logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో హనుమాన్ స్వాముల సందడి... గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ మాల ధారణ స్వాములు అధిక సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ నిర్వాహకుడు రాజేష్ సహకారంతో ఆలయంలో హనుమాన్ మాల ధారణ స్వాములకు 21 రోజుల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హనుమాన్ స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలలో జైశ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వరల పరుశరాములు మాట్లాడుతూ హనుమాన్ మాలధారణ స్వాములకు 21 రోజు అన్న ప్రసాద్ వితరణ చేపడుతున్నట్లు అయినా అన్నారు.. కార్యక్రమంలో ఆలయ పూజారి మామిడాల నాగసాయి శర్మ, కమిటీ సభ్యులు నూకల తిరుపతి, జక్కనపల్లి సత్తయ్య, బద్దం శ్రీనివాస్ రెడ్డి, హనుమాన్ మాలాధారణ స్వాములు పాల్గొన్నారు

1 hr ago
user_Vodnala thirupthi
Vodnala thirupthi
గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago
6f5d944a-513d-4801-9734-13ae03e2e9b4

మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో హనుమాన్ స్వాముల సందడి... గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ మాల ధారణ స్వాములు అధిక సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ నిర్వాహకుడు రాజేష్ సహకారంతో ఆలయంలో హనుమాన్ మాల ధారణ స్వాములకు 21 రోజుల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో

604c573f-f709-4cae-b192-ddaf9fe7d086

భాగంగా మంగళవారం హనుమాన్ స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలలో జైశ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వరల పరుశరాములు మాట్లాడుతూ హనుమాన్ మాలధారణ స్వాములకు 21 రోజు అన్న ప్రసాద్ వితరణ చేపడుతున్నట్లు అయినా అన్నారు.. కార్యక్రమంలో ఆలయ పూజారి మామిడాల నాగసాయి శర్మ, కమిటీ సభ్యులు నూకల తిరుపతి, జక్కనపల్లి సత్తయ్య, బద్దం శ్రీనివాస్ రెడ్డి, హనుమాన్ మాలాధారణ స్వాములు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి *సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ మిషన్స్ డొనేషన్* యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో * ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై సానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో జెండర్ సమానత్వం పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి యువత మీ కళలు సాకారం చేసుకోండి అన్నారు * మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు. శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. డాక్టర్ ఉమేష్ కుమార్ వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ – వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్) డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం, డాక్టర్ సావిత్రి శాతవాహన యూనివర్సిటీ ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    3
    పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి
*సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్  మిషన్స్
డొనేషన్* 
యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో *
ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై  సానిటరీ ప్యాడ్స్  డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు.
అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో
జెండర్ సమానత్వం  
పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి
ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి 
యువత మీ కళలు సాకారం చేసుకోండి
అన్నారు
* మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు  భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 
డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు.  శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 
డాక్టర్ ఉమేష్ కుమార్ 
వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు 
ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో 
ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ –  వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్)
డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 
డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం,
డాక్టర్ సావిత్రి  శాతవాహన యూనివర్సిటీ 
ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 min ago
  • వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి, సరఫరా, రుద్రవరం లోని ఇన్ టెక్ వెల్ ను క్షేత్రస్థాయిలో మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంత్రాల మరమ్మత్తు ఉంటే త్వరితగతిన చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ప్రాజెక్ట్ లలో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.పరిశీలనలో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్య నిర్వాహక ఇంజనీర్లు అన్వర్, సుమలత, డీఈ రాము తదితరులు పాల్గొన్నారు.
    1
    వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి, సరఫరా, రుద్రవరం లోని ఇన్ టెక్ వెల్ ను క్షేత్రస్థాయిలో మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంత్రాల మరమ్మత్తు ఉంటే త్వరితగతిన చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ప్రాజెక్ట్ లలో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.పరిశీలనలో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్య నిర్వాహక ఇంజనీర్లు అన్వర్, సుమలత, డీఈ రాము తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 min ago
  • మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఇండియా కూటమి లోని వారసత్వ పార్టీలే అడ్డుపడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రేకుర్తిలో చెరువు పునర్జీవం పనులను మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు తో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ లో గల్లీ రోడ్డును అమృత్ నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహిళా బిల్లు కు సీఎం రేవంత్ రెడ్డి, స్టాలిన్ అడ్డుపడ్డారని ఆరోపించారు. వారసత్వ కుటుంబ పార్టీలు మాత్రమే మహిళా బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. మహిళలు ఆ పార్టీలను క్షమించరని చెప్పారు. కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని, 140 కోట్ల జనాభా ఉంటే ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉండాలని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ ద్వారా పెంచాలని చూస్తే కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకించిందని తెలంగాణ సమాజం గమనించాలని బండి సంజయ్ కోరారు.
    4
    మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఇండియా కూటమి లోని వారసత్వ పార్టీలే అడ్డుపడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రేకుర్తిలో చెరువు పునర్జీవం పనులను మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు తో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
కరీంనగర్ లో గల్లీ రోడ్డును అమృత్ నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహిళా బిల్లు కు సీఎం రేవంత్ రెడ్డి, స్టాలిన్ అడ్డుపడ్డారని ఆరోపించారు. వారసత్వ కుటుంబ పార్టీలు మాత్రమే మహిళా బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. మహిళలు ఆ పార్టీలను క్షమించరని చెప్పారు.  కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని, 140 కోట్ల జనాభా ఉంటే ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉండాలని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ ద్వారా పెంచాలని చూస్తే కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకించిందని తెలంగాణ సమాజం గమనించాలని బండి సంజయ్ కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
    1
    ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    4
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    42 min ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    23 hrs ago
  • *కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు..*మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..* *అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..* *అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించినా స్పందించని కెసిఆర్..* రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి.. ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడడం తగదు..*కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..* తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు.* ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి ని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు. రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి తో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు.
    4
    *కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు..*మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..*
*అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..*
*అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించినా స్పందించని కెసిఆర్..*
రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి..
ముఖ్యమంత్రి  ఏకవచనంతో మాట్లాడడం తగదు..*కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..* 
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు.* 
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి ని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు. 
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు.
రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు.
ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 
రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్  శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు. 
రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి  సూచించారు.
ముఖ్యమంత్రి తో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.