Shuru
Apke Nagar Ki App…
అలివేలు మంగమ్మ నేత్రదానం శ్రీకాకుళం, జనవరి 9: మరణించినా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. బూర్జ మండలం అయ్యావారిపేటకు చెందిన బైరి అలివేలు మంగమ్మ (68) ఇటీవల మృతి చెందగా, ఆమె నేత్రాలను దానం చేసేందుకు కుమారుడు అనిల్‌కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ సమాచారంతో రెడ్‌క్రాస్ ప్రతినిధులు, ఐ-టెక్నీషియన్ పి.సుజాత బృందం మృతురాలి నుంచి కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర నిధికి తరలించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ.. నేత్రదానం మహాదానమని, అంధత్వ రహిత సమాజం కోసం యువత కృషి చేయాలన్నారు. దాత కుటుంబాన్ని రెడ్‌క్రాస్ ప్రతినిధులు అభినందించారు. నేత్రదానం చేయదలచిన వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు.
Dr.Gangu Manmadharao

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్‌తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- Post by Ravi Poreddy1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్1
- Post by Paramesh Ratnagiri1
- 🙏🙏1
- నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.1
- ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి నీతి, నిజాయితీతో పనిచేస్తూ... ప్రజాదారణ పొందిన సంస్థ hmtv అని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిసిసి ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం అన్నారు గంగాధర మండలం ఇస్లాంపూర్ లో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం హెచ్ఎంటీవీ వీక్షకులకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు1