మృతుని కుటుంబానికి మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ ఆర్ధిక చేయూత మోత్కూర్ మున్సిపల్ కేంద్రం అంగడి బజార్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన ఆరే జహంగీర్ బ్రెయిన్ డెడ్ తో గత జులై నెలలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.ఆ కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో, ఆర్ధిక ఇబ్బందులు పడుతుండగా మన మోత్కూర్ స్వచ్ఛంద సేవా సంస్థ వాట్సాప్ గ్రూప్ దాతల సహకారంతో రూ.24 వేల ఆర్ధిక సహాయాన్ని బుధవారం స్థానిక మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న ల చేతుల మీదుగా మృతుని భార్య గీతకు అందజేశారు. నిరుపేద కుటుంబాలకు మన మోత్కూర్ గ్రూప్ ఆర్ధిక చేయూత అందించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులు ధబ్బేటి సోంబాబు,మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ కోమటి మచ్చగిరి, కౌన్సిలర్ మెంట నగేష్, ప్రతినిధులు ఎం డి షాకీర్,మొరిగాల శ్రీను, కోమటి జనార్దన్,అవిశెట్టి కిరణ్, సుంకిశాల అనిల్,బోయిని యాకు , బుర్ర శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- హైదరాబాద్ లో గోల్డెన్ గణపతి..ఈ ఏడాది ఇక్కడే స్పెషల్ తరలి వస్తున్న భక్తులు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బేగం బజార్ లో ఏర్పాట్లు చేసిన బంగారు గణపతి నీ చూసేందుకు ఎగబడుతున్నారు.1
- "భూమి, భుక్తి ,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బావి తరాలకు అందించాలి: నల్లు సుధాకర్ రెడ్డి" *నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* భూమి,బుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల తిరుగుబాటే కమ్యూనిస్టులనాయకత్వం లో సాగిన సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా ; మరిపెడ మండల కేంద్రం గాంధీ సెంటర్ లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొరలు, భూస్వాములు, జాగిర్దారుల, రజాకార్ల దాస్టికాలకు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ముగ్దుo మొయినుద్దీన్ పిలుపుతో ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగి 10 లక్షల ఎకరాల భూమిని పంచి, మూడువేల గ్రామాలను విముక్తి చేసి,వేలాది కామ్రేడ్స్ త్యాగాల ఫలితంగా నాటి నిజాం తోక ముడిచే సందర్భంలో, సైన్యాలు రావడంతో హైదరాబాదు రాష్ట్రం భారత్ లో విలీనమైందనేది చారిత్రాత్మక సత్యమని,దీనిని మసిపూసి మారేడు కాయలు చేసే విధంగా, సాయుధ పోరాటంతో సంబంధంలేని బిజెపి లాంటి కుహన శక్తులు ముస్లిం రాజు పై హిందువుల పోరాటంగా చిత్రికరించే ప్రయత్నాలు చేయడాన్ని ప్రగతిశీల శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు .. *నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి, సాయుధ పోరాట స్మారక చిహ్నాన్ని ట్యాంకు బండపై ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 17 విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు* ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్తు సభ్యులు అబ్దుల్ రషీద్,తురక రమేష్,అంజి, వీరేందేర్, వెంకన్న, నర్సయ్య,కన్నె వెంకన్న, కలగుర నాగరాజు, యుగేందర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు...1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1