The CLUE TODAY News// విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు, బీసీ బాలుర హాస్టల్ ను తనిఖీ చేసిన కలెక్టర్ బీసీ హాస్టల్లో పరిస్థితులపై కలెక్టర్ ఆరా, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , వెల్దండ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, టాయిలెట్స్, ఆఫీస్, స్టాఫ్ రూమ్ లు తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించినారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారికి మోనూ ప్రకారం భోజనం పెడుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. బీసీ బాలుర వసతి గృహాన్ని కలియతిరిగి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వంటగదిని పరిశీలించి పరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. హాస్టల్ సంక్షేమ అధికారి వంటవారితో మాట్లాడి విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత పాటిస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిశుభ్ర వాతావరణంలో వండించి ఇవ్వాలని కలెక్టర్ ఈ సందర్శంగా హాస్టల్ సంక్షేమాధికారిని ఆదేశించారు. మెనూ ప్రకారం ఆహారం అందించకపోతే తమకు తెలియజేయాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. బీసీ బాలుర వసతి గృహంలో ఉన్న 150 మంది విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్వహణ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ లైట్లు ఏమైనా రిపేరు ఉంటే తక్షణమే చేయించాలని, చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాజా అప్సర్ నాజిమ్ అలీ, కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, వెల్దండ తాహసిల్దార్ కార్తీక్ కుమార్, ఎంపీడీవో సత్యపాల్, వార్డెన్ రామకృష్ణ తదితరులు వెంట ఉన్నారు.