Shuru
Apke Nagar Ki App…
ప్రతిష్టాత్మక NBA Accreditation సాధించిన ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి శ్రీ Satya Kumar Y సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందిస్తూ, విద్యార్థులతో వారి భవిష్యత్ లక్ష్యాలు, కెరీర్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై మాట్లాడారు. స్పష్టమైన లక్ష్యం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలతో ఉద్యోగాలు పొందేవారిగా మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కళాశాలలో Centre of Excellence ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఆధునిక సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధితో ధర్మవరం విద్యార్థులు భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
పీవీ శివకుమార్
ప్రతిష్టాత్మక NBA Accreditation సాధించిన ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి శ్రీ Satya Kumar Y సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందిస్తూ, విద్యార్థులతో వారి భవిష్యత్ లక్ష్యాలు, కెరీర్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై మాట్లాడారు. స్పష్టమైన లక్ష్యం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలతో ఉద్యోగాలు పొందేవారిగా మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కళాశాలలో Centre of Excellence ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఆధునిక సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధితో ధర్మవరం విద్యార్థులు భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....1
- వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.1
- రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.1
- నందవరం లో సర్వ రక్షక సేవ సంఘం నాయకులు గణనాధునికి ఘనంగా పూజలు నందవరం లో వినాయక చవితి సందర్భంగా గణనాధునికి ఘనంగా పూజలు చేశారు .స్తానిక బిసీ కాలని వద్ద సర్వ రక్షక సేవ సంఘం వినాయక యూత్ ఆధ్వర్యంలో కొలువు తీరిన వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, నైవేద్యం ,పుష్పాలు, పత్రాలతో పూజలు అందుకున్నారు.మండపం వద్ద ఆధ్యాత్మిక శోభఉట్టిపడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణతో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ,విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించిన స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.1
- పుంగనూరులో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పుంగనూరు, అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఈరోజు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యమే మా ట్రస్ట్ లక్ష్యమని, ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి నెలా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, ఫార్మాసిస్ట్ స్రవంతి, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.3
- రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.1
- పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.1