రూ.5 కోట్ల భూమి పేరుతో.... రూ.14 లక్షల టోకరా! - నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో మోసం - ఐదుగురు అరెస్ట్ – పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు - భూముల కొనుగోలులో పూర్తి ధృవీకరణ తప్పనిసరి: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె : తక్కువ ధరకే రూ.5 కోట్ల విలువైన భూమిని ఇప్పిస్తామని ఆశ చూపించి, నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి రూ.14 లక్షలు కాజేసిన ముఠా లోని ఐదుగురు నిందితులను మదనపల్లె తాలూకా పోలీసులు అరెస్టు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. :- చౌక ధర 2.5 ఎకరాల భూమి మీదేనంటూ వల మదనపల్లె మండలంలోని అనంతపురం–కృష్ణగిరి జాతీయ రహదారి సమీపంలో, బసినికొండ పంచాయతీ పరిధిలో ఉన్న 2.52 ఎకరాల భూమి మార్కెట్ విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. అయితే ఆ భూమిని కేవలం రూ.13 లక్షలకే ఇప్పిస్తామని ల్యాండ్ బ్రోకర్ ఉప్పుతోళ్ల శేఖర్‌బాబు (ఏ–1)తో పాటు మరో నలుగురు కలిసి మదనపల్లెకు చెందిన పొన్నంరెడ్డి శోభారాణి, ఆమె భర్త పుల్లారెడ్డిని నమ్మించారు. భూమిని చూపించి కొలతలు వేయించిన అనంతరం 2025 సెప్టెంబర్ 1న రూ.13 లక్షలు నగదుగా తీసుకుని అగ్రిమెంట్ రాసిచ్చారు. అనంతరం పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పిస్తామని మరో రూ.1 లక్ష వసూలు చేసి, తహసీల్దార్ సంతకాలు, అధికారిక ముద్రలతో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలను తయారు చేసి బాధితులకు అందజేశారు. :- నకిలీ పత్రాలు వెలుగులోకి... కొంతకాలం తర్వాత యజమానులు తమ భూమి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, అప్పటికే ఆ భూమి ఇతరులకు సైతం విక్రయించడంతో శోభారాణి కుటుంబ సభ్యులు విఫలమయ్యారు. తమకు ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకాలు నకిలీవని, అదే భూమిని ఇప్పటికే ఇతరులకు విక్రయించినట్లు బాధితులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా నిందితులు బెదిరింపులకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో బాధితురాలు జూలై 29న మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రైం నంబర్ 220/2026గా క్రిమినల్ కాన్స్పిరసీ, ఫోర్జరీ, చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. :- ప్రత్యేక దర్యాప్తు బృందం వలలో ఐదుగురు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ ఎం. బుచ్చిరాజు పర్యవేక్షణలో తాలూకా సీఐ కళా వెంకటరమణ నేతృత్వంలోని ప్రత్యేక బృందం శనివారం మధ్యాహ్నం నిమ్మనపల్లె నాలుగు రోడ్ల కూడలిలో ప్రధాన నిందితులు ఉప్పుతోళ్ల శేఖర్‌బాబు, గడియారం మురళి, గడియారం యర్రప్ప, గడియారం మణి, గడియారం రెడ్డెప్పలను అరెస్టు చేశారు. కేసులో ప్రమేయం ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. :- భూమి కొనుగోలు ముందు అప్రమత్తంగా ఉండాలి భూములు కొనుగోలు చేసే ముందు సంబంధిత రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, యాజమాన్య హక్కులను సంబంధిత అధికారుల వద్ద తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఎస్పీ సూచించారు. తక్కువ ధరకే విలువైన భూములు ఇప్పిస్తామని ఆశ చూపే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరించారు. ఏవైనా అనుమానాలు తలెత్తితే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, డీఎస్పీ ఎం. బుచ్చిరాజు, తాలూకా సీఐ కళా వెంకటరమణతో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రూ.5 కోట్ల భూమి పేరుతో.... రూ.14 లక్షల టోకరా! - నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో మోసం - ఐదుగురు అరెస్ట్ – పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు - భూముల కొనుగోలులో పూర్తి ధృవీకరణ తప్పనిసరి: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె : తక్కువ ధరకే రూ.5 కోట్ల విలువైన భూమిని ఇప్పిస్తామని ఆశ చూపించి, నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి రూ.14 లక్షలు కాజేసిన ముఠా లోని ఐదుగురు నిందితులను మదనపల్లె తాలూకా పోలీసులు అరెస్టు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. :- చౌక ధర 2.5 ఎకరాల భూమి మీదేనంటూ వల మదనపల్లె మండలంలోని అనంతపురం–కృష్ణగిరి జాతీయ రహదారి సమీపంలో, బసినికొండ పంచాయతీ పరిధిలో ఉన్న 2.52 ఎకరాల భూమి మార్కెట్ విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. అయితే ఆ భూమిని కేవలం రూ.13 లక్షలకే ఇప్పిస్తామని ల్యాండ్ బ్రోకర్ ఉప్పుతోళ్ల శేఖర్‌బాబు (ఏ–1)తో పాటు మరో నలుగురు కలిసి మదనపల్లెకు చెందిన పొన్నంరెడ్డి శోభారాణి, ఆమె భర్త పుల్లారెడ్డిని నమ్మించారు. భూమిని చూపించి కొలతలు వేయించిన అనంతరం 2025 సెప్టెంబర్ 1న రూ.13 లక్షలు నగదుగా తీసుకుని అగ్రిమెంట్ రాసిచ్చారు. అనంతరం పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పిస్తామని మరో రూ.1 లక్ష వసూలు చేసి, తహసీల్దార్ సంతకాలు, అధికారిక ముద్రలతో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలను తయారు చేసి బాధితులకు అందజేశారు. :- నకిలీ పత్రాలు వెలుగులోకి... కొంతకాలం తర్వాత యజమానులు తమ భూమి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, అప్పటికే ఆ భూమి ఇతరులకు సైతం విక్రయించడంతో
శోభారాణి కుటుంబ సభ్యులు విఫలమయ్యారు. తమకు ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకాలు నకిలీవని, అదే భూమిని ఇప్పటికే ఇతరులకు విక్రయించినట్లు బాధితులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా నిందితులు బెదిరింపులకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో బాధితురాలు జూలై 29న మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రైం నంబర్ 220/2026గా క్రిమినల్ కాన్స్పిరసీ, ఫోర్జరీ, చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. :- ప్రత్యేక దర్యాప్తు బృందం వలలో ఐదుగురు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ ఎం. బుచ్చిరాజు పర్యవేక్షణలో తాలూకా సీఐ కళా వెంకటరమణ నేతృత్వంలోని ప్రత్యేక బృందం శనివారం మధ్యాహ్నం నిమ్మనపల్లె నాలుగు రోడ్ల కూడలిలో ప్రధాన నిందితులు ఉప్పుతోళ్ల శేఖర్‌బాబు, గడియారం మురళి, గడియారం యర్రప్ప, గడియారం మణి, గడియారం రెడ్డెప్పలను అరెస్టు చేశారు. కేసులో ప్రమేయం ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. :- భూమి కొనుగోలు ముందు అప్రమత్తంగా ఉండాలి భూములు కొనుగోలు చేసే ముందు సంబంధిత రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, యాజమాన్య హక్కులను సంబంధిత అధికారుల వద్ద తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఎస్పీ సూచించారు. తక్కువ ధరకే విలువైన భూములు ఇప్పిస్తామని ఆశ చూపే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరించారు. ఏవైనా అనుమానాలు తలెత్తితే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, డీఎస్పీ ఎం. బుచ్చిరాజు, తాలూకా సీఐ కళా వెంకటరమణతో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
- ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది,2
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి1
- హాకింగ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చేసినఓటుకు బయోమెట్రిక్ ను లింక్ చేయాలి : చిత్తూరు జిల్లా కుప్పం... ఓటుకు బయోమెట్రిక్ ను లింక్ చేయాలి : పాఠశాల కరస్పాండెంట్ హఫీజ్ హాకింగ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాఠశాల కోరిసాండెంట్ హఫీజ్.. పాఠశాలలో క్లాస్ లీడర్ ను ఎంచుకోవడానికి బయోమెట్రిక్ తో ఓటు వేసే విధానాన్ని ప్రాజెక్ట్ ద్వారా యాప్ ను ఇంప్లిమెంట్ చేశాం.. బయోమెట్రిక్ ను ఓటుకు లింక్ చేస్తే దొంగ ఓటు వేయడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి, ఓటుకు బయోమెట్రిక్ ను లింక్ చేయాలి రేషన్ కార్డుకు బయోమెట్రిక్ లింక్ చేసిన విధంగా ఓటుకు బయోమెట్రిక్ లింక్ చేయండి మీ ఓటు మీ బాధ్యతలో భాగంగా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశాం విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి బయోమెట్రిక్ తో ఓటు వేసే విధంగా యాప్ ను రూపొందించారు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఓటుకు బయోమెట్రిక్ ను లింక్ చేయాలని కోరుకుంటున్నాం1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- కాణిపాకంలో టిడిపి వైసిపి నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఐరాల మండలం కాణిపాకంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నినాదాలతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్య ప్రమాణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నాయకులను ఉద్దేశించి నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1