పాలిటెక్నిక్ కళాశాలలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం. పలమనేరు డిసెంబర్ 20( ప్రజా ప్రతిభ) పలమనేర్ పట్టణ సమీపంలో గల ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల నందు ఐసిడియస్ ఆధ్వర్యంలో సిడిపిఓ ఉమారాణి అధ్యక్షతన పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ సహకారంతో బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఐ సి డి ఎస్ సూపర్వైజర్ నజ్మా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పలమనేర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు బాల్యవివాహాలు నివారణ కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని గుర్తు చేశారు. బాల్య వివాహాలు చేయడం వలన ఆడపిల్లలకు వచ్చే ప్రమాదాలు గురించి క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు. అదేవిధంగా అనేక చోట్ల బాలికల అదృశ్యం కావడం, అక్రమ రవాణా ఆ సందర్భంలో ఎలా ఎదుర్కోవాలో హాజరైన బాలికలకు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు. బాలికలకు ఎవరైనా మాయ మాటలు చెప్పాలని ప్రయత్నించిన, తినుబండారాలు ఎర చూపి కోసం చేయాలని అనుకున్న వాటిని ఎలా ధైర్యముగా ఎదుర్కొనే మనో ధైర్యాన్ని బాలికలకు కలిగించారన్నారు. ఇటువంటి దుశ్చర్యలను పోలీస్ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున తీసుకొని బాలికలకు ధైర్యాన్ని నింపుతున్నారని అనేకమైన కేసులు నమోదు చేసి శిక్ష పడే విధంగా చేశారని కొనియాడారు. ముఖ్యంగా బాలికలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించారు. అనంతరం బాలికల చేత బాల్య వివాహాల రహిత భారత్ గా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తాము అనే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ చిలకమ్మా, మహేశ్వరి, శాంతి, రాధా పాల్గొన్నారు.

- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్‌లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్‌లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- Post by Nirmal KR NEWS 3691
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3