logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిరుద్యోగుల ఆగ్రహం: కోదండరాంను నిలదీసిన వైనం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అడ్డుకున్నారు. మీ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇప్పుడు మా సమస్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 30 ఏళ్లకు ఉద్యోగాలకు పనికిరామా అంటూ నిలదీయడంతో, ఆయన సమాధానం చెప్పలేక వెనుదిరిగారు.

6 hrs ago
user_GB MAHENDAR
GB MAHENDAR
Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
6 hrs ago

నిరుద్యోగుల ఆగ్రహం: కోదండరాంను నిలదీసిన వైనం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అడ్డుకున్నారు. మీ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇప్పుడు మా సమస్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 30 ఏళ్లకు ఉద్యోగాలకు పనికిరామా అంటూ నిలదీయడంతో, ఆయన సమాధానం చెప్పలేక వెనుదిరిగారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్‌ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
    1
    కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా?
పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్‌ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి
అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    3 hrs ago
  • ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు 2000 రూపాయలు జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందినిఎస్పి అభినందించారు. భార్యతో చనువుగా ఉండడం చూసి సహచర కూలీని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కేసు వివరాల ప్రకారం.. బిట్టు కుమార్ (22) తన భార్య పూజా కుమారి, పిల్లలతో కలిసి కళకల్ గ్రామంలో శ్రీరామ్ పండరి నిర్మిస్తున్న ఇంటి వద్ద కూలీ పనులు చేస్తూ అదే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అదే ఇంటిలో వీరికంటే ముందుగా మేస్త్రీ పనులు చేస్తూ ప్రమోద్ పాశ్వాన్ (43) నివాసం ఉంటున్నాడు.ప్రమోద్ పాశ్వాన్ తన భార్యతో చనువుగా ఉండటాన్ని గమనించి న బిట్టు కుమార్, అతడిని రెండు మూడు సార్లు హెచ్చరించాడు. మరోసారి ఈ విధంగా ప్రవర్తిస్తే చంపాలని నిర్ణహించుకున్నాడు. ఈ క్రమంలో 16.11.2024న సాయంత్రం బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్ సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లి రాత్రి సుమారు 9 గంటల సమయంలో నివాసం ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చారు. బిట్టు కుమార్ సరుకులను తన భార్యకు ఇచ్చి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రమోద్ పాశ్వాన్ తన భార్య నడుముపై చేయి వేసి ఉండటాన్ని చూశాడు.దీంతో ఆగ్రహించిన బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్‌ను ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నిస్తే, తన ఇష్టమని, తనను ఎందుకు అడుగుతున్నావంటూ ప్రమోద్ పాశ్వాన్ దురుసుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం బిట్టు కుమార్‌ను తోసివేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బిట్టు కుమార్ మంచంపై ఉన్న కర్రతో ప్రమోద్ పాశ్వాన్‌పై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి పటాన్‌చెరువుకు వెళ్లాడు.ఈ ఘటనపై మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి సీఐ రంగకృష్ణ పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నీలిమ, నిందితుడు బిట్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి సహకరించారు.నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పూర్తి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజనింగ్ అధికారులు, సాక్ష్యాధారాల సేకరణలో సహకరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అభినందించారు.
    1
    హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు 2000 రూపాయలు జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి 
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి 
శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందినిఎస్పి అభినందించారు.
భార్యతో చనువుగా ఉండడం చూసి సహచర కూలీని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
కేసు వివరాల ప్రకారం.. బిట్టు కుమార్ (22) తన భార్య పూజా కుమారి, పిల్లలతో కలిసి కళకల్ గ్రామంలో శ్రీరామ్ పండరి నిర్మిస్తున్న ఇంటి వద్ద కూలీ పనులు చేస్తూ అదే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అదే ఇంటిలో వీరికంటే ముందుగా మేస్త్రీ పనులు చేస్తూ ప్రమోద్ పాశ్వాన్ (43) నివాసం ఉంటున్నాడు.ప్రమోద్ పాశ్వాన్ తన భార్యతో చనువుగా ఉండటాన్ని గమనించి న బిట్టు కుమార్, అతడిని రెండు మూడు సార్లు హెచ్చరించాడు. మరోసారి ఈ విధంగా ప్రవర్తిస్తే చంపాలని నిర్ణహించుకున్నాడు.
ఈ క్రమంలో 16.11.2024న సాయంత్రం బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్ సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లి రాత్రి సుమారు 9 గంటల సమయంలో నివాసం ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చారు. బిట్టు కుమార్ సరుకులను తన భార్యకు ఇచ్చి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రమోద్ పాశ్వాన్ తన భార్య నడుముపై చేయి వేసి ఉండటాన్ని చూశాడు.దీంతో ఆగ్రహించిన బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్‌ను ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నిస్తే, తన ఇష్టమని, తనను ఎందుకు అడుగుతున్నావంటూ ప్రమోద్ పాశ్వాన్ దురుసుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం బిట్టు కుమార్‌ను తోసివేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బిట్టు కుమార్ మంచంపై ఉన్న కర్రతో ప్రమోద్ పాశ్వాన్‌పై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి పటాన్‌చెరువుకు వెళ్లాడు.ఈ ఘటనపై మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి సీఐ రంగకృష్ణ పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు.
పోలీసులు సమర్పించిన పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నీలిమ, నిందితుడు బిట్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి సహకరించారు.నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పూర్తి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజనింగ్ అధికారులు, సాక్ష్యాధారాల సేకరణలో సహకరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు,  అభినందించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
  • కల్తీ ఆహారానికి చెక్ పెట్టిన ఉప్పల్ SOT... పీర్జాధిగూడ గల్ఫ్ బేకరిపై దాడి విశ్వసనీయ సమాచారంతో SOT ఉప్పల్ జోన్ బృందం పీర్జాదిగూడలోని గల్ఫ్ బేకరీపై దాడి నిర్వహించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ముడి పదార్థాలు, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దాడిలో ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ఫ్లేవర్, జామ్, సాస్ మరియు కేకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తే కఠిన చర్యలు తప్పవు.
    2
    కల్తీ ఆహారానికి చెక్ పెట్టిన ఉప్పల్ SOT... పీర్జాధిగూడ గల్ఫ్ బేకరిపై దాడి
విశ్వసనీయ సమాచారంతో SOT ఉప్పల్ జోన్ బృందం పీర్జాదిగూడలోని గల్ఫ్ బేకరీపై దాడి నిర్వహించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ముడి పదార్థాలు, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
దాడిలో ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ఫ్లేవర్, జామ్, సాస్ మరియు కేకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తే కఠిన చర్యలు తప్పవు.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    3 hrs ago
  • స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని చాటేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని చాటేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్ మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఐదు రోజుల పాటు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలంతా కార్యక్రమంలో భాగస్వాములై భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటాలని కోరారు.
    1
    స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని చాటేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి 
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని చాటేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్ మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఐదు రోజుల పాటు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలంతా కార్యక్రమంలో భాగస్వాములై భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటాలని కోరారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.