చిన్నారులకు జింక్ ఫుడ్ కు దూరంగా ఉంచారు. పిల్లల ఆరోగ్యం పై తల్లితండ్రులు జాగ్రత్త వహించాలి. ఐసిడిఎస్ సూపర్వైజర్. చిన్నారులు ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషశ్రీ సూచించారు. టెక్కలి సిడిపిఓ సిహెచ్హైమావతిఆదేశాలమేరకుమంగళవారంభావనపాడులో అంగన్వాడీ 1, 3 కేంద్రాల్లో నిర్వహించిన పోషణ పక్వాడ అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ ఉషశ్రీ మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం తప్ప జింక్ ఫ్ డ్ ఇవ్వరా దని, అటువంటి ఆహారం పిల్లలకు ఇస్తే భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అలాగే పిల్లలకు టీవీలు సెల్ ఫోన్లు చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. అంతేకాకుండా చిన్న వయసులోనే మెదడు అభివృద్ధి జరుగుతుందని 18- 24 నెలలు పిల్లలకు పరిమితంగా స్క్రీన్ సమయం ఇవ్వాలని తెలిపారు. 2-5 సంవత్సరాల పిల్లలకు వారానికి ఒక గంట మాత్రమే స్క్రీన్ టైం ఉండాలని సూచించారు. పిల్లలకు ఆరుబయట ఆట్లాడించడం పై అవగాహన కల్పించారు. మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికల కు పోషకాహారం వల్ల కలిగే ఆరోగ్యం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. కార్యక్రమములో వంటల ప్రదర్శన, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.అనంతరం భావనపాడు లో మూడు అంగన్వాడి కేంద్రాలను సూపర్వైజర్ రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు కళావతి, రాజేశ్వరి,పార్వతి ఆయాలు ధనలక్ష్మి,కల్పన పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు జింక్ ఫుడ్ కు దూరంగా ఉంచారు. పిల్లల ఆరోగ్యం పై తల్లితండ్రులు జాగ్రత్త వహించాలి. ఐసిడిఎస్ సూపర్వైజర్. చిన్నారులు ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషశ్రీ సూచించారు. టెక్కలి సిడిపిఓ సిహెచ్హైమావతిఆదేశాలమేరకుమంగళవారంభావనపాడులో అంగన్వాడీ 1, 3 కేంద్రాల్లో నిర్వహించిన పోషణ పక్వాడ అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ ఉషశ్రీ మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం తప్ప జింక్ ఫ్ డ్ ఇవ్వరా
దని, అటువంటి ఆహారం పిల్లలకు ఇస్తే భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అలాగే పిల్లలకు టీవీలు సెల్ ఫోన్లు చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. అంతేకాకుండా చిన్న వయసులోనే మెదడు అభివృద్ధి జరుగుతుందని 18- 24 నెలలు పిల్లలకు పరిమితంగా స్క్రీన్ సమయం ఇవ్వాలని తెలిపారు. 2-5 సంవత్సరాల పిల్లలకు వారానికి ఒక గంట మాత్రమే స్క్రీన్ టైం ఉండాలని
సూచించారు. పిల్లలకు ఆరుబయట ఆట్లాడించడం పై అవగాహన కల్పించారు. మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికల కు పోషకాహారం వల్ల కలిగే ఆరోగ్యం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. కార్యక్రమములో వంటల ప్రదర్శన, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.అనంతరం భావనపాడు లో మూడు అంగన్వాడి కేంద్రాలను సూపర్వైజర్ రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు కళావతి, రాజేశ్వరి,పార్వతి ఆయాలు ధనలక్ష్మి,కల్పన పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీకాకుళం జిల్లాలోనేరేడు బ్యారేజీ మరియు పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదు ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. అచ్చం నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డిగోవిందరావు ,సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర. వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర .ప్రకాష్ మరియు ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు స్థానిక సిపిఎం కార్యాలయంలో నేరేడు బ్యారేజీకి మరియు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని, కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ తో సహా అన్ని లిఫ్టుల్ని మరమ్మత్తులు చేసి నీరు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి.మోహనరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పట్ల పాలకులు చేసిన నిర్లక్ష్యమే జిల్లాకు శాపం గా మారిందని వారు అన్నారు. వంశధార రిజర్వాయర్ కు 200 కోట్లు ఆఫ్షోర్ రిజర్వాయర్ కి 300 కోట్లు వంశధార రిజర్వాయర్ లిఫ్ట్ కోసం 176 కోట్లు, పైడిగాం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే పని పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ప్రజలకు నీరు ఇవ్వకుండా జలదార పేరుతో మోసంచేస్తుందనివిమర్శించారు .రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించకుండా మాయ మాటలు చెబుతుందని విమర్శించారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం చేసుకోవచ్చని 2021లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని వామపక్షాలు ప్రజా సంఘాలు పోరాట ఫలితంగా గజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయిందని నేరెడ్ బ్యారేజీ నిర్మాణం కోసం 1000 కోట్లు అవుతుందని దానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం చేసి చివరి భూముల వరకు రెండు పంటలకు నీరు ఇస్తే జిల్లాలో తలసరి ఆదాయము రెట్టింపు అవుతుందని ప్రజల ఆదాయాల పెరిగి అనేక వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయని తద్వారా ఉపాధి దొరుకుతుందని వలసలు నివారించబడతాయని అన్నారు. గొట్టా బ్యారేజీ పూర్తయి 50 సంవత్సరాలు కావస్తుందని దాని మరమ్మత్తుల కోసం 1500 కోట్లు అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు .రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర సంస్థ సింపు నుండి ఎందుకు నిధులు మంజూరు చేయించలేదని వారు ప్రశ్నించారు. గొట్టా బ్యారేజీ కాలువ ఆధునికరణ చేస్తే చివర భూముల వరకు నీరు ఇ వ్వడంతో పాటు మరో 30 వేల ఎకరాలకు అదనంగా నీరు ఇవ్వొచ్చని అన్నారు. మన జిల్లాలో నదులు, వాగులు ద్వారా నీరు పుష్కలంగా ఉందనిదానినివినియోగించుకోకాపోవడంతో వృధాగా సముద్రంలో కలుస్తుందనిదాన్నివినియోగించడానికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జల దార పేరుతో ఇంకుడు గోతులు తవ్వండని ప్రసారం చేయడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 2009లో షర్టుల కుంభకోణం జరిగిన తర్వాత నేటికీ షర్టులు బిగించకపోవడంతో కాలువలో నీరు వెళ్లకుండా వృధాగా పోతుందని షట్టర్ ఎప్పుడు లోగా బిగిస్తారు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడిని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. కొండపేట లిఫ్ట్ తో సహా జిల్లాలో అన్ని లిఫ్టులు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు . అచ్చంనాయుడు గారు కోటబొమ్మాలి మండలంలో కొండ పేట లిఫ్ట్ మరమ్మత్తులు చేస్తామని రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదని వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించక పోతే ఈ ఏడాది కూడా 22 గ్రామాల ప్రజలు తీవ్రమైన అన్యాయానికి గురవుతారని అన్నారు. నారాయణపురం కాలువ మరమ్మతు చేయకపోవడం చివరి భూముల వరకు నీరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికి నేరేడు బ్యారేజ్ కి 1000 కోట్లు, ఆఫ్షోర్ కి 300 కోట్లు, వంశధార రిజర్వాయర్ మరియు లిఫ్ట్ 500 కోట్లు, గొట్టా బ్యారేజ్ ఆధునికరణకు 1500 కోట్లు, పలాస నుండి ఇచ్చాపురం వరకు నీరు ఇవ్వడం కోసం 500 కోట్లు, సుమారు 3000 కోట్ల కేటాయిస్తే జిల్లా సస్యశ్యామలమవుతుందని కానీ రాష్ట్ర ప్రభుత్వం పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ జిల్లా వెనుకబాటుకి గురవుతుందని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకి నిధులు కేటాయించాలని కోరుతూ దశ లు వారి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.1
- అరసవల్లి , ఏప్రిల్,20: ఆహార పదార్థాల్లో హానికారక రంగులు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ అనుమతి లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అరసవెల్లి అసిరి తల్లి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ అసిరీతల్లి అమ్మవారి ఉత్సవం సందర్భంగా, ప్రదర్శనశాల ప్రాంతంలో దాని పరిసరాల్లో 11 ఆహార భద్రతా తనిఖీలను చేసినట్లు పేర్కొన్నారు. స్టాళ్లలో ఫాస్ట్ ఫుడ్ (మంచూరియా, నూడుల్స్), ఐస్ క్రీమ్ , మస్కా బన్, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. తనిఖీ సమయంలో కనుగొన్న విషయాలు: షుగర్ క్యాండీని అదనపు ఫుడ్ కలర్స్ ఉపయోగించి తయారు చేశారు.ఆ ఆహార పదార్థాలు సురక్షితం కాదని భావించి,వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.క్యాండీ తయారీకి ఉపయోగించిన రంగు పదార్థాలతో సహా ముడి పదార్థాలను కూడా ధ్వంసం చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులందరికీ అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీచేశారు. కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించవద్దు: గడువు ముగిసిన లేదా సురక్షితం కాని ఆహార పదార్థాలను అమ్మవద్దు సరైన పరిశుభ్రత ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. ప్రజారోగ్యం భద్రతను నిర్ధారించడానికి, విక్రేతలందరూ FSSAI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగింది. . ప్రతిరోజు ఉత్సవాల్లో అమ్మే ఆహార పదార్థాన్ని తనిఖీ చేస్తామని ఎటువంటి నిషేధిత రంగులని, ప్రామాణికము కానీ ఆహార పదార్థాలను గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారి కే .లక్ష్మీ పాల్గొన్నారు1
- డుంబ్రిగుడ, ఏప్రిల్ 21: డుంబ్రిగుడ మండలంలోని అరకులో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని సూకురుగుడ గ్రామానికి చెందిన వంతలో త్రినాధరావు బైక్‌పై డుంబ్రిగుడ వైపు వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by Sageni gangadhar1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.1
- శ్రీకాకుళం జిల్లాఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస లో గల ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల పెంపు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యా విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ స్వయంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామం లో ప్రధాన వీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నత విద్య, ఉన్నత ప్రమాణాలు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పలు సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఆధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత బోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం ,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని వివరించారు.4