logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రోడ్లపై పశువులు వాహనదారులకు ఇక్కట్లు - పట్టించుకొని మున్సిపల్ సిబ్బంది నిర్మల్: పట్టణ కేంద్రం లో రోడ్లపై పశువులు తిరగడం వల్ల వాహనదారులకు ఇబ్బంది గా మారడం తో పాటు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అని వాహనదారులు అంటున్నారు.ఇప్పటికైన మున్సిపల్ అధికారులు పశువుల యజమానులపై చర్యలు తీసుకొని పశువులను గోశాలకు తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు

3 hrs ago
user_శంకర్
శంకర్
జర్నలిస్ట్ మామడ, నిర్మల్, తెలంగాణ•
3 hrs ago
0fdf3a63-d6af-4ab2-9516-89b0eb4d589a

రోడ్లపై పశువులు వాహనదారులకు ఇక్కట్లు - పట్టించుకొని మున్సిపల్ సిబ్బంది నిర్మల్: పట్టణ కేంద్రం లో రోడ్లపై పశువులు తిరగడం వల్ల వాహనదారులకు ఇబ్బంది గా మారడం తో పాటు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అని వాహనదారులు అంటున్నారు.ఇప్పటికైన మున్సిపల్ అధికారులు పశువుల యజమానులపై చర్యలు తీసుకొని పశువులను గోశాలకు తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు. * ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ. మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు.
* ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ.
మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    18 hrs ago
  • ఆర్మూర్‌లో SIR అవగాహనా సదస్సు - 100% ఓటర్ల ఎన్రోల్‌మెంట్ పూర్తి ఆర్మూర్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహనా సదస్సు నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, తెలంగాణ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఓటర్ల ఎన్రోల్‌మెంట్ 100% పూర్తి చేశామని, 25,800 డబుల్ ఓట్లను తొలగించామని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఎల్ఏలు, సూపర్‌వైజర్లకు ధన్యవాదాలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుక కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశ వేణు, మండల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆర్మూర్‌లో SIR అవగాహనా సదస్సు - 100% ఓటర్ల ఎన్రోల్‌మెంట్ పూర్తి
ఆర్మూర్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహనా సదస్సు నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, తెలంగాణ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఓటర్ల ఎన్రోల్‌మెంట్ 100% పూర్తి చేశామని, 25,800 డబుల్ ఓట్లను తొలగించామని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఎల్ఏలు, సూపర్‌వైజర్లకు ధన్యవాదాలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుక కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశ వేణు, మండల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా గోరింటాకు సంబరాలు నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆషాడమాసం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోరింటాకు విశిష్టత,ఆరోగ్యం, సంస్కృతి సంప్రదాయం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు,అధ్యాపకులు సంప్రదాయబద్ధంగా గోరింటాకును తయారు చేసుకుని ఒకరికొకరు పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు.గోరింటాకు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు.
    1
    గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా గోరింటాకు సంబరాలు 
నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆషాడమాసం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోరింటాకు విశిష్టత,ఆరోగ్యం, సంస్కృతి సంప్రదాయం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు,అధ్యాపకులు సంప్రదాయబద్ధంగా గోరింటాకును తయారు చేసుకుని ఒకరికొకరు  పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు.గోరింటాకు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    22 hrs ago
  • సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    1
    సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం."
"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... 
సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది."
**"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు
    1
    నిజామాబాదు జిల్లా 

శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం 

ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది 

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు

ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు
    user_Boss
    Boss
    Photographer భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • korutla pattanam lo thrishakthimatha devalayam lo varahi navarathrulu varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam
    4
    korutla pattanam lo thrishakthimatha  devalayam lo varahi navarathrulu
varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam
    user_Pallikondashivakumar
    Pallikondashivakumar
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    22 hrs ago
  • బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం.......... ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.
    1
    బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంటల సర్పంచ్ బంగారం..........
ADB: నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు శనివారం తిరిగి MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంటాల గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే MLA అనిల్ జాదవ్ తోనే కొనసాగుతామని గ్రామ పెద్దలతో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సర్పంచ్ గంగారాం పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    18 min ago
  • నందిపేట్ : డెంగ్యూ, మలేరియా నివారణపై అవగాహన-ఉచిత వైద్య శిభిరం డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా నందిపేట్ రాజానగర్ దుర్గాదేవీ ఆలయం వద్ద మండల వైద్యాధికారి డా. స్వాతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. BP, షుగర్, మలేరియా, డెంగ్యూ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందించారు. వర్షాకాల వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎర్రం లింగం, కార్యదర్శి మహేంద్రతో కలిసి మురికి కాల్వలు పరిశీలించి, టెమోఫోస్ స్ప్రే, ఫాగింగ్, క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. HEO భాస్కర్, PHN పద్మావతి, ANMలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    నందిపేట్ : డెంగ్యూ, మలేరియా నివారణపై అవగాహన-ఉచిత వైద్య శిభిరం 
డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా నందిపేట్ రాజానగర్ దుర్గాదేవీ ఆలయం వద్ద మండల వైద్యాధికారి డా. స్వాతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. BP, షుగర్, మలేరియా, డెంగ్యూ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందించారు. వర్షాకాల వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎర్రం లింగం, కార్యదర్శి మహేంద్రతో కలిసి మురికి కాల్వలు పరిశీలించి, టెమోఫోస్ స్ప్రే, ఫాగింగ్, క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. HEO భాస్కర్, PHN పద్మావతి, ANMలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.