*మంత్రాలయం రోడ్డు ప్రమాదం హృదయ విదారకం… 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం… ఆసుపత్రికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పిన టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి* మంత్రాలయం మండలం చిలకలదోణ గ్రామ శివారులో అశోక్ లేలాండ్ వాహనం ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయి, 14 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ విషాద ఘటనపై స్పందించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.అనంతరం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఇన్చార్జి క్షతగాత్రులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెబుతూ, ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ, వారి బాధను పంచుకున్నారు. ఈ దుర్ఘటనలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ప్రభుత్వం మరియు పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు.అలాగే మృతి చెందిన వారి భౌతిక కాయాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు మా ప్రభుత్వం తరుపున అంబులెన్స్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, మంత్రాలయం టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ వరదరాజులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామంలో విషాదం1
- Hi1
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- Post by Mohammed javeed1
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది1