*యావత్ మహిళా లోకం గర్వించే రోజు ఇది* *పార్లమెంట్ లో మహిళా బిల్లుపై ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం* *తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పెమ్మసాని, రామ్మోహన్ నాయుడుతో భేటీ* *పలువురు ఎంపీల ఇళ్లలో ఆత్మీయ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత* పార్లమెంట్ లో మహిళా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెట్టడం.. దేశంలో యావత్ మహిళా లోకం గర్వించే రోజుగా నిలిచిపోతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అభివర్ణించారు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఆమె సహచర మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఇందులో భాగంగానే ఉదయం ఢిల్లీలోని ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంలో అల్పాహారం విందుకు హాజరయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు. మంత్రి సీతారామన్ అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా ఎమ్మెల్యే పరిటాల సునీత సహచర ప్రజాప్రతినిధులతో కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సునీతను ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం మంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా బిల్లు ప్రవేశపెట్టడం తమ కళ్లారా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చారిత్రక ఘట్టానికి మేము కూడా సాక్షులు అవుతుండడం గర్వంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని.. అయితే రాజకీయాల్లో ఇంకా వారికి సముచితమైన స్థానం దక్కడం లేదు. జనాభా ప్రకారం మహిళలకు కూడా చట్టసభల్లో ప్రాధాన్యం ఉండాలన్నారు. ఏపీలో మహిళలను ప్రోత్సహించే విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో కూడా మిగిలిన పార్టీల కంటే ఎక్కువ స్థానాలు ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయిస్తున్నారన్నారు. ఇప్పుడు 33శాతం అన్నది చట్టంగా మారితే.. మహిళా లోకం సంతోషిస్తుందన్నారు. రాజకీయంగా వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చినట్టు అవుతుందన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ కావాలని ఆమె ఆకాంక్షించారు. మిగిలిన పార్టీలు దీనిని రాజకీయంగా చూడకుండా మద్దతివ్వాలని ఎమ్మెల్యే సునీత విజ్ఞప్తి చేశారు.
*యావత్ మహిళా లోకం గర్వించే రోజు ఇది* *పార్లమెంట్ లో మహిళా బిల్లుపై ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం* *తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పెమ్మసాని, రామ్మోహన్ నాయుడుతో భేటీ* *పలువురు ఎంపీల ఇళ్లలో ఆత్మీయ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత* పార్లమెంట్ లో మహిళా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెట్టడం.. దేశంలో యావత్ మహిళా లోకం గర్వించే రోజుగా నిలిచిపోతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అభివర్ణించారు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఆమె సహచర మహిళా
ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఇందులో భాగంగానే ఉదయం ఢిల్లీలోని ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంలో అల్పాహారం విందుకు హాజరయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు. మంత్రి సీతారామన్ అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా ఎమ్మెల్యే పరిటాల సునీత సహచర ప్రజాప్రతినిధులతో కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సునీతను ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ యోగక్షేమాలు
తెలుసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం మంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా బిల్లు ప్రవేశపెట్టడం తమ కళ్లారా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చారిత్రక ఘట్టానికి మేము కూడా సాక్షులు అవుతుండడం గర్వంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని.. అయితే రాజకీయాల్లో
ఇంకా వారికి సముచితమైన స్థానం దక్కడం లేదు. జనాభా ప్రకారం మహిళలకు కూడా చట్టసభల్లో ప్రాధాన్యం ఉండాలన్నారు. ఏపీలో మహిళలను ప్రోత్సహించే విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో కూడా మిగిలిన పార్టీల కంటే ఎక్కువ స్థానాలు ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయిస్తున్నారన్నారు. ఇప్పుడు 33శాతం అన్నది చట్టంగా మారితే.. మహిళా లోకం సంతోషిస్తుందన్నారు. రాజకీయంగా వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చినట్టు అవుతుందన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ కావాలని ఆమె ఆకాంక్షించారు. మిగిలిన పార్టీలు దీనిని రాజకీయంగా చూడకుండా మద్దతివ్వాలని ఎమ్మెల్యే సునీత విజ్ఞప్తి చేశారు.
- వైయస్‌ఆర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లిలోని బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం, కలుషిత తాగునీరు పాఠశాలలో సుమారు 560 మంది విద్యార్థులు ఉన్నా.. కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు విద్యా శాఖను భ్రష్టు పట్టించేసి.. క్రికెట్ మ్యాచ్‌లు చూసుకుంటున్నావా Nara Lokesh ? #LooterLokesh #SadistChandraBabu1
- అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..* *ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..* 👉అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!!తెలుసుకొండి.. 👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..? 👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..? 👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను భంగం కలిగించడమే అవుతుంది. 👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..? 👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…? 👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..? 👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? 👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు. 👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే.. 👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…? 👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. 🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. 👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి. 👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…? 👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి. 👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు. మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.. అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.. *జై జర్నలిజం.. జై జై జర్నలిజం..* 🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా *🇮🇳జర్నలిస్టు🇮🇳* *🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*1
- ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా – గ్రామస్తుల ఆనందం1
- SK టీవీ న్యూస్ ఏపీ వార్తలు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీగా గాలివాన బీభత్సం సృష్టించింది భారీ వృక్షాలు నేల కొరకడం జరిగింది రైతులకు ఈ వాన వలన భారీ నష్టం జరిగి ందని చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడం చాలా బాధాకరం ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని రైతులు కోరారు1
- ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అక్రమ కేసులో పూడి శ్రీహరి గారికి బెయిల్ మంజూరు 25000 సెల్ఫ్ బాండ్లతో శ్రీహరి గారికి బెయిల్ మంజూరు చేసిన కుప్పం కోర్టు. #SatyamevaJayathe #YSRCP #CBNJungleRaj #JaganannaConnects1