విజయనగరం జిల్లా, రజకుల సంక్షేమం, అభ్యున్నతికి కూటమి పుత్రుడు అండగా ఉంటుంది, రజక కుటుంబాలకు అందుకున్న సంక్షేమం పథకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన, రజకుల సమస్యలకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా: ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి.. విజయనగరం, సెప్టెంబర్ 15: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు, ముఖ్యంగా రజక వర్గానికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు, స్వయం ఉపాధి అవకాశాలను పరిశీలించడంతో పాటు రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి. సావిత్రి తెలిపారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజక సంఘ నాయకులతో కలసి పాల్గోని ఆమె మాట్లాడుతూ, రజక కుటుంబాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి రజక కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి విజయనగరంలో 51 వేల మంది రజక జనాభా ఉన్నట్లు చైర్‌పర్సన్ తెలిపారు. అదేవిధంగా సొసైటీల ద్వారా విజయనగరం జిల్లాలో బీసీ కార్పొరేషన్ నుంచి మొత్తం రూ.698.72 లక్షల లబ్ధి అందిందని తెలిపారు. ఇందులో 429 రజక సొసైటీలు ఉండగా, వాటికి రూ.147.25 లక్షల ఆర్థిక సహాయం అందినట్లు వెల్లడించారు. రజక మహిళలు శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు టైలరింగ్‌తో పాటు వివిధ జీవనోపాధి శిక్షణలు అందించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 2,849 దరఖాస్తులు రాగా, 2,063 మంది అర్హత పొందినట్లు తెలిపారు. అయితే రజక మహిళల నుంచి కేవలం 81 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని, వారిలో 32 మంది శిక్షణ పొందారని వివరించారు. అవగాహన లోపం కారణంగా రజక మహిళలు ప్రభుత్వ శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొంటూ, భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి, రజక వర్గానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు. గతంలో త్రీమెన్ కమిషన్ ఏర్పాటు చేసి, దాని కోసం రూ.50 లక్షల నిధులు కేటాయించి మూడు నెలల పాటు కమిషన్ పనిచేసినప్పటికీ, తదనంతర పరిణామాల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని కూడా రజక సంఘ నాయకులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. DNT అంశంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, రజకులను డీ-నోటిఫైడ్ ట్రైబ్స్ (DNT) కేటగిరీలో చేర్చడం ద్వారా విద్య, వైద్యం, ఇతర అవకాశాల్లో మద్దతు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని భావిస్తున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుందని చైర్‌పర్సన్ తెలిపారు. రజకుల అభ్యున్నతికి సమన్వయంతో కృషి చేస్తామని, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, సంఘ నాయకులు, ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ రజక సమాజ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సి. సావిత్రి హామీ ఇచ్చారు. వృత్తిపరమైన అభివృద్ధి, స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు అవసరమైన పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. “రజకుల సంక్షేమం, అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. రజక కుటుంబాల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి అర్హుడికి అందించడమే మా లక్ష్యం” అని చైర్‌పర్సన్ సి. సావిత్రి స్పష్టం చేశారు. జిల్లాలో చైర్‌పర్సన్ పర్యటన వివరాలు సెప్టెంబర్ 16న బుధవారం చైర్‌పర్సన్ సి. సావిత్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి రజక కుటుంబాలు, వృత్తిదారులను కలుసుకోనున్నారు. ఉదయం 8 గంటలకు గరజాన గ్రామంలో రజకుల సమస్యలు తెలుసుకోవడం, 8.30 గంటలకు రోళ్లవాక గ్రామంలో రజకుల సమస్యలను పరిశీలించడం, 8.45 గంటలకు ఎలుకంటి గౌరినాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించడం, 9.30 గంటలకు గజపతినగరం కైలు సత్యం గారి ఆధ్వర్యంలోని రజక సంఘం దోబీఘాట్‌ను పరిశీలించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు ఊటగెడ్డ–చాకిరేవు (కొండవెలగాడ రోడ్డు సమీపం)లో రజక సోదర, సోదరీమణులతో సమావేశమై, దోబీఘాట్/దోబీకానా ప్రాంతాన్ని పరిశీలించి వారి సమస్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదెశ్ రజక సెవా సంఘం అద్యక్షలు, కెల్ల సత్యం, ఉపాద్యక్షడు తామడ ఆచ్చన్న, జిల్లారజక సమాఖ్య గౌరవ అద్యక్షుడు ముత్యాల పైడిరాజు, అద్యక్షుడు గురజాపు సత్యరావు, ఉపాద్యక్షడు రాయవలస వెంకటరమణ గోవింద్, వెల్దుర్తి నాగరాజు, తోళ్ల వెంకటరమణ, మద్ది అప్పలరాజు, రుక్సాల పైడిరాజు, జొన్నాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొని జిల్లాలో రజక సమాజ సమస్యలను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో జిల్లా రజక సంఘాల సభ్యులు, రజక సంఘాల నాయకులు, బి.సి. సంక్షేమ శాఖ అదికారులు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
విజయనగరం జిల్లా, రజకుల సంక్షేమం, అభ్యున్నతికి కూటమి పుత్రుడు అండగా ఉంటుంది, రజక కుటుంబాలకు అందుకున్న సంక్షేమం పథకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన, రజకుల సమస్యలకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా: ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి.. విజయనగరం, సెప్టెంబర్ 15: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు, ముఖ్యంగా రజక వర్గానికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు, స్వయం ఉపాధి అవకాశాలను పరిశీలించడంతో పాటు రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి. సావిత్రి తెలిపారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజక సంఘ నాయకులతో కలసి పాల్గోని ఆమె మాట్లాడుతూ, రజక కుటుంబాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి రజక కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి విజయనగరంలో 51 వేల మంది రజక జనాభా ఉన్నట్లు చైర్‌పర్సన్ తెలిపారు. అదేవిధంగా సొసైటీల ద్వారా విజయనగరం జిల్లాలో బీసీ కార్పొరేషన్ నుంచి మొత్తం రూ.698.72 లక్షల లబ్ధి అందిందని తెలిపారు. ఇందులో 429 రజక సొసైటీలు ఉండగా, వాటికి రూ.147.25 లక్షల ఆర్థిక సహాయం అందినట్లు వెల్లడించారు. రజక మహిళలు శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు టైలరింగ్‌తో పాటు వివిధ జీవనోపాధి శిక్షణలు అందించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 2,849 దరఖాస్తులు రాగా, 2,063 మంది అర్హత పొందినట్లు తెలిపారు. అయితే రజక మహిళల నుంచి కేవలం 81 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని, వారిలో 32 మంది శిక్షణ పొందారని వివరించారు. అవగాహన లోపం కారణంగా రజక మహిళలు ప్రభుత్వ శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొంటూ, భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి, రజక వర్గానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు. గతంలో త్రీమెన్ కమిషన్ ఏర్పాటు చేసి, దాని కోసం రూ.50 లక్షల నిధులు కేటాయించి మూడు నెలల పాటు కమిషన్ పనిచేసినప్పటికీ, తదనంతర పరిణామాల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని కూడా
రజక సంఘ నాయకులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. DNT అంశంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, రజకులను డీ-నోటిఫైడ్ ట్రైబ్స్ (DNT) కేటగిరీలో చేర్చడం ద్వారా విద్య, వైద్యం, ఇతర అవకాశాల్లో మద్దతు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని భావిస్తున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుందని చైర్‌పర్సన్ తెలిపారు. రజకుల అభ్యున్నతికి సమన్వయంతో కృషి చేస్తామని, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, సంఘ నాయకులు, ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ రజక సమాజ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సి. సావిత్రి హామీ ఇచ్చారు. వృత్తిపరమైన అభివృద్ధి, స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు అవసరమైన పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. “రజకుల సంక్షేమం, అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. రజక కుటుంబాల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి అర్హుడికి అందించడమే మా లక్ష్యం” అని చైర్‌పర్సన్ సి. సావిత్రి స్పష్టం చేశారు. జిల్లాలో చైర్‌పర్సన్ పర్యటన వివరాలు సెప్టెంబర్ 16న బుధవారం చైర్‌పర్సన్ సి. సావిత్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి రజక కుటుంబాలు, వృత్తిదారులను కలుసుకోనున్నారు. ఉదయం 8 గంటలకు గరజాన గ్రామంలో రజకుల సమస్యలు తెలుసుకోవడం, 8.30 గంటలకు రోళ్లవాక గ్రామంలో రజకుల సమస్యలను పరిశీలించడం, 8.45 గంటలకు ఎలుకంటి గౌరినాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించడం, 9.30 గంటలకు గజపతినగరం కైలు సత్యం గారి ఆధ్వర్యంలోని రజక సంఘం దోబీఘాట్‌ను పరిశీలించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు ఊటగెడ్డ–చాకిరేవు (కొండవెలగాడ రోడ్డు సమీపం)లో రజక సోదర, సోదరీమణులతో సమావేశమై, దోబీఘాట్/దోబీకానా ప్రాంతాన్ని పరిశీలించి వారి సమస్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదెశ్ రజక సెవా సంఘం అద్యక్షలు, కెల్ల సత్యం, ఉపాద్యక్షడు తామడ ఆచ్చన్న, జిల్లారజక సమాఖ్య గౌరవ అద్యక్షుడు ముత్యాల పైడిరాజు, అద్యక్షుడు గురజాపు సత్యరావు, ఉపాద్యక్షడు రాయవలస వెంకటరమణ గోవింద్, వెల్దుర్తి నాగరాజు, తోళ్ల వెంకటరమణ, మద్ది అప్పలరాజు, రుక్సాల పైడిరాజు, జొన్నాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొని జిల్లాలో రజక సమాజ సమస్యలను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో జిల్లా రజక సంఘాల సభ్యులు, రజక సంఘాల నాయకులు, బి.సి. సంక్షేమ శాఖ అదికారులు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
- విజయనగరం జిల్లా బొబ్బిలి కోటకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను, టిడిపి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం... విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజవర్గ పరిధిలో ఉన్న నాయకులను, కార్యకర్తలను చిన్న శ్రీను గారుకి పరిచయం చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన . - మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఫోటోలు. - నియోజకవర్గ జనసేన నాయకులను పరిచయం చేసన బేబీనాయన. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)*శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* ఆహ్వానం మేరకు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటకు వచ్చారు.. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దర్బార్ మహల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే*బేబీనాయన* గారు మాట్లాడుతూ, మజ్జి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి రావడం *తనకు చాలా సంతోషంగా ఉందని* అన్నారు.. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల తరుపున స్వాగతం పలికారు.. అలానే, *వారి చేరికను తాను వ్యతిరేకించినట్లు కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు*.. వారి చేరికతో పార్టీ మరింత బలపడుతుందని తనకి పూర్తి నమ్మకం ఉందన్నారు.. రాజకీయంగా వేరే పార్టీలలో పనిచేసినా కూడా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు మాకు లేవని స్పష్టతనిచ్చారు.. అందరం కలసికట్టుగా పనిచేసి, గౌరవ ప్రధానమంత్రి *నరేంద్ర మోదీ* ముఖ్యమంత్రి శ్రీ *నారా చంద్రబాబునాయుడు* , ఉప ముఖ్యమంత్రి *పవన్ కళ్యాణ్* గారు నాయకత్వాన్ని బలపరిచి మన నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* మాట్లాడుతూ, బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుకి ఎల్లప్పుడూ తాను సహకరిస్తానని, చిరస్థాయిగా వారు రాజకీయంగా ఎదగాలని అన్నారు.. గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని.. ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయంతో ముందుకు సాగుతామని, పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం మేరకు పనిచేస్తానని తెలిపారు. మాజీ మంత్రి శ్రీ సుజయ్ నాయన మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు తో కూడా మాట్లాడానని, వారిని కూడా కలుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి , విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేష్ , ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు మరియు చింతల రామకృష్ణ, బొబ్బిలి పట్టణం మరియు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాస్ , మాజీ మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ , టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నెల్లిమర్ల నగరం లో ఘనంగా డిజె సౌండ్ లతో గణపతి నిమజ్జనం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం గణేష్ నిమజ్జనాలు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు లో భాగంగా.. ఉదయం పూజలు చేసి సాయంత్రం నగరంలో ఉన్న కొన్ని వినాయక విగ్రహాలు డిజె సౌండ్ల మధ్య ఆనందంగా కేరింతలతో,డ్యాన్సులతో, బాణాసంచాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.1
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలిసిన మజ్జి శ్రీనివాసరావు చిన్న విజయనగరం, సెప్టెంబర్ 15: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి విజయనగరం మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ చర్చించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో చిన్న శ్రీను పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంలో విజయనగరం జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చిన్న శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, మాజీ వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, జడ్పీటీసీలు వర్రీ నరసింహమూర్తి, గార తవుడు, వల్లిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.4
- భోగాపురం: గ్రామాల్లో ఉత్సాహంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రారంభం మండలంలో గ్రామాల్లో వినాయక నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవ కమిటీలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా నిమజ్జనా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.4
- 'మల్ఖానా' భవనాన్ని ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదేశాలు శ్రీకాకుళం: మాదకద్రవ్యాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును నిల్వ చేసేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక 'మల్ఖానా' భవనాన్ని అన్ని రకాల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఒకటవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వై. బెన్నయ్య నాయుడు అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం వెనుక భాగంలో రూ.30 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న మల్ఖానా భవన నిర్మాణ పనులను మంగళవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మొత్తానికి ఏకైక నిల్వ కేంద్రంగా ఉండే ఈ భవనంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల మేరకు పటిష్టమైన డోర్లు, చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని సూచించారు.భవనం లోపల, వెలుపల పరిసరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు, అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది నిరంతర కాపలా ఉండేలా చర్యలు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను త్వరగా ముగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- రాజీవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ఆధ్యాత్మిక సమాచారం. తేదీ. 14. 9. 2026. సోమవారం ఉదయం. శ్రీశ్రీశ్రీ సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవములు సందర్భముగా. రాజీవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సీతారామాలయం నుండి శ్రీ సిద్ధి వినాయక స్వామిని పూజా కార్యక్రమం నిర్వహించి ఊరేగింపుగా తీసుకువచ్చి రాజీవ్ నగర్ కాలనీలో గల వినాయక మండపమునకు తీసుకువచ్చి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన దృశ్యం. ఈ కార్యక్రమంలో. 1.పతివాడ గిరీశ్వరరావు. అధ్యక్షులు. రాజీవ్ సేవా సంఘం . 2. బురల్లి. శంకరరావు. మాజీ సర్పంచ్. నరసన్నపేట గ్రామపంచాయతీ. రాజీవ్ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు. రాజీవ్ సేవా సంఘం యువజన విభాగం సభ్యులు. పెద్దలు. మహిళలు. యువతీ యువకులు పిల్లలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లు. పతివాడ గిరీశ్వర రావు. అధ్యక్షులు. మరియు కార్యవర్గం. రాజీవ్ సేవా సంఘం. నరసన్నపేట టౌన్. శ్రీకాకుళం జిల్లా. ఆంధ్రప్రదేశ్.1
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అకాల మరణం,................ కాంగ్రెస్ నాయకునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004 నుంచి 2009 వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో మరణించారు. అత్తగారింటికి పండగకి గాని వచ్చిన ఆయనకు ఊహించని విధంగా గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని సీతమ్మదార లో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించగా ఆయన అక్కడ మృతి చెందారు.1
- విజయనగరం జిల్లా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వక కలిసిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్.. విజయనగరం జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని కలిసిన మజ్జి శ్రీను,గత వారం రోజులుగా విజయనగరం జిల్లాలో రాజకీయాల్లో మార్పు వచ్చింది జడ్పీ చైర్మన్, వైసీపీ నాయకులు మజ్జి శ్రీను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువ నాయకుల లోకేష్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి మజ్జి శ్రీను రావటం జిల్లాలో పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆశిస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, చంద్రబాబు గారి నిర్ణయాన్ని అమలు చేయటానికి సమన్వయంతో పనిచేస్తామన్న మజ్జి శ్రీను, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందని తెలిపిన మజ్జి శ్రీను,తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి నాయకులతో డబల్ ఇంజన్ సర్కార్ 2029 ఏర్పాటు చేయటానికి కృషి చేస్తానని తెలిపిన మజ్జి శ్రీను, స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కష్టపడి పనిచేయాలని ఆదేశం,ద్వితీయ శ్రేణి నాయకులతో సైతం సమన్వయం చేసుకొని ముందుకు సాగుతానన్న మజ్జి శ్రీను , మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి శ్రీను.2