*ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*
- సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న శివాన్ ఎర్రంనాయుడు
- వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు.
డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు.
అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
