కేతపల్లిలో ‘రేషన్’ మాఫియా పంజా: పేదవాడి బుక్కెడు బువ్వ.. దళారుల పాలు! నల్లగొండ: జిల్లాలోని కేతపల్లి మండలం అక్రమ బియ్యం దందాకు అడ్డాగా మారుతోంది. నిరుపేదల ఆకలి తీర్చాల్సిన రూపాయి కిలో బియ్యం, నల్లబజారులో కాసులు కురిపిస్తోంది. నిత్యం టన్నుల కొద్దీ రేషన్ బియ్యం భారీ ఎత్తున DCMలు, టాటా ఏసీ (Tata Ace) వాహనాల్లో సరిహద్దులు దాటుతున్నా.. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అర్ధరాత్రి వేళ.. అక్రమ రవాణా జోరు కేతపల్లి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని పేదల నుంచి వివిధ రకాల ఆశలు చూపి తక్కువ ధరకే బియ్యం సేకరించే దళారులు, ముఖ్యంగా కేతేపల్లి మండల కేంద్రంలో ఉన్న ఒక డీలర్ వాటిని ఒక రహస్య ప్రాంతంలో నిల్వ చేస్తున్నారు.రవాణా అక్కడి నుంచి అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున భారీ వాహనాల్లో (DCMs) పక్క రాష్ట్రాలకు లేదా రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేసి మళ్లీ పాత సంచుల్లో నింపి, బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా నూకలుగా మార్చి కోళ్ల ఫామ్ లకి దానాగా అమ్ముతున్నారు.రెవెన్యూ, పోలీస్ పాత్రపై అనుమానాలు?సాధారణంగా ఒక చిన్న వాహనం అనుమానాస్పదంగా వెళ్లినా తనిఖీలు చేసే పోలీసు యంత్రాంగం, మండలంలో నిత్యం టన్నుల కొద్దీ బియ్యం రాత్రి సమయంలో లోడింగ్ చేసి తరలుతున్నా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ‘మతలబు’ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తు దళారులు ఇచ్చే నెలవారీ ‘కమిషన్ల’ వల్లే రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు మౌనం వహిస్తున్నాయనేది బహిరంగ రహస్యం.ముందస్తు సమాచారం తనిఖీలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా దళారులకు ముందే సమాచారం అందుతుండటంతో వారు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. పర్యవేక్షణ లోపం సివిల్ సప్లై అధికారులు, స్థానిక పోలీసులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించాల్సిన చోట, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. "ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టడం బాధాకరం. కేతపల్లి మీదుగా ప్రతిరోజూ వాహనాలు వెళ్తున్నా చెక్ పోస్టుల వద్ద నిఘా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం." - స్థానిక పౌరుల ఆవేదన.చర్యలు ఎప్పుడు?రేషన్ బియ్యం దందా కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు, పేద ప్రజల హక్కును కాలరాయడమే. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి, కేతపల్లి మండలంలో సాగుతున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించాల్సిన అవసరం ఉంది. అక్రమ రవాణాకు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఈ మాఫియాకు అడ్డుకట్ట పడుతుంది.

- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం ఘనంగా మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆశయాలు, సమానత్వ భావనలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన అలుపెరుగని కృషిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ రూపకర్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శకమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ మహా అన్నదానం ద్వారా అంబేద్కర్ చూపిన సామాజిక సమానత్వ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందని వారు తెలిపారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు ప్రసంగించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.3
- ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ శివారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న చేనుకు నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించి పక్కనే లాటుగా వేసి ఉంచిన సుమారు 58 మిర్చి బస్తాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.1