Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా : 19వ వార్డులో డ్రైనేజీ సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ నేడు 19వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాలువల పరిస్థితి, చెత్త సేకరణ, నీటి నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. డ్రైనేజీ నిల్వలు, చెత్త తొలగింపులో ఉన్న లోపాలపై అధికారులను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలని కాలనీవాసులను మున్సిపల్ అధికారులు సూచించారు.
Narmala Swapna
కామారెడ్డి జిల్లా : 19వ వార్డులో డ్రైనేజీ సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ నేడు 19వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాలువల పరిస్థితి, చెత్త సేకరణ, నీటి నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. డ్రైనేజీ నిల్వలు, చెత్త తొలగింపులో ఉన్న లోపాలపై అధికారులను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలని కాలనీవాసులను మున్సిపల్ అధికారులు సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- సి ఐటీయుచొరవ కార్మికుల ఐక్యత తో మెరుగైన వేతన ఒప్పందం.... సిఐటియు చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు.మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందం పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వద్ద శుక్రవారం నాడు సంతకాలు పూర్తి అయిన సందర్భంగా ఏ.మల్లేశం మాట్లాడినారు.కార్మికుల వేతన ఒప్పందం గడువు 2026 మార్చి 31 తో పూర్తి కాగా ఏప్రిల్ నెలలో యాజమాన్యం తో ఏప్రిల్ 12 వ తేదీన వేతన ఒప్పందం పై చర్చలు జరిగినాయన్నారు.ఆ ఒప్పందం ప్రకారం కార్మికులకు నెలకు గరిష్టంగా 7080 రూపాయలు, కనిష్టంగా 6000 రూపాయల వేతనం పెంపుదల, నెలకు 30 రూపాయల సర్వీస్ వెయిటేజ్, 1982 సిరీస్ ప్రకారం వి.డి. ఏ 7 రూపాయల నుండి 8 రూపాయలకు పెంపుదల, ముగ్గురు క్యాజువల్ కార్మికులను పెర్మనెంట్ చేయడం కోసం ఒప్పందం కుదిరిందన్నారు.జిల్లా లో చాలా పరిశ్రమల్లో నెలల తరబడి చర్చలు జరిగే సాంప్రదాయం ఉండగా CITU ఒకే దఫా చర్చలు చేసి ఒప్పందం చేయడం జిల్లాలోనే రికార్డు అన్నారు.ఇది కేవలం CITU నిజాయితీ,కార్మికుల ఐక్యమత్యం తోనే సాధ్యం అయిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక వైపు 12 గం.ల పని విధానం,ఉన్న కార్మికుల్నే కాంట్రాక్ట్ కార్మికులు గా మారుస్తుంటే ఉన్న క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే చరిత్ర CITU దే అని ఏ.మల్లేశం అన్నారు.జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఎప్పుడో నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఇ.ఎస్. ఐ, పి.ఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఏ.మల్లేశం అన్నారు.కేంద్రం ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చి పోయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.హక్కుల కోసం యూనియన్స్ ఏర్పాటు చేసుకుని పోరాడటమే అంతిమ పరిష్కారం అని అన్నారు.పోరాడే కార్మికులకు CiTU పూర్తి అండగా నిలుస్తుందని అన్నారు.వేతన ఒప్పందం పై యజమ్యం తరపున పరిశ్రమ పార్టనర్ దక్షిత్ మోర్, ప్రతినిధి ఆదర్శ్, నియాపోలి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తరపున CITU జిల్లా కార్యదర్శి ఆ యూనియన్ అధ్యక్షులు ఏ.మల్లేశం ,ప్రధాన కార్యదర్శి కె.నవీన్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్,సహాయ కార్యదర్శి మహేష్, కోశాధికారి శేఖర్, కార్మిక శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి సంతకాలు చేశారు. ఐ.డి యాక్ట్ 12(3)ప్రకారం ఈ వేతన ఒప్పందం కాల పరిమితి 2026 ఏప్రిల్ 1 నుండి 2029 మార్చి 31 వరకు ఉంటుందన్నారు.1
- Post by Vishwamber Rao1
- మెట్‌పల్లి, ఏప్రిల్ 17: మహిళా రాజకీయ ప్రాతినిధ్యం కోసం స్వర్గీయ కొమిరెడ్డి జ్యోతక్క చేసిన సుదీర్ఘ పోరాటాన్ని స్మరించుకుంటూ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె నివాసంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థినులు, నాయకులు పాల్గొన్నారు. 1998లోనే మహిళల రిజర్వేషన్ కోసం జ్యోతక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 27 ఏళ్ల తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు దిశగా ముందడుగు పడడం ఆమె దూరదృష్టికి నిదర్శనమన్నారు.అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు.2
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు1
- సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా CPR అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండె ఆగిన సందర్భాల్లో ఎలా స్పందించాలి, ప్రాణాలను ఎలా కాపాడాలి అనే విషయాలను సిబ్బందికి వివరించారు.1
- వేసవి కాలము దొంగలతో జాగ్రత్త ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ శ్రీ. డి. వి. శ్రీనివాస రావు ఐపిఎస్ ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ వేసవి కాలం సెలవులు ప్రారంభం అవుతున్న వేళ పెళ్లి ముహుర్తాలు,స్నేహితులతో, ఫ్యామిలీ మెంబర్స్ తో అంతా టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదే అదునుగా దొంగతనాలకు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని జిల్లా ప్రజలు కూడా ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనాల నియంత్రణ కోసం జిల్లా ప్రజలు ఈ దిగువ తెలియజేసిన నిబoధనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించగలరు. * ఇంటి బయట, డాబాల పైన పడుకునేవారు మెడలో నగలని జాగ్రత్తగా పెట్టుకోండి మరియు ఇంటిలో బంగారు ఆభరణాలు ఉంచకండి. * బసుల్లో ప్రయాణాలలో మీ బ్యాగ్ను మీ పైన ఉంచుకొని గట్టిగపట్టుకొని వెంట అంటిపెట్టుకోండి, గుర్తు తెలియని వ్యక్తులు తిను బండరాలు, కూల్డ్రింక్స్ లాంటివి ఇస్తే తినకండి తీసుకోకండి. * మీరు ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకండి వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం. * బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ, బీరువాలోని బట్టల క్రింద కానీ, ఇంట్లో కానీ పెట్టి వెళ్లవద్దు. * ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి గేటు బయట గొళ్ళెం పెట్టకండి. * ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు, తాళం కనపడకుండా కర్టెన్స్ వేయాలి. * ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి. * బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి. * బయటకు వెళ్ళేపుడు ఇంట్లో మరియు బయట లైట్ వేసి ఉంచండి. * పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి. * నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే నియమించుకోండి. * మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి. * ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి. * బయటకు వెళ్లేటప్పుడు, వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్త. వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది. * మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది, భద్రత ఎక్కువగా ఉంటుంది. * మీ ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని DVR రహస్య ప్రదేశాలలో భద్రపర్చుకోవాలి. మరియు మొబైల్ యాప్ ద్వారా సీసీకెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది. * మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయకండి. * మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి1
- మెట్ పల్లి, ఏప్రిల్ 17 (నినాదం) ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెండింగ్ డి.ఏలు, పీఆర్‌సీలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.3