీ అవకతవకలపై ఆధారాలతో మాట్లాడి, దానిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని చేసిన సవాల్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.

-వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు డీఎస్సీ అవకతవకలపై ఆధారాలతో మాట్లాడి, దానిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని చేసిన సవాల్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.
-వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    22 min ago
  • *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు
    1
    *పోలీస్ ఖాకీ జులుం* 

నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు

జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు

ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు

దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు

కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
    1
    మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన

మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన
మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.
    1
    దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ
రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః
ప్రారంభించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
    1
    శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........
ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
    user_Bandi vasava datta sanjay
    Bandi vasava datta sanjay
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నేపాల్ వరదలకు కారణం ఇదేనా..? బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలింది..! నేపాల్, టిబెట్‌ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం... హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2 వేల అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగిపోయినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ భారీ మంచుకొండ ఏకంగా 4 వేల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని కథనం పేర్కొంది. అంత భారీ మంచు ద్రవ్యరాశి ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో... భారీగా మంచు, రాళ్లు, నీరు ఒక్కసారిగా కదిలి... దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంచుకొండ పడిన ప్రాంతం... బాంబు పేలినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. అంటే... ఇది సాధారణ వర్షాలతో వచ్చిన వరదేనా..? లేక... హిమాలయాల్లో భారీ మంచుకొండ విరిగిపడి... దాని ప్రభావంతో ఒక్కసారిగా నీరు ఉప్పొంగిందా..? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇది ఇంకా ప్రాథమిక శాస్త్రీయ అంచనా మాత్రమే. ఈ మంచుకొండ విరిగిపడటం, దాని పరిమాణం, లోయలోకి పడిన ప్రభావం, వరదలతో దాని సంబంధం వంటి అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ఒకవైపు భారీ మంచుకొండ విరిగిపడటం... మరోవైపు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద... హిమాలయాల్లో ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
    1
    నేపాల్ వరదలకు కారణం ఇదేనా..?
బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలింది..!

నేపాల్, టిబెట్‌ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం... హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2 వేల అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగిపోయినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఆ భారీ మంచుకొండ ఏకంగా 4 వేల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని కథనం పేర్కొంది.
అంత భారీ మంచు ద్రవ్యరాశి ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో... భారీగా మంచు, రాళ్లు, నీరు ఒక్కసారిగా కదిలి... దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మంచుకొండ పడిన ప్రాంతం... బాంబు పేలినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
అంటే...
ఇది సాధారణ వర్షాలతో వచ్చిన వరదేనా..?
లేక...
హిమాలయాల్లో భారీ మంచుకొండ విరిగిపడి... దాని ప్రభావంతో ఒక్కసారిగా నీరు ఉప్పొంగిందా..?
అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే ఇది ఇంకా ప్రాథమిక శాస్త్రీయ అంచనా మాత్రమే. ఈ మంచుకొండ విరిగిపడటం, దాని పరిమాణం, లోయలోకి పడిన ప్రభావం, వరదలతో దాని సంబంధం వంటి అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం.
ఒకవైపు భారీ మంచుకొండ విరిగిపడటం...
మరోవైపు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద...
హిమాలయాల్లో ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.