జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 23 ఫిర్యాదులను అదనపు ఎస్పీ చంద్రయ్య స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. దీనివల్ల ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతాయని పేర్కొన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ, ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తామని అదనపు ఎస్పీ వివరించారు. ఈ గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 23 ఫిర్యాదులను అదనపు ఎస్పీ చంద్రయ్య స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. దీనివల్ల ఫిర్యాదుదారునికి
పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతాయని పేర్కొన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ, ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తామని అదనపు ఎస్పీ వివరించారు. ఈ గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.4
- జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.3
- కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.1
- కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుడు గజ్జల శ్రీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫాంలు అందించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఒక శాఖా మంత్రిని కూడా నియమించాలని కోరారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ పాఠశాలల్లో సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం, సమస్యలను గాలికొదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. లేకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని గజ్జల శ్రీకాంత్ స్పష్టం చేశారు.2
- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1