ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి వినతి సీఐటీయూ డిమాండ్ మేడ్చల్ జిల్లాలో ఆశా వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న పారితోషికాలను వెంటనే విడుదల చేసి, రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జె. చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు కనీస ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల పారితోషికాలు అందక ఆశా వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు జమయ్యే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.ఆశా వర్కర్లకు రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు రూ.1,500 పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2021 పీఆర్‌సీ ఎరియర్స్, లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, ఎన్నికల విధుల్లో పనిచేసిన బకాయిలను చెల్లించాలని కోరారు.అదనంగా రూ.50 లక్షల ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రసూతి సెలవులు, ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సంక్షేమ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆశా వర్కర్లతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఉన్నికృష్ణ, అనిత, రేవతి, కళ్యాణి, కోమలత, శంకరమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.

- మొక్కజొన్నలు తెచ్చి రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అకాల వర్షాలకు మొలకలు వస్తున్నాయి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి అత్తా కోడళ్ళు వెంటనే రావాలి అంటూ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- తెలంగాణలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రం మద్యం తాగకున్నా 56 పైగా రీడింగ్ చూపిస్తుండటంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1