Shuru
Apke Nagar Ki App…
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. మండలంలో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెడతామని, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సహకారాన్ని కోరారు.
MALLIKARJUN T
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. మండలంలో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెడతామని, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సహకారాన్ని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- నాగర్ కర్నూల్ లో ముంచెత్తిన వాన.. ముద్దయిన మొక్కజొన్న నెలికొండ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాయంత్రం వేళ అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురవడంతో యార్డులో ఆరబోసిన పంట నీటిపాలైంది. ధాన్యం కొట్టుకుపోకుండా రైతులు ప్లాస్టిక్ కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని రైతాంగం కోరుతోంది1
- ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం అప్రమత్తమైనా చుట్టుపక్కల ప్రజలు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం స్టేజి సమీపంలో ఉన్న వెంచర్ లో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం..1
- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.1
- నామీద వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి:బీజేపీ ఎంపీ బండి సంజయ్ నా మీద వస్తున్న తప్పుడు ప్రచారాలను బిజెపి కార్యకర్తలు ప్రజలు నమ్మవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సామాన్యంగా కార్యకర్తగా కాషాయం జెండాను భుజంపై ఎత్తుకొని కేంద్రమంత్రి అయ్యానని కాలర్ ఎగర వేసుకొని నేను బిజెపి కార్యకర్తలు అని చెప్పుకుంటానని తెలిపారు. తండ్రుల పేర్లు చెప్పి నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు.1
- పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.1
- సిద్దిపేట జిల్లా దాతర్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్‌తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.4
- నల్గొండ: కనిపించని స్పీడ్ బ్రేకర్లు.. వాహనదారుల ప్రాణాలకే ముప్పు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా ఏమి రెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఇవి అసలు కనిపించక వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే రహదారి భద్రత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- కార్మిక కోడ్లను రద్దు చేయాలి.. కార్మిక హక్కులను కాపాడాలి సీఐటీయూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ అర్బన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులు కొత్త కార్మిక కోడ్లతో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.1