రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భూ రీ-సర్వేను మార్చి-2027 నాటికి మూడు విడతల్లో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తెచ్చామని, దీని ద్వారా రైతులకు పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి తెలిపారు. భూ రీ-సర్వే కోసం శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను రెగ్యులర్ సర్వేయర్లతో సమన్వయం చేసుకుంటూ వినియోగించుకోవాలని సూచించారు. వారికి తగిన పేమెంట్, బీమా, సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గతంలో తిరస్కరణకు గురైన సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రీ-సర్వే కోసం అవసరమైన నాణ్యమైన పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షిస్తూ, మొదటి విడత ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని, రెండో విడతలో గుడిసెల్లో నివసించే అర్హులైన కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇసుక, కంకర సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యార్థుల యూనిఫాంలను స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారా కుట్టిస్తున్నామని తెలిపారు. జూలై 15 లోపు బాలికలకు, జూలై 30 లోపు బాలురకు యూనిఫాంలు అందించి, ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సర్వే ఏడీని ఆదేశించారు. లైసెన్స్ సర్వేయర్ల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, సర్వే ఏడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

- నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి పరిధిలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాజీ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వారం వారం భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగనూలు గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు భజనలు నిర్వహించారు. వీరికి నిబంధనల ప్రకారం అల్పాహారంతో పాటు ₹2,000 పారితోషికంగా అందజేశారు. ఈ వారం కార్యక్రమానికి స్థానిక శివాలయం పూజారి శ్రీ కె.వి చక్రపాణి దాతగా వ్యవహరించారు. తన తండ్రి కీర్తిశేషులు కె.వి నరసింహారావు స్మారకార్థం ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. భజన కార్యక్రమం నిర్వహించిన నాగనూలు భజన మండలి సభ్యులకు, దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.1
- జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఆసుపత్రిలోని 'రేడియాలజీ హబ్'లో ఉదయం నుండి కరెంట్ లేకపోవడంతో ఎక్స్-రే, స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పరీక్షల కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రిలో జనరేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, అధికారులు మరియు సిబ్బంది దానిని ఆన్ చేసి స్కానింగ్ ప్రక్రియను కొనసాగించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి విద్యుత్ లేదనే నెపంతో టెక్నిషియన్లు కూడా స్కానింగ్ చేయడానికి నిరాకరిస్తున్నారని, దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చిన పేద రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రేడియాలజీ సేవలను పునరుద్ధరించాలని, పేద రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు స్థానిక కమిషనర్ రాజేష్ ఆదేశానుసారం సీనియర్ అసిస్టెంట్లు సుప్రియ, ప్రియాంక ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం వలన భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.1
- తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితిలో నాయక్ పోడ్ జాతి ఉందని, వారిపై సమాజం చూపిస్తున్న చిన్నచూపును ఇది స్పష్టం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో కూడా తమ కులాన్ని చేర్చడం లేదని నాయక్ పోడ్ వర్గీయులు వాపోతున్నారని ఆమె పేర్కొన్నారు. నాయక్ పోడ్ వర్గీయులను కొందరు గొండు అని, మరికొందరు కోయ నాయక్ పోడ్ అని తప్పుగా నమోదు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఏ జాతి వారికైనా తమ అస్తిత్వం, గౌరవం ఉంటాయని, ఈ విషయంలో వారిని మనుషులుగా గుర్తించరా? అంటూ ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.1
- నంద్యాల కోర్టులో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. గౌరవ నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదులు కక్షిదారులను సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ అదాలత్‌లో దాదాపు 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారమయ్యాయని, అత్యధికంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల మేర సెటిల్‌మెంట్ జరిగిందని వివరించారు. కోర్టు స్థాయిలో మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులతో పాటు సివిల్ కేసులు, బ్యాంకు మేటర్స్, ఇతర లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవహారాలపై న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహకారంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేసినట్లు స్పష్టం చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చేకూరిన ఆర్థిక సహాయం ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.2
- రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ఏఆర్‌కే బంకెట్ సమీపంలో పూర్తిగా ఎండిపోయిన ఒక చెట్టు అత్యంత ప్రమాదకరంగా నిలిచింది. ఈ రహదారి గుండా నిత్యం భారీగా రాకపోకలు సాగుతుండటంతో, బలమైన గాలులు వీచే సమయంలో ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా ఆ ఎండిన చెట్టును తొలగించాలని స్థానికులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.1
- కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఏబీఎన్ రిపోర్టర్‌కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల ఘటనపై ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ప్రతినిధులు పెద్దకడబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇతర ప్రతినిధులతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం మానిక్‌గూడ, వాంకిడి మండలం కోమటిగూడ గ్రామాల్లో రూ. 20 లక్షల చొప్పున నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ భవనాలు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తాయని, పంచాయతీలు పారదర్శక సేవలకు కేంద్రాలుగా మారాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఇదే సమయంలో కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు తమ భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సాగులోకి వెళ్లకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, 2005 సంవత్సరానికి ముందు నుంచి సాగు చేస్తున్న పాత పోడు భూముల విషయంలో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశించారు. అయితే కొత్తగా అటవీ భూములను ఆక్రమించవద్దని స్పష్టం చేస్తూ, ఈ భూ సమస్యపై జిల్లా, అటవీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి చట్టపరమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. భూములు, ఆస్తుల కంటే పిల్లల చదువే నిజమైన ఆస్తి అని, వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం తల్లిదండ్రుల బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.1