Shuru
Apke Nagar Ki App…
బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సొంత గ్రామమైన వర్గల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన ములుగు డివిజన్ఆత్మ కమిటీ డైరెక్టర్లు వర్గల్ వార్డు సభ్యులు ఆరుగురు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీష్ అన్న సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
KHADEER REPORTER
బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సొంత గ్రామమైన వర్గల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన ములుగు డివిజన్ఆత్మ కమిటీ డైరెక్టర్లు వర్గల్ వార్డు సభ్యులు ఆరుగురు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీష్ అన్న సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
More news from తెలంగాణ and nearby areas
- లారీ బోల్తాపడి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్........... జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది.గురువారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పై లారీ పడడంతో పైప్ లైన్ పగిలిపోయినట్లు స్థానికులు తెలిపారు.దీంతో కొడకండ్ల,పెద్దవంగర మండలాల గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్–నందగోకుల్ రహదారికి డాంబర్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్, దయాకర్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.2
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ నర్సాపూర్–మెదక్ ప్రధాన రహదారి పక్కన తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌ను మండల ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సురేష్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల బృందంతో కలిసి హాస్టల్‌లోని వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులు, వంటశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు తయారు చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సురేష్‌బాబు తెలిపారు.1
- మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ *మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.1
- మార్పులు ప్రధాన కారణం హిమాలయాల్లో భూతాపం తినడం వల్ల మంచు గడ్డలు వేగంగా కరిగి పెద్ద సరస్సుగా మారుతాయి టిబెట్,నేపాల్ ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన తీవ్రమైన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటానికి గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్స్ (GLOFs)తీవ్రమైన మేఘావృత్త వర్షాలు (Cloudbursts)మరియు వాతావరణ మార్పులు (Climate Change)ప్రధాన కారణాలు.* వరదలకు మరియు తీవ్ర వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు *గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ (GLOF):* హిమాలయాల్లో భూతాపం పెరగడం వల్ల మంచు గడ్డలు (Glaciers) వేగంగా కరిగి పెద్ద సరస్సులుగా మారుతున్నాయి. ఈ సరస్సుల గట్లు తీవ్రమైన వర్షాలకు లేదా భూకంపాలకు ఒక్కసారిగా తెగిపోయినప్పుడు 'గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్' జరిగి గియిరోంగ్ పోర్ట్ (Gyirong Port) వంటి సరిహద్దు ప్రాంతాలపైకి సునామీలా బురద వరదలు విరుచుకుపడతాయి. *గ్లోబల్ వార్మింగ్ (భూతాపం పెరగడం):*ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల కంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమను పట్టి ఉంచే సామర్థ్యం పెరిగి,అనుకోని సమయంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. *వర్షాకాలంలో మార్పులు :* అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో భారీ వర్షం ప1
- విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.4
- రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు1
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4