Shuru
Apke Nagar Ki App…
*విశాఖ బి స్క్వేర్ హోటల్‌లో యువతి దారుణ హత్య.* పార్టీ అని పిలిచి స్నేహితురాలి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్..! రాత్రి తొమ్మిది గంటలకు పార్టీకి వెళ్లిన శాంతి కుమారి అనే యువతి ఉదయానికే శవమై కనిపించింది..! హోటల్ గదిలో జరిగిన ఘర్షణలో యువతిని స్నేహితులు కొట్టి చంపారని పోలీసుల వెల్లడి..! ఫిట్స్ వచ్చాయని పోలీసులను నమ్మించే ప్రయత్నం..! స్నేహితుల డ్రామాను ఛేదించి, హత్యగా నిర్ధారించిన పోలీసులు నిందితుల్లో నలుగురు యువకులు, ఒక యువతి..!
Tagore
*విశాఖ బి స్క్వేర్ హోటల్‌లో యువతి దారుణ హత్య.* పార్టీ అని పిలిచి స్నేహితురాలి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్..! రాత్రి తొమ్మిది గంటలకు పార్టీకి వెళ్లిన శాంతి కుమారి అనే యువతి ఉదయానికే శవమై కనిపించింది..! హోటల్ గదిలో జరిగిన ఘర్షణలో యువతిని స్నేహితులు కొట్టి చంపారని పోలీసుల వెల్లడి..! ఫిట్స్ వచ్చాయని పోలీసులను నమ్మించే ప్రయత్నం..! స్నేహితుల డ్రామాను ఛేదించి, హత్యగా నిర్ధారించిన పోలీసులు నిందితుల్లో నలుగురు యువకులు, ఒక యువతి..!
More news from తెలంగాణ and nearby areas
- Post by నీరటి మహేందర్1
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- నాచారం కు చెందిన చెల్లా లక్ష్మీనారాయణ(72) రిటైర్డ్ ఉద్యోగి ఈరోజు ఉదయం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వచ్చి డిపాజిట్ స్లిప్ నింపుతుండగా స్ట్రోక్ రావడంతో కిందపపడిపోయిన లక్ష్మీనారాయణ. వెంటనే బ్యాంక్ సిబ్బంది 108 కు సమాచారం ఇవ్వడంతో..108 సిబ్బంది వచ్చి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఓయూ పోలీసులు.1
- మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో మక్కల రాక భారీగా పెరగడంతో యార్డ్ పూర్తిగా నిండిపోయింది. కల్లెడ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కాంటాలు నెమ్మదిగా జరగడం, లారీల రాక ఆలస్యం కావడం వల్ల కొత్తగా వచ్చే ధాన్యానికి స్థలం లేకపోయింది. దీంతో వారం రోజుల పాటు రైతులు మొక్కజొన్నలను తీసుకురాకూడదని అధికారులు సూచించారు.1
- దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు మోదీ అపురూప కానుక అందించి మోదీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తుందని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. ఏప్రిల్ 16 న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుండి నగరంలోని పలు ప్రాంతాల మీదుగా మార్క్ ఫెడ్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల నెరవేరే సమయం వచ్చిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం , అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, 33 శాతం రిజర్వేషన్లు అందించే చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చారిత్రాక నారి శక్తి వందన్ అధినియం బిల్లుతో మహిళలకు దేశ ప్రధాని పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కోలగని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత , ప్రభావతి, గాజిరమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, సరస్వతి, సుమ రమణారెడ్డి,సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.4
- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1