నేతన్న సేవలో పథకంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష... అర్హుడికి సాయం అందకపోతే బాధ్యులెవరు? అధికారులను ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్ధిదారుల వివరాలపై ఆరా.. అర్హులందరికీ పథకం అందేలా మంత్రి దిశానిర్దేశం నేతన్న సేవలో నిర్లక్ష్యానికి చోటు లేదు.. అధికారులకు మంత్రి సత్యకుమార్ స్పష్టమైన ఆదేశం ధర్మవరం, ఆగస్టు 27:– నేతన్నల సంక్షేమం, ఆర్థిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి నేతన్నకు నేతన్న సేవలో పథకం ద్వారా ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనం అందేలా అధికారులు సమగ్రంగా పనిచేయాలని ఆదేశించారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో గురువారం ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి, హ్యాండ్లూమ్ ఏడి అప్పాజీ, చేనేత శాఖ అధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతన్న సేవలో పథకం అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం ద్వారా ఇప్పటివరకు ఎంతమంది నేతన్నలకు ప్రయోజనం అందింది, అర్హత ఉన్నప్పటికీ ఇంకా ఎంతమందికి ప్రయోజనం అందలేదు, అందకపోవడానికి గల కారణాలు ఏమిటనే అంశాలపై అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, కలెక్టర్ తదితర ఉన్నతాధికారులతో తాను చర్చించిన విషయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలోనూ నేతన్నల సంక్షేమం, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న నేతన్న సేవలో పథకం ద్వారా మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 71,536 మంది నేతన్నలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి తెలిపారు. పథకానికి సంబంధించి కొత్తగా 36,617 దరఖాస్తులు అందాయని, వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని వెల్లడించారు. అర్హులైన నేతన్నలను గుర్తించేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన నిర్వహిస్తున్నారని, ఈ లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే రెండో విడతలో మిగిలిపోయిన అర్హులైన నేతన్నలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పథకం ప్రయోజనం పొందేందుకు అర్హత ఉన్న ఏ ఒక్క నేతన్న కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క నేతన్నకూ నేతన్న సేవలో పథకం వర్తింపజేస్తామని, అర్హుల గుర్తింపు ప్రక్రియలో ఎవరి పేరు మిగిలిపోయినా, అర్హత ఉన్నప్పటికీ ప్రయోజనం అందకపోయినా దానిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరడమే ప్రభుత్వ లక్ష్యం. అర్హత ఉన్న ఒక్క నేతన్నకు కూడా అన్యాయం జరగకూడదు. ఎక్కడైనా అర్హుడికి అన్యాయం జరిగినట్లు తేలితే సహించేది లేదు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్షకు, రాజకీయ జోక్యానికి, అనర్హులకు ప్రయోజనం కల్పించే విధానాలకు తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. అర్హతలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిశీలించి, నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం మరింత భరోసాను కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. నేతన్నల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారు ఎవరైనా పథకం ప్రయోజనం అందకపోతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. అర్హులైన ప్రతి నేతన్నకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

- శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.1
- ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్” శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్‌కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెబ్ సిరీస్‌లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్‌కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.1
- Dharmavaram market Road Near current office due to drainage water facing health issues Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e. e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu. yours youth rockz4
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1