GSLV-F15 రాకెట్ ప్రయోగ విజయంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి స్పందన శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష విజయాల్లో మరో మెరుగైన అధ్యాయం శ్రీహరికోట నుండి ఈ రోజు ప్రయోగించిన GSLV-F15 రాకెట్ విజయవంతంగా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టడం దేశానికి గర్వకారణమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇస్రో విజయం దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్న ప్రతిభకు నిదర్శనం అని అన్నారు. గగన్ యాన్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసి, భారతీయులు అంతరిక్షంలోకి అడుగుపెట్టే రోజులు దూరంగా లేవు అని చెప్పారు.ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించినట్లు మూడు గగన్ యాన్ ప్రయోగాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. అందులో రెండు మానవరహిత ప్రయోగాలు, ఒకటి మానవ సహిత ప్రయోగం ఉంటాయని వెల్లడించారు. ఇస్రో షార్ కేంద్రం నుంచి 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం చరిత్రాత్మక ఘట్టం అని రాజేశ్వరి అన్నారు.భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో విజయాలను సాధించింది. 1979లో SLV-3 విజయంతో మొదలైన ప్రయాణం నుంచి, తాజాగా GSLV-F15 విజయం వరకు, ఇస్రో సాధించిన ప్రగతికి ప్రపంచమే సాక్ష్యమా అన్నారు..ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, భారత్ అంతరిక్ష పరిశోధనలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నందుకు గర్వంగా ఉంది అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలను ఇస్రో సాధించాలని ఆకాంక్షించారు.

- శబరిమల పాదయాత్ర 12వ రోజు కోవూరు నుండి వేదయపాలెం అయ్యప్ప స్వామి దేవాలయం నెల్లూరు1
- ఘనంగా చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి పుట్టినరోజు వేడుకలు| నిర్వహించిన/ ఇంటూరి విజయ్| పంతంగి రాము|kovur/1
- కమిషనర్‌గా బాధ్యతల చేపట్టిన డి.బాలకృష్ణ బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం బదిలీ అయ్యారు. ఈ మేరకు నూతన కమిషనర్ గా డి. బాలకృష్ణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం ఘన పలికారు. అనంతరం నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మెప్మా సిబ్బంది మర్యాదపూర్వకంగా కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ సుప్రజ, తో పాటు కౌన్సిల్ సభ్యుల సహకారంతో నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నగర పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నగర పంచాయతీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.2
- నెల్లూరు డిస్టిక్ వెంకటాచలం దగ్గర1
- వెంకటాచలం లోనే జరిగే అద్భుతం చాగంటి కోటేశ్వరావు గారు1
- *వ్యాపారస్థులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి* బుచ్చిరెడ్డి పాళెం పట్టణం చెన్నూరు రోడ్డు లోని ఆటో స్స్టాండ్ ను గిరిజ హాలు వద్దకు తరలించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వైఎస్సార్ విగ్రహ కూడలిలోను అటు చెన్నూరు రోడ్డు వైపున రోడ్ మార్జిన్ వ్యాపారస్థులతో ఆమె మాట్లాడారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అనంతరం బుచ్చి పట్టణ టిడిపి కార్యాలయం లోటస్ గ్రాండ్ లో చెన్నూరు రోడ్డులో తోపుడు బండ్ల పై పళ్ళు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారాస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు మార్జిన్ వెండర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన వారికి ఈ నెల 25 లోపు తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజను ఆదేశించారు. బుచ్చి పట్టణంలో బాలికల పాఠశాలల వద్ద ఉదయం 8 నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మహిళా కానిస్టేబుల్స్ తో స్పెషల్ బీట్ ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. చెన్నూరు రోడ్డులో ఆటోలను నియంత్రించాలని పోలీసులను ఆదేశించారు. బుచ్చి పట్టణంలోని రోడ్ మార్జిన్ వ్యాపారస్థులకు ఆర్టిసి తరలిస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న అధికారుల సూచనల మేరకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆర్టిసి బస్టాండ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి నగర పంచాయతి ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, కౌన్సిలర్లతో పాటు టిడిపి అర్బన్ మరియు రూరల్ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య, బత్తుల హరికృష్ణ,కోడూరు కమలాకర్ రెడ్డి, మోర్ల మురళి, వింజం రామానాయుడు , పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.2