గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బొమ్మెర్ల వర ప్రసాద్ గౌడ్ టేకులపల్లి, ఆగస్టు 26: గౌడ జన హక్కుల పోరాట సమితి మొకుదెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్‌ను నియమించినట్లు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరనేని నర్స గౌడ్ ప్రకటించారు. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ సేవలను మరింత విస్తరించేందుకు ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. గౌడ కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయనకు సూచించారు . గౌడ గీత కార్మికుల సంక్షేమం, రాష్ట్రంలోని గౌడ కులస్తులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించేందుకు నిరంతరం పోరాటం చేస్తామని సమితి ప్రతినిధులు తెలిపారు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, హక్కుల సాధన కోసం కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఈ నియామక పత్రాన్ని జిల్లా బాధ్యులు బొమ్మెర్ల వర ప్రసాద్ గౌడ్‌కు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మెర వరప్రసాద్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా నియమించిన జాతీయ రాష్ట్ర నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, గౌడ సోదరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు .
గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బొమ్మెర్ల వర ప్రసాద్ గౌడ్ టేకులపల్లి, ఆగస్టు 26: గౌడ జన హక్కుల పోరాట సమితి మొకుదెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్‌ను నియమించినట్లు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరనేని నర్స గౌడ్ ప్రకటించారు. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ సేవలను మరింత విస్తరించేందుకు ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. గౌడ కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయనకు సూచించారు . గౌడ గీత కార్మికుల సంక్షేమం, రాష్ట్రంలోని గౌడ కులస్తులకు ఆర్థిక,
రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించేందుకు నిరంతరం పోరాటం చేస్తామని సమితి ప్రతినిధులు తెలిపారు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, హక్కుల సాధన కోసం కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఈ నియామక పత్రాన్ని జిల్లా బాధ్యులు బొమ్మెర్ల వర ప్రసాద్ గౌడ్‌కు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మెర వరప్రసాద్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా నియమించిన జాతీయ రాష్ట్ర నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, గౌడ సోదరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు .
- మా కూతురు మాటలతో మాకు సంబంధం లేదు..భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏం మాట్లాడను – భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ1
- రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి? మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్ ఖమ్మం: రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి..................... భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 20.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 23 అడుగులకు చేరింది. ప్రస్తుతం 2,45,344 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. వర్షాలు, ఎగువ ప్రవాహాలు కొనసాగితే సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.1
- గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.4
- సారు.. పింఛను ఇప్పించండి..?* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* *సెంటర్:- అశ్వారావుపేట* *స్లగ్: సారు.. పింఛను ఇప్పించండి..?* *యాంకర్ వాయిస్:* పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల చిన్నారి.. కూలి పనులు చేసుకుంటూ ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి.. తండ్రి చిన్నతనంలోనే మృతి.. సదరం సర్టిఫికెట్ లేక పదేళ్లుగా పింఛన్‌కు దూరం.. కనీసం ఉండేందుకు సురక్షితమైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ నిరుపేద గిరిజన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. *వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారిగూడెం గ్రామానికి చెందిన ఊకె నందిని.. వయసు 14 ఏళ్లు. పుట్టుకతోనే మూగ, అంగవైకల్యంతో జన్మించింది. నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై.. నిత్యం ఇతరులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తోంది. నందిని తండ్రి ఊకె బాలరాజు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి ఊకె లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా.. అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన కుమార్తెకు సపర్యలు చేస్తోంది. *వాయిస్* నందినికి సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో ఇప్పటివరకు వికలాంగ పింఛన్ అందడం లేదు. నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా సదరం కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో దాదాపు పదేళ్లుగా ప్రభుత్వ పింఛన్‌కు ఈ కుటుంబం దూరమైంది.. కుమార్తె తోపాటు తల్లి లక్ష్మీ కూడా 10ఏళ్లుగా భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వం నుండి అందుకోవాల్సిన వితంతు పింఛను పొందటం లేదంటే వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందే ఇట్టే తెలిసిపోతుంది..ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులంతా పింఛను ఇప్పిస్తాం అని చెప్పే మాటలు గుడ్డిగా నమ్మటమే తప్ప గొంతెత్తి నాకు పింఛను ఇప్పించని అడగలేని పేదరికం ఆమెది. ఇటీవల సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు నందినికి ప్రతినెలా అవసరమయ్యే మందుల ఖర్చు కూడా తల్లికి అదనపు భారంగా మారింది. *వాయిస్* కుటుంబం ఉంటున్న ఇల్లు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటి స్లాబ్ నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నా.. ఇప్పటివరకు ఆ కుటుంబానికి సొంతంగా సురక్షితమైన ఇల్లు దక్కలేదు. *వాయిస్* నందిని పరిస్థితి కారణంగా ఆమెను 24 గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సిందే. దీంతో నాయనమ్మ లక్ష్మి కూడా చిన్నారికి తోడుగా నిరంతరం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు కూలి పనులు.. మరోవైపు చిన్నారి సంరక్షణ.. మందుల ఖర్చులు.. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇల్లు.. ఇలా అన్ని విధాలుగా ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోంది. *వాయిస్ ఓవర్* నందిని పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే సదరం సర్టిఫికెట్, వికలాంగ పింఛన్ అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే సురక్షితమైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి.. వైద్యం, మందుల విషయంలోనూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ 14 ఏళ్ల చిన్నారి దీనస్థితిపై ప్రభుత్వ అధికారులు, ఐటీడీఏ పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పందించి.. నందినికి అండగా నిలుస్తారా? పింఛన్, ఇల్లు, వైద్య సహాయం అందించి ఆ కుటుంబంలో వెలుగులు నింపుతారా? అనేది వేచి చూడాలి..1
- మధ్యప్రదేశ్ లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన 4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన మగ శిశువు . *మధ్యప్రదేశ్:* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.1
- మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2