మహబూబాబాద్ జిల్లా, మండల స్థాయి విపత్తుల కార్యనిర్వహణ కమిటీ సమావేశాలు ప్రభుత్వం సూచించిన ప్రకారం *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్* ల ఆదేశాల మేరకు జిల్లాలో (18) మండలలో మండల ప్రత్యేక అధికారులు చైర్మెన్ గా తహసిల్దారలు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్స్, ఐబి, ఆర్అండ్బి, పిఆర్, ఎంబి, విద్యుత్, అసిస్టెంట్ ఇంజనీర్స్, వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యానవన, సిబ్బంది సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేసుకొని వచ్చే వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా కార్యాచరణ ప్రకారం సిద్ధంగా ఉండాలని, గ్రామాలు, పట్టణాలలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించడం జరుగుతుందని, హైరిస్కు ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలు, చెరువులు, కుంటలు, కెనాల్లు, తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి ఉంటూ విపత్తులను ఎదుర్కోవాలని, ఈ సమావేశాల ద్వారా ప్రజలకు , మీడియా వారికి సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలని అన్నారు, పంట, పశు, ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని, వెంట వెంటనే ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని, మండల స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా అధిక నష్టాలు జరగకుండా ఉంటుందని అన్నారు. *జిల్లా ప్రత్యేక అధికారులు* * మహబూబాబాద్ మండల ప్రత్యేక అధికారి ఇంచార్జీ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, * కేసముద్రం మండల ప్రత్యేక అధికారి డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, * నెల్లికుదురు మండల ప్రత్యేక అధికారి జి. మరియన్న, * గూడూరు మండల ప్రత్యేక అధికారి ఏ డి ఏ శ్రీనివాసరావు, * డోర్నకల్ మండల ప్రత్యేక అధికారి డి ఏ ఓ విజయచంద్ర. * కొత్తగూడ మండల ప్రత్యేక అధికారి డి ఈ ఓ సత్యనారాయణ మూర్తి, * చిన్న గూడూరు మండల ప్రత్యేక అధికారి జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్.

- నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు... తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆయన మరణవార్తతో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలిస్తుండటంతో.. అశేష జనవాహిని నర్సంపేట వైపు కదలివస్తోంది. తమ ప్రియతమ నాయకుడిని ఆఖరిసారి చూసుకునేందుకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు.నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా తోటి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ నర్సంపేట నినాదాలతో మారుమోగుతోంది.2
- దొంగతనం కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేయబోతే సీసీటీవీలో కనిపించిన అసలు దొంగ ఎలుక! కర్ణాటక: తుమకూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ఆభరణాలు కనిపించకుండా పోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఓ ఎలుక ఒక్కో ఉంగరం, చిన్న ఆభరణాలను నోటితో తీసుకెళ్లడం కనిపించింది. దీంతో ఎలుక బొరియను పరిశీలించగా 10 బంగారు ఉంగరాలు, మూడు బంగారు చైన్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని దుకాణ యాజమాన్యం తెలిపింది. మెరిసే వస్తువులను తన గూటిలోకి తీసుకెళ్లే అలవాటు వల్లే ఎలుక ఆభరణాలను తరలించినట్లు భావిస్తున్నారు.1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- *ములుగు:* చావుతో పోరాడుతూ అనంతలోకాలకు చేరుకున్న BRS సీనియర్ నాయకుడు, నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు.. నల్లబెల్లిలో జనసంద్రం వరంగల్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవుతున్నారు.2
- కే సముద్రం కల్వల గ్రామ శివారు గాంధీ నగర్ లో విషాదం. బావిలో పడి మహిళా అనుమానాస్పద మృతి మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం కల్వల గ్రామ శివారు గాంధీనగర్ లో విషాదం . ఉదయాన్నే పత్తిచేను కలుపు తీసిన మహిళ బానోత్ వెన్నెల (22)బావిలో పడి అనుమానస్పద మృతి . కాలుజారి బావిలో పడింద లేదా ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలిసులు ..... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....3