ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నల్గొండ – హరిత నల్గొండ సాధ్యం: పారిశుధ్య పనులపై కమిషనర్ ఆకస్మిక తనిఖీలు గౌరవ రోడ్లు & భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆదేశాలు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారి మార్గదర్శకాలు మేరకు, నల్గొండ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఈరోజు ఉదయం 12వ, 27వ, 28వ డివిజన్లలో పారిశుధ్య కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శానిటరీ సూపర్వైజర్ శ్రీ గడ్డం శ్రీనివాస్, శానిటరీ జవాన్ శ్రీ కె. పరశురామ్ లతో కలిసి డివిజన్లలో జరుగుతున్న రోడ్ల స్వీపింగ్, డ్రైన్లలో సిల్ట్ తొలగింపు, డోర్ టు డోర్ చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశీలనలో భాగంగా కమిషనర్ గారు సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్, చెత్తను వెంటనే తొలగించి నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, ప్రతిరోజూ స్వీపింగ్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, అలాగే కమర్షియల్ ఏరియాల్లో ప్రతిరోజూ విధిగా చెత్త సేకరణ జరగాలని సూచించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి ఇంటి నుండి తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరించాలన్నారు. గృహస్థులు తడి-పొడి వ్యర్థాలను వేరు చేసి ఇవ్వడం ద్వారా వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి Zero Land Filling లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు ప్రతి ఇంటి వారు తమ గృహ వ్యర్థాలను వీధుల్లో, ఖాళీ స్థలాల్లో లేదా డ్రైన్లలో వేయకుండా, తప్పనిసరిగా మున్సిపల్ శానిటేషన్ వాహనాలకే అందించాలని విజ్ఞప్తి చేశారు. “ఇంటి చెత్తను శానిటేషన్ వాహనాలకే ఇవ్వండి – నల్గొండను పరిశుభ్రంగా ఉంచండి” అని పౌరులకు పిలుపునిచ్చారు. అలాగే శానిటరీ సూపర్వైజర్లు ప్రతిరోజూ ఫీల్డ్ మానిటరింగ్ నిర్వహించి పారిశుధ్య కార్యకలాపాలను పర్యవేక్షించాలని, ప్రజల నుండి వచ్చే పారిశుధ్య ఫిర్యాదులు, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దోమల నివారణ, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కటే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచలేదని, ప్రజల సహకారం లేకుండా “స్వచ్ఛ నల్గొండ – హరిత నల్గొండ” లక్ష్యం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే నల్గొండను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. నల్గొండ ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్‌కు సహకరించి, ఇంటి చెత్తను వాహనాలకు మాత్రమే అందించడం, చెత్త వేరు చేయడం, డ్రైన్లలో వ్యర్థాలు వేయకపోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ గారు కోరారు. ప్రజల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ నల్గొండ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “స్వచ్ఛత ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు – అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత” అని కమిషనర్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ శ్రీ గడ్డం శ్రీనివాస్, శానిటరీ జవాన్ శ్రీ కె. పరశురామ్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. నగర పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా పారిశుధ్య కార్యక్రమాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయబడతాయని తెలిపారు.
ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నల్గొండ – హరిత నల్గొండ సాధ్యం: పారిశుధ్య పనులపై కమిషనర్ ఆకస్మిక తనిఖీలు గౌరవ రోడ్లు & భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆదేశాలు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారి మార్గదర్శకాలు మేరకు, నల్గొండ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఈరోజు ఉదయం 12వ, 27వ, 28వ డివిజన్లలో పారిశుధ్య కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శానిటరీ సూపర్వైజర్ శ్రీ గడ్డం శ్రీనివాస్, శానిటరీ జవాన్ శ్రీ కె. పరశురామ్ లతో కలిసి డివిజన్లలో జరుగుతున్న రోడ్ల స్వీపింగ్, డ్రైన్లలో సిల్ట్ తొలగింపు, డోర్ టు డోర్ చెత్త
సేకరణ, పారిశుధ్య నిర్వహణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశీలనలో భాగంగా కమిషనర్ గారు సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్, చెత్తను వెంటనే తొలగించి నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, ప్రతిరోజూ స్వీపింగ్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, అలాగే కమర్షియల్ ఏరియాల్లో ప్రతిరోజూ విధిగా చెత్త సేకరణ జరగాలని సూచించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి ఇంటి నుండి తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరించాలన్నారు. గృహస్థులు తడి-పొడి వ్యర్థాలను వేరు చేసి ఇవ్వడం ద్వారా వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి Zero Land Filling లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు ప్రతి ఇంటి వారు తమ గృహ వ్యర్థాలను వీధుల్లో,
ఖాళీ స్థలాల్లో లేదా డ్రైన్లలో వేయకుండా, తప్పనిసరిగా మున్సిపల్ శానిటేషన్ వాహనాలకే అందించాలని విజ్ఞప్తి చేశారు. “ఇంటి చెత్తను శానిటేషన్ వాహనాలకే ఇవ్వండి – నల్గొండను పరిశుభ్రంగా ఉంచండి” అని పౌరులకు పిలుపునిచ్చారు. అలాగే శానిటరీ సూపర్వైజర్లు ప్రతిరోజూ ఫీల్డ్ మానిటరింగ్ నిర్వహించి పారిశుధ్య కార్యకలాపాలను పర్యవేక్షించాలని, ప్రజల నుండి వచ్చే పారిశుధ్య ఫిర్యాదులు, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దోమల నివారణ, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కటే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచలేదని, ప్రజల సహకారం లేకుండా “స్వచ్ఛ నల్గొండ – హరిత నల్గొండ” లక్ష్యం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది, ప్రజలు సమన్వయంతో
పనిచేస్తేనే నల్గొండను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. నల్గొండ ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్‌కు సహకరించి, ఇంటి చెత్తను వాహనాలకు మాత్రమే అందించడం, చెత్త వేరు చేయడం, డ్రైన్లలో వ్యర్థాలు వేయకపోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ గారు కోరారు. ప్రజల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ నల్గొండ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “స్వచ్ఛత ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు – అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత” అని కమిషనర్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ శ్రీ గడ్డం శ్రీనివాస్, శానిటరీ జవాన్ శ్రీ కె. పరశురామ్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. నగర పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా పారిశుధ్య కార్యక్రమాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయబడతాయని తెలిపారు.
- నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్‌కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- Post by Tagore1
- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్‌మెంట్‌లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్‌తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సంక్షేమ వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరిమిట్ట మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు వసతి గృహాల్లో పారిశుధ్యం, ఆరోగ్యం, మైనర్ రిపేర్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.1