హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిలమత్తూరు బస్టాండ్ దగ్గర హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది కార్యక్రమం చిలమత్తూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించుకుని ర్యాలీగా భోజన చేసుకుంటూ సమావేశం స్థానానికి చేరుకొని సుప్రియ బాలాజీ నాట్యమండలి వారిచే భరతనాట్యము, వందేమాతరం,మొదలగుసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శ్రీ లక్ష్మణ్ జి గారు మాట్లాడుతూ హిందువులంతా సంఘటితమై హిందుత్వాన్ని ఊపిరిగా ఆచరించడం ద్వారా హిందూ దేశం పరమ వైభవ స్థితిని మరలా పొందుతుందని ఉద్ఘాటించారు అయోధ్యలో రామ మందిరము నిర్మించడం హిందూ చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. యువత సరైన మార్గంలో నడవడం ద్వారానే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది, ప్రతి హిందువు కనీసం ముగ్గురు లేదా నలుగురు సంతానాన్ని కలిగి ఉండాలని చెప్పారు,ప్రతి తల్లి తన సంతానాన్ని గమనిస్తూ పెంచాలి,పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర తల్లి దే అని ఉద్ఘాటించార ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది హిందువులు కుటుంబ సభ్యులతో కలిపి పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో చిలమత్తూరు హిందూ కుటుంబాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిలమత్తూరు బస్టాండ్ దగ్గర హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది కార్యక్రమం చిలమత్తూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించుకుని ర్యాలీగా భోజన చేసుకుంటూ సమావేశం స్థానానికి చేరుకొని సుప్రియ బాలాజీ నాట్యమండలి వారిచే భరతనాట్యము, వందేమాతరం,మొదలగుసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శ్రీ లక్ష్మణ్ జి గారు మాట్లాడుతూ హిందువులంతా సంఘటితమై హిందుత్వాన్ని ఊపిరిగా ఆచరించడం ద్వారా హిందూ దేశం పరమ వైభవ స్థితిని మరలా
పొందుతుందని ఉద్ఘాటించారు అయోధ్యలో రామ మందిరము నిర్మించడం హిందూ చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. యువత సరైన మార్గంలో నడవడం ద్వారానే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది, ప్రతి హిందువు కనీసం ముగ్గురు లేదా నలుగురు సంతానాన్ని కలిగి ఉండాలని చెప్పారు,ప్రతి తల్లి తన సంతానాన్ని గమనిస్తూ పెంచాలి,పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర తల్లి దే అని ఉద్ఘాటించార ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది హిందువులు కుటుంబ సభ్యులతో కలిపి పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో చిలమత్తూరు హిందూ కుటుంబాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏1
- పొన్నూరు: ప్రేమ జంటకు రక్షణ కల్పించిన పోలీసులు పొన్నూరుకు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అనే భయంతో మార్చి 28వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి మిస్సింగ్పై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వటంతో పోలీసులు వీరిని పిలిపించారు.1
- ములకలకాలువ గ్రామ సభ1
- Post by Syyed taher1
- *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.3
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: జి.ఓ నెం.60ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వాహన యజమానులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.... ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తపరిచారు... ఈ కార్యక్రమం *నల్లగొండ మాక్సి క్లబ్ సీసీ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితరాజు రమేష్* ఆధ్వర్యంలో కొనసాగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ఇప్పటికే ట్యాక్సులు, టోల్ ఫీజులు, డీజిల్ ధరలతో నలిగిపోతున్నాం.. జి.ఓ. 60 మాకు మరింత భారంగా మారింది... లారీకి వేల రూపాయల అదనపు భారం పడుతోంది... మా ఆదాయం మాత్రం రోజురోజుకీ పడిపోతోంది... కిరాయిలు లేక అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రభుత్వం మా పరిస్థితి అర్థం చేసుకోవాలి... "ఎక్సైజ్ శాఖ తరువాత కోట్లాది రూపాయలలో ఆదాయంలో రెండవ స్థానంలో ఉన్న కూడా వాహన యజమానుల యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు... కానీ మాకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు... రిపేర్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి.. నల్లగొండలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి... వాహన యజమానులు జి.ఓ. నెం.60ను తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్లు చేశారు.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాలి... వాహన యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి హెచ్చరిక చేశారు... మా డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉగ్రరూపం దాల్చే ఆందోళనలు చేపడతాం...1