Shuru
Apke Nagar Ki App…
శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత జాతి వీరత్వానికి శివాజీ నిలువెత్తు ప్రతీక అని, తరతరాలకు పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి అని కొనియాడారు. యువత ఆయన బాటలో నడవాలని నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, శివాజీ అభిమానులు పాల్గొన్నారు.
Narmala Swapna
శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత జాతి వీరత్వానికి శివాజీ నిలువెత్తు ప్రతీక అని, తరతరాలకు పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి అని కొనియాడారు. యువత ఆయన బాటలో నడవాలని నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, శివాజీ అభిమానులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన మహమ్మద్ సవాజ్ (40) చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.1
- *వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం* మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతి నరేష్ గౌడ్ ను గురువారం మెదక్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాలలో చేసిన కృషిని జర్నలిస్టులు కొనియాడారు. రానున్న రోజుల్లో సైతం నరేష్ గౌడ్ పట్టణ ప్రజలతో పాటు ఇటు జర్నలిస్టుల సంక్షేమానికి కోసం కూడా కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు, జర్నలిస్టులు కామాటి కీషన్, సురేంద్ర రెడ్డి ప్రకాష్, కె. రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.1
- నిజామాబాద్ : విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్రంలోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ లో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ పేరుతో గురువారం “ఆవిష్కార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనల నమూనాలను ఎంతో ఆసక్తితో తిలకించారు. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, ఆరోగ్యకరమైన ఆహారం, సన్ డయల్, అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. ఒక్కో ఎగ్జిబిట్ ను సందర్శిస్తూ, వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేవలం తరగతి గది, పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు సైన్స్ ఫేర్ లో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఈ దిశగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని కొత్తకొత్త ప్రయోగాలు చేసేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సంతోష్, శ్రీదేవి, ప్రిన్సిపాల్ ఆంథోని, లత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- టి.లింగంపల్లిలో శివాజీ జయంతి వేడుకలు రేగోడ్ మండలం టి.లింగంపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దిగంబర్ రావు, పీసీసీ సభ్యుడు కిషన్ శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. స్త్రీ గౌరవం, రైతు సంక్షేమం కోసం శివాజీ చేసిన కృషిని వారు కొనియాడారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి, మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ నూతన పాలకవర్గం ఈరోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ కమిషనర్ టీ. మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యురాలు వడ్లూరి సరిత చైర్ పర్సన్‌గా, 14వ వార్డు సభ్యురాలు పెరుమాండ్ల మానస వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. నూతన కౌన్సిలర్లు కూడా తమ పదవులను స్వీకరించగా, మున్సిపల్ అధికారులు వారిని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చారు1
- Post by KR NEWS 3691
- Post by GOVIND1
- కామారెడ్డిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రలో శివాజీ విగ్రహం, కాషాయ జెండాలతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 'జై శివాజీ... జై ''భవాని' నినాదాలతో పట్టణం మారుమోగింది. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, స్వరాజ్య స్థాపన కోసం పోరాడిన మహనీయుడు శివాజీ అని, ఆయన చూపిన బాటలో యువత పయనించాలని వక్తలు పిలుపునిచ్చారు.1