logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

క్యాన్సర్ తో మరణించిన కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికుడు జలగడుగుల శ్యామల కుమార్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలి..! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబినాయన కు వినతి..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడు జలగడుగుల శ్యామల కుమార్ 2025 ఫిబ్రవరి 14న క్యాన్సరు బాధతో మరణించారు. ఆయన పిల్లలు, భార్య శ్యామల కుమార్ మరణించాక ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని శ్యామల కుమార్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని 18 నెలలుగా మున్సిపల్ కమిషనర్ కి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు శ్యామల కుమారు భార్యకు ఉద్యోగం ఇవ్వలేదు. అని చెప్పడం జరిగింది. గతంలో మన మున్సిపాలిటీలోనే ఉద్దాన లక్ష్మి, రాజాన శ్రీను, శనపతి దేవి, నాగవంశం బాలు, సిరిపురపు మనికంట వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. గత కమిషనర్లు అమలు చేస్తున్న పద్ధతిని ఈ కమిషనర్ అమలు చేయకుండా జీవో లేదని ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ సంవత్సరంలోనే సాలూరు పాలకొండ విశాఖపట్నం రాయలసీమ జిల్లాల్లో ఏ జీవో లేకుండానే చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని కార్మికులకు న్యాయం చేయాలని సిఐటియు తరఫున విన్నవించడం జరిగింది. జలగడుగుల శ్యామల కుమార్ భార్యకు ఉద్యోగం ఇచ్చేంతవరకు రేపు అనగా 27వ తేదీ నుండి మున్సిపల్ ఆఫీసు వద్ద భార్యా పిల్లలతో నిరాహార దీక్ష సెప్టెంబరు 5 లోపు సమస్య పరిష్కారం చేయని యెడల నిరవదిక సమ్మెలోకి వెళ్లాలని యూనియన్ గా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గండ్రేటి గౌరీ, జలగడుగుల రామారావు, మంగళగిరి ప్రసాదు గండ్రేటి వాసు కార్మికులు పాల్గొన్నారు.

1 hr ago
user_బొబ్బిలి గణేష్
బొబ్బిలి గణేష్
Local News Reporter బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
b865cbf9-2e5d-4cb1-ab16-5f4cd3a1b136

క్యాన్సర్ తో మరణించిన కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికుడు జలగడుగుల శ్యామల కుమార్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలి..! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబినాయన కు వినతి..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడు జలగడుగుల శ్యామల కుమార్ 2025 ఫిబ్రవరి 14న క్యాన్సరు బాధతో మరణించారు. ఆయన పిల్లలు, భార్య శ్యామల కుమార్ మరణించాక ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని శ్యామల కుమార్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని 18 నెలలుగా మున్సిపల్ కమిషనర్ కి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు శ్యామల కుమారు భార్యకు ఉద్యోగం ఇవ్వలేదు. అని చెప్పడం జరిగింది. గతంలో మన మున్సిపాలిటీలోనే ఉద్దాన లక్ష్మి, రాజాన శ్రీను, శనపతి దేవి, నాగవంశం బాలు, సిరిపురపు మనికంట వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. గత కమిషనర్లు అమలు చేస్తున్న పద్ధతిని ఈ కమిషనర్ అమలు చేయకుండా జీవో లేదని ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ సంవత్సరంలోనే సాలూరు పాలకొండ విశాఖపట్నం రాయలసీమ జిల్లాల్లో ఏ జీవో లేకుండానే చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని కార్మికులకు న్యాయం చేయాలని సిఐటియు తరఫున విన్నవించడం జరిగింది. జలగడుగుల శ్యామల కుమార్ భార్యకు ఉద్యోగం ఇచ్చేంతవరకు రేపు అనగా 27వ తేదీ నుండి మున్సిపల్ ఆఫీసు వద్ద భార్యా పిల్లలతో నిరాహార దీక్ష సెప్టెంబరు 5 లోపు సమస్య పరిష్కారం చేయని యెడల నిరవదిక సమ్మెలోకి వెళ్లాలని యూనియన్ గా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గండ్రేటి గౌరీ, జలగడుగుల రామారావు, మంగళగిరి ప్రసాదు గండ్రేటి వాసు కార్మికులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చీపురుపల్లి మండలంలో బుధవారం ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన చిరుజల్లుల వర్షం ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వరి నారుమళ్లకు, అంతర పంటలకు ఎంతో ప్రయోజనకరమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చీపురుపల్లి మండలంలో వర్షం
    1
    చీపురుపల్లి మండలంలో బుధవారం ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన చిరుజల్లుల వర్షం ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వరి నారుమళ్లకు, అంతర పంటలకు ఎంతో ప్రయోజనకరమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
చీపురుపల్లి మండలంలో వర్షం
    user_B.RAJESH
    B.RAJESH
    Media company బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - ⁠వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
    1
    బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే  బేబీనాయన..
పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్..
- ⁠వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం.
బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. 
గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.
    1
    రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు 
రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.
    user_Prama latha
    Prama latha
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 min ago
  • రాజాం హాస్టల్ విద్యార్థినులతో రోడ్లపై డాన్సులు, చేయించిన వార్డెన్ రమాదేవి. రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.
    1
    రాజాం హాస్టల్ విద్యార్థినులతో  రోడ్లపై డాన్సులు,  చేయించిన వార్డెన్ రమాదేవి. 
రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది  రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,  బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.
    user_Durgarao Rupa
    Durgarao Rupa
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
    1
    విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు..
విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు   పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు
    1
    డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు 
దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
    1
    విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ 
విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్.. విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్..
విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.