Shuru
Apke Nagar Ki App…
రఘునాథపురం గ్రామంలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన సదస్సు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పల్లె సంతోష్ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరిసేద్యం చేసి నష్టపోవద్దని, ఆరుతడి పంటలైన మునగ, బొబ్బర్లు, నువ్వులు, కూరగాయలు సాగు చేయాలని ఏవో పద్మజ సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరగా, పలువురు రైతులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిల్వేరు బాలరాజు గౌడ్, ఏఈఓ ప్రణీత తదితరులు పాల్గొన్నారు
SHEKHAR
రఘునాథపురం గ్రామంలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన సదస్సు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పల్లె సంతోష్ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరిసేద్యం చేసి నష్టపోవద్దని, ఆరుతడి పంటలైన మునగ, బొబ్బర్లు, నువ్వులు, కూరగాయలు సాగు చేయాలని ఏవో పద్మజ సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరగా, పలువురు రైతులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిల్వేరు బాలరాజు గౌడ్, ఏఈఓ ప్రణీత తదితరులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో నర్సంపేట ప్రజా జనం వరంగల్ జిల్లా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్1
- పార్టీతో పనిలేదు ప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంత ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం పార్టీతో పనిలేదుప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంతఇల్లు... అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఇది కేవలం పథకం కాదు - గౌరవంతో జీవించే హక్కు... నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ ఇల్లు... కప్పు లేని గుడిసెలకు ఆశ్రయమిచ్చి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం నింపే ఇందిరమ్మ ఇల్లు...!! ఆత్మగౌరవ ప్రతీక కేవలం ఇటుకల నిర్మాణం కాదు, నిరుపేద కుటుంబానికి దక్కిన ఆత్మగౌరవప్రతిక ఇందిరమ్మ ఇల్లు..!! ఎన్నో ఏళ్ల కలల సహకారం ఇందిరమ్మ ఇల్లు.. సొంతింటి కల సహకారమై ప్రతి పేదల ముఖంలో చిరునవ్వులు పూయించే సువర్ణ అవకాశం ప్రజా ప్రభుత్వం చేస్తుంది..!! ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..!! జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోని అమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..* *మీ.. సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1