*కుప్పకూలిన విమానం.. షాకింగ్ విజువల్స్* అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్విల్ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. యు.పి.ఎస్ కార్గో విమానం (యు.పి.ఎస్ 2976) టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఆ విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆ ఫ్లైట్ హవాయ్లోని హొనొలులుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.95వేల లీటర్ల జెట్ ఫ్యూయెల్.. కూలగానే భారీ పేలుడు.యు.ఎస్. లో విమాన ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. Louisville విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా దాని ఇంజిన్లో మంటలు చెలరేగడం వీడియోలో కనిపించింది. ఆ కాసేపటికే అది కుప్పకూలింది. అందులో 95వేల లీటర్ల జెట్ ఫ్యూయెల్ ఉందని, దీనివల్ల పెద్దఎత్తున పేలుడు సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగులపై కూలడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

- కేశంపేట మండల కేంద్రంలో పేటీఎం పేరుతో వ్యాపారులను మోసం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని నకిలీ స్క్రీన్‌షాట్లు చూపించి నగదు తీసుకుని పరారవుతున్నారు. ఇటీవల ఓ జిరాక్స్ షాపులో రూ.16 వేల మోసం చోటుచేసుకుంది. మొదట డబ్బులు పంపినట్టు నమ్మబలికి నగదు తీసుకుని పారిపోయారు. బాధితుడు వెంబడించగా కొంత మొత్తం ఇచ్చి మళ్లీ తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులను నమ్మవద్దని, నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.2
- full night open this hotel purani Haveli request to Hyderabad City Police take action1
- సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ / (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ... కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ రూ.16 కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తంచేశారు.కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు రేపటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.2
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- వికారాబాద్, కొడంగల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమేరా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వినయం కానీ అటువంటి శివశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని సరఫరా గురించి తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అరేయ్ అరేయ్ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతిరోజు ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్మణ్ తెలిపారు.1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.1
- Post by Ali ammu1