తుమ్మన్‌పేట బస్తీ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు నూతన భవన నిర్మాణానికి హామీ – అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు.వంశీకృష్ణ అచ్చంపేట, జనవరి 13,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని బల్మూర్ మండలం తుమ్మన్‌పేట గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంగళ వారం రోజు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతున్న వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు అయిన డా. వంశీకృష్ణ పాల్గొన్నారు. దవాఖానలోని వైద్యులు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ దవాఖానల బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ , తుమ్మన్‌పేట గ్రామంలో నూతన బస్తీ దవాఖాన భవనాన్ని నిర్మిస్తామని , మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.
తుమ్మన్‌పేట బస్తీ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు నూతన భవన నిర్మాణానికి హామీ – అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు.వంశీకృష్ణ అచ్చంపేట, జనవరి 13,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని బల్మూర్ మండలం తుమ్మన్‌పేట గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంగళ వారం రోజు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతున్న వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు అయిన డా. వంశీకృష్ణ
పాల్గొన్నారు. దవాఖానలోని వైద్యులు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ దవాఖానల బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ , తుమ్మన్‌పేట గ్రామంలో నూతన బస్తీ దవాఖాన భవనాన్ని నిర్మిస్తామని , మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.
- కొత్తపల్లి: అల్లుకున్న నిర్లక్ష్యం నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లిలోని శివాలయం సమీపంలోని నియంత్రిక, స్తంభంతో పాటు విద్యుత్ తీగలకు పిచ్చి చెట్లు, తీగ జాతి మొక్కలు అల్లుకొని ఉన్నాయి. గృహ విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికకు పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- కర్నూలు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం ఎక్కడో తెలవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి..!2
- సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల తుది జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి1
- నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వేగవంతమైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులన్నిటిని కలియతిరిగి అక్కడున్న సదుపాయాలు అని అడిగి తెలుసుకుంటారు. నవజాత శిశు విభాగంలో రిజిస్టర్లను పరిశీలించిన ఆయన విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతోపాటు వైద్యశాఖ సిబ్బంది డాక్టర్లు ఉన్నారు.1